Best Viewed in Mozilla Firefox, Google Chrome

నారుమడి యాజమాన్యం (మాగాణి భూముల్లో):

• నీరు పెట్టడానికి, తియ్యడానికి వీలుగా ఉండే భూమిని ఎంచుకోవాలి.
• విత్తడానికి ఒక నెల ముందుగానే నారుమడిని సిద్ధం చేసుకోవాలి.
• నారుమడిని వేసవిలో రెండుసార్లు దున్ని, ఆ తర్వాత 5-6 రోజుల వ్యవధితో 3 -4 దఫాలు దమ్ము చేయాలి.
• ఆఖరి దమ్ము తర్వాత భూమిని చదును చేసి, నీరుపెత్తదానికి, తియ్యడానికి వీలుగా కాలువలు ఏర్పరుస్తూ మీటరు వెడల్పున, అనుకూలమైన పొడవున ఎత్తుగా మళ్ళు చేసుకోవాలి.
• నేల స్వభావాన్ని మెరుగుపరిచేందుకు బాగా చివికిన పశువుల ఎరువు/ కంపోస్టు 5 సెంట్లకు 200 కిలోల చొప్పున వేయాలి.
• వరి విత్తనాన్ని 16 -24 గంటలు నానబెట్టి, మరో 24 - 36 గంటలు ఉంచి, నాటే ముందు మొలక కట్టించాలి.
• 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని (4.4 కిలోల యూరియా), ఒక కిలో `P2O5’ (6.25 కిలోల ఎస్.ఎస్.పి.) మరియు 1 కిలో `K2O’ (1.7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్) వ
విత్తనమోతాదు ఎకరానికి

• నాటడానికి 20-25 కిలోలు,
• నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
• శ్రీ పద్ధతికి 2 కిలోలు  

రకం కాలం(రోజులలో) దిగుబడి (ఎకరానికి  టన్నులలో) చీడపీడలు తట్టుకోగలశక్తి   ప్రత్యేక లక్షణాలు ఎం.టి.యు. 1001 120 2.5 బి.పి.హెచ్. (దోమ),    అగ్గితెగులు గింజ  సన్నం ఎం.టి.యు. 1010 125 3.0 బి.పి.హెచ్. (దోమ),    అగ్గితెగులు (టి) మిక్కిలి సన్న బియ్యం Pushkala 105 2.0 - గింజ  సన్నం వికాస్ 120-125 2.5 - మిక్కిలి సన్న బియ్యం సోమశిల 105-110 2.5 అగ్గితెగులు మిక్కిలి సన్న బియ్యం శ్రీ సత్య 110-120 2.5 ఉల్లికోడు బయోటైపు IV గింజ  సన్నం,  నేరుగా విత్తుటకు అనువైనది నెల్లూరు మషూరి 120 3.0 అగ్గితెగులు గింజ  సన్నం,  చేనులో పడిపోదు   నీటి పారుదల కింద పండించడానికి అనువైనది జగిత్యాల సన్నాలు 125 3.0 ఉల్లికోడు   గింజ  సన్నం, చేనులో పడిపోదు
విషయం :

పరిస్థితి ఉత్తర కోస్తా మండలానికిసిఫార్సు చేయబడినవరిరకాలు రబీ సీజన్లో మామూలుగా  నాటుకుందుకు పుష్కల, కాటన్ దొర సన్నాలు (ఎం.టి.యు. 1010),  విజేత  (ఎం.టి.యు. 1001),   శ్రీ సత్య (ఆర్.జి.ఎల్. 1880),   జే.జి.ఎల్. 1798 (జగిత్యాల సన్నాలు),   ఎన్.ఎల్.ఆర్. 34449 (నెల్లూరు మషూరి )   ఉప్పు నేలలు వికాస్, సోమశిల (ఎన్.ఎల్.ఆర్. 33358) రబీ సీజన్లో  ఆలస్యంగా నాటుకుందుకు పుష్కల, కాటన్ దొర సన్నాలు (ఎం.టి.యు. 1010) దోమ పోటు అధికంగా గల ప్రాంతాలు కాటన్ దొర సన్నాలు (ఎం.టి.యు. 1010),  విజేత (ఎం.టి.యు. 1001)
ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా మండలంలోకి వచ్చే జిల్లాలు

• శ్రీకాకుళం
• విజయనగరం మరియు
• విశాఖపట్నం
1. వెన్నులో కనీసం 75 % గింజలు పక్వానికి వచ్చినప్పుడు కోత కోయాలి. సరిగా పక్వానికి రాకముందు కోసినట్లయితే గింజలు జీవ శక్తిని కోల్పోతాయి.
2. కోసిన పంటను పొలంలోనే 2-3 రోజులు ఆరబెట్టాలి
3. ధాన్యం నూర్చి, తూర్పారబట్టాక ధాన్యంలో ఇతర పదార్ధాలేమీ లేకుండా చూసుకోవాలి.
4. గింజలోని తేమ 13 శాతానికి తగ్గేవరకూ తూర్పారబట్టిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలి.
5. ధాన్యాన్ని తక్కువ ఆరబెట్టినా, ఎక్కువ ఆరబెట్టినా ప్రాసెస్సింగ్ సమయంలో గింజ విరిగిపోతుంది.
6. ధాన్యం నిలువ ఉంచినప్పుడు తేమ అధికంగా ఉంటే శ్వాసక్రియ అధికంగా జరగడం వలన, పురుగులు, శిలీంద్రాలు ఆశించడం వలన గింజలు జీవశక్తిని కోల్పోతాయి.  
1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :

• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి.
• గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం.
• ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి.
• దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి.
• వరి నాట్లు వేసిన దగ్గరనుండి, పూత దశవరకూ హెక్టారుకు 5 చొప్పున ఎర స్థావరాలను గట్టు నుండి ఒక మీటరు లోపలికి పొలానికి నాలుగు మూలలా నాలుగు, పొలం మధ్యలో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో ఎర స్థావరంలో 30 గ్రా. బ్రోమడయలోన్ ఎర ఉంచాలి. వారానికి రెండుసార్లు ఎరను మార్చాలి.
• పంటకాలంలో చిరుపొట్ట దశకు ముందు 0.005% బ్రోమోడయోలోన్ ఎరలు ఉపయోగించాలి • చిరుపొట్ట దశనుండి పంట కోత సమయం వరకు ఎ.పి.ఆర్.ఆర్.ఐ. & ఆర్.ఎ.ఆర్.ఎస్., మారుటేరు వారు రూపొందించిన "బర్రో ఫ్యుమ
  క్ర. సం. చీడపురుగు పంట దశ ఆర్ధికంగా నష్టాన్ని కలిగించే స్థాయి 1 కాండంతొలుచు పురుగు నారుమడి మరియు పిలక దశ చదరపు మీటరుకు ఒక తల్లి  పురుగు లేదా ఒక గుడ్ల సముదాయం (లేదా)  5 % చచ్చిన మొవ్వులు 2 ఉల్లికోడు పురుగు నారుమడి మరియు పిలక దశ దుబ్బుకి ఒక కోడు సోకిన పిలక లేదా చ.మీ. 5 % ఉల్లి గొట్టాలు 3 సుడి దోమ పిలక దశ దుబ్బుకి 10 -15  పురుగులు పూతదశ తర్వాత దుబ్బుకి 20 -25  పురుