Best Viewed in Mozilla Firefox, Google Chrome

పోషకాల యాజమాన్యం

• రసాయన ఎరువులతో బాటు సేంద్రీయ ఎరువులను, జీవన ఎరువులను సమతుల్యమైన పద్ధతిలో వాడి భూసారం మరియు వరి పంట ఉత్పాదకత పెంచి, పోషించవచ్చు.
• సిఫార్సు చేసిన నత్రజనిలో 25 -50 % నత్రజనిని పచ్చిరొట్ట పైర్ల ద్వారా, కంపోస్టు, దిబ్బెరువు, కోళ్ళ పెంట వంటివాటి ద్వారా అందచేస్తే స్థిరమైన దిగుబడులు వస్తాయి.
• పొలంలో జీలుగ, జనుము, పిల్లిపెసర లేక మినుములు, పెసలు వంటి అపరాల పంటల అవశేషాలను పచ్చి రొట్టగా వేస్తే భూసారం, ఉత్పాదకత పెరుగుతాయి.
• నీలి ఆకుపచ్చ శైవలాలు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియా వంటి జీవన ఎరువులు వరి పంట యొక్క నత్రజని, భాస్వరం అవసరంలో 10 -20 % వరకూ తీరుస్తాయి.
• రబీ సీజన్లో నత్రజని, భాస్వరం మరియు పోటాష్ ఎరువులను హెక్టారుకు 180 :90 :60 కిలోల చొప్పున వేయాలి. మొత్తం భాస్వరం మరియు పోటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. నత్రజనిన
ఎ)  నారుమడికి సిఫార్సు చేసిన ఎరువులు
  • ఆరోగ్యకరమైన నారు కొరకు దుక్కిలో ప్రతి 100  చ. మీ. నారుమడికి 0.5  కిలోల నత్రజని, 0.5  కిలోల భాస్వరం మరియు 0.5  కిలోల పోటాష్ వేయాలి. విత్తిన 12 రోజులకు మరో 0.5  కిలోల నత్రజని వేయాలి.
  • జింకు లోపాన్ని గమనిస్తే, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు  లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి.
  • నారుమడిలో ఇనుము లోపాన్ని సరిదిద్దేందుకు 5-10  గ్రా. అన్నబేధి లేదా ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్  ను 0.5  నుండి 1.0  గ్రా. నిమ్మఉప్పుతో లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
బి )  ప్రధాన పొలానికి  సిఫార్సు చేసిన ఎరువులు             వ్యవసాయ వాతావరణమండలం నత్రజని (ఎకరాకుకిలోల్లో) భాస్వరం (ఎకరాకుకిలోల్లో) పోటాష్ (ఎకర
కలుపు యాజమాన్యం:

• ముఖ్యంగా నాటిన 45 రోజులవరకూ పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.

• కూలీలు వీలుగా దొరికే ప్రాంతాల్లో నాటిన 20 రోజులకొకసారి, 40 రోజులకొకసారి చేత్తో కలుపు తీయించాలి.

• కలుపు నిర్మూలనకు ఈ మందులలో ఏదైనా ఒకటి పొలంలో పలుచగా నీరు కట్టి చల్లాలి. బ్యుటాక్లోర్ ఎకరానికి 1.25 లీటర్ల చొప్పున (లేదా) అనిలోఫాస్ ఎకరానికి 500 మీ.లీ. చొప్పున (లేదా) ప్రేతిలాక్లోర్ ఎకరానికి 600 మీ.లీ. చొప్పున (లేదా) ఆక్సాడయార్జిల్ 40 గ్రా. చొప్పున (లీటరు నీటిలో కలిపి) నారు నాటిన 3 నుండి 5 రోజులలో చల్లాలి. లేదా నాటిన 8 -12 రోజులకు ఎకరానికి 80 -100 గ్రాముల పైరజోసల్ఫ్యురాన్ ఇథైల్ ను పిచికారీ చేయాలి. లేదా బెన్ సల్ఫ్యురాన్ మిథైల్ ఎకరానికి 35 గ్రా. చొప్పున నాటిన 3 - 25 రోజుల మధ్యన (ప్రీ టు పోస్ట్ ఎమర్జేన్స్) పిచికారీ చెయ్యాలి.

• వెడల్పాటి ఆకుల కలుపు నిర్మూలనకు 2,4 - డి. ఎస్.ఎస్.
నీటి యాజమాన్యం:

• సక్రమమైన నీటి యాజమాన్యంతో పైరు పిలకలు బాగా తొడిగి, పోషకాలను సమర్ధవంతంగా
వినియోగించుకుంటుంది. కలుపు ఉధృతి కూడా తగ్గుతుంది.
• నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా (1 -2 సెం.మీ. మందం) ఉండాలి.
• నాటిన తరువాత, మొక్కలు నిలదొక్కుకునే వరకూ 5 సెం.మీ. లోతు నీరు నిలగట్టాలి.
• పైరు దుబ్బుచేసే సమయంలో పొలంలో నీరు పలుచగా, అంటే 2-3 సెం. మీ. లోతు ఉండాలి.
• అంకురం దశ నుండి గింజ గట్టిపడే వరకూ (కోతకు 10 రోజుల ముందు వరకూ) నీరు 5 సెం.మీ. లోతుండాలి.
• అంకురం దశలోనూ, పూత దశలోనూ, పాలు పోసుకునే సమయంలోను పైరుకు నీటి ఎద్దడి కలుగకూడదు.  
ప్రధాన పొలం :

• ప్రధాన పొలం తయారీకి ముందు వేసవి మధ్యలో భూమిని ఒకటిరెండుసార్లు దున్నాలి. దీనివలన కలుపు మొక్కల వేళ్ళు వెలికి వచ్చి కలుపు మొక్కలు అదుపులో ఉంటాయి. పలు చీడ పీడల గుడ్ల సముదాయాలు, నిద్రావస్థలో ఉన్న దశలూ ఎండబారిన పడతాయి. వేసవి దుక్కుల వలన వేసవిలో లభించిన తేమను కూడా నేల పట్టి ఉంచుకుంటుంది.
• కాలువల ద్వారా నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పచ్చిరొట్ట ఎరువులు వేయడం చాలా మంచిది.
• నారు నాటడానికి 15 రోజుల ముందు నుండీ మురగ దమ్ము చేయడం మొదలు పెట్టాలి.
• ట్రాక్టరుతో కానీ పవర్ టిల్లర్ తో కానీ 15 సెం.మీ. లోతు మురగదమ్ము చేస్తే సరిపోతుంది.
• ఆఖరుసారి మురగ దమ్ము చేసిన తరువాత పొలాన్ని బాగా చదును చేసి, నట్లు వేయడానికి ముందు 2 -3 రోజులు అలాగే వదిలెయ్యాలి. బరువు నేలలలో నీటి యాజమాన్యానికి, కలుపు నివారణకు ఇది తోడ్పడుతుంది.
• నాలుగు నుండి ఆర
నారుమడి యాజమాన్యం (మాగాణి భూముల్లో):

• నీరు పెట్టడానికి, తియ్యడానికి వీలుగా ఉండే భూమిని ఎంచుకోవాలి.
• విత్తడానికి ఒక నెల ముందుగానే నారుమడిని సిద్ధం చేసుకోవాలి.
• నారుమడిని వేసవిలో రెండుసార్లు దున్ని, ఆ తర్వాత 5-6 రోజుల వ్యవధితో 3 -4 దఫాలు దమ్ము చేయాలి.
• ఆఖరి దమ్ము తర్వాత భూమిని చదును చేసి, నీరుపెత్తదానికి, తియ్యడానికి వీలుగా కాలువలు ఏర్పరుస్తూ మీటరు వెడల్పున, అనుకూలమైన పొడవున ఎత్తుగా మళ్ళు చేసుకోవాలి.
• నేల స్వభావాన్ని మెరుగుపరిచేందుకు బాగా చివికిన పశువుల ఎరువు/ కంపోస్టు 5 సెంట్లకు 200 కిలోల చొప్పున వేయాలి.
• వరి విత్తనాన్ని 16 -24 గంటలు నానబెట్టి, మరో 24 - 36 గంటలు ఉంచి, నాటే ముందు మొలక కట్టించాలి.
• 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని (4.4 కిలోల యూరియా), ఒక కిలో `P2O5’ (6.25 కిలోల ఎస్.ఎస్.పి.) మరియు 1 కిలో `K2O’ (1.7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్) వ
విత్తనమోతాదు ఎకరానికి:

• నాటడానికి 20-25 కిలోలు,
• నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
• శ్రీ పద్ధతికి 2 కిలోలు 
రకం కాలం(రోజులలో) దిగుబడి (ఎకరానికి టన్నులలో) చీడపీడలు తట్టుకోగలశక్తి   ప్రత్యేక లక్షణాలు సురేఖ 135 2.5 ఉల్లికోడు గింజ  సన్నం ఎం.టి.యు. 1010 125 3.0 బి.పి.హెచ్. (దోమ),    అగ్గితెగులు  (టి) మిక్కిలి సన్న బియ్యం కృష్ణ హంస 115-120 2.5 అగ్గితెగులు చలిని తట్టుకుంటుంది రాశి 115 2.0 - వర్షాధార పరిస్థితులకి  అనుకూలం కేశవ 120-125 2.5 ఉల్లికోడు గింజ  సన్నం పోతన 125 2.5 ఉల్లికోడు,  కాండం  తొలుచు పురుగు (టి) గింజ  సన్నం సత్య 120 2.5 అగ్గితెగులు గింజ  సన్నం తెల్లహంస 125 2.5 అగ్గితెగులు ,  ఆకు ఎండు తెగులు పొడవు గింజ రకం వికాస్ 120-125 2.5 - మిక్కిలి సన్న బియ్యం తారామతి 130 2.7 ఉల్లికోడు,  షీట్ రాట్ మరపట్టడానికి, వండడానికి బాగుండే సన్నగింజ రకం. చేను మీద పడిపోదు నెల్లూరు మషూరి 125 3.0 అగ్గితెగులు సన్న గింజ, పొట్టిగా ఉండే
పరిస్థితి దక్షిణ తెలంగాణా మండలానికిసిఫార్సు చేయబడినవరిరకాలు రబీసీజన్లోమామూలుగా  నాటుకుందుకు సత్య, తెల్లహంస, కేశవ, సురేఖ, కాటన్ దొరసన్నాలు (ఎం.టి.యు. 1010),  తారామతి (ఆర్.ఎన్.ఆర్. 23064),   నెల్లూరు మషూరి (ఎన్.ఎల్.ఆర్. 34449), ఆర్.ఎన్.ఆర్. 2465  (సుగంద్ సాంబ), జే.జి.ఎల్. 11470 (జగిత్యాల మషూరి),  జే.జి.ఎల్ 3855(కరీంనగర్సాంబ) ఉప్పు నేలలు వికాస్, సోమశిల( ఎన్.ఎల్.ఆర్. 33358) రబీ సీజన్లో ఆలస్యంగానాటుకుందుకు రాశి, కృష్ణహంస, పోతన దోమపోటుఅధికంగాగలప్రాంతాలు కాటన్దొరసన్నాలు (ఎం.టి.యు. 1010) మినికిట్పధకంలోనిరకాలు జే.జి.ఎల్  11727,  ఆర్.ఎన్.ఆర్.  - సి-28, WGL 44
ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ తెలంగాణా మండలంలోకి వచ్చే జిల్లాలు :
• మహబూబ్ నగర్
• రంగారెడ్డి
• నల్గొండ  
Copy rights | Disclaimer | RKMP Policies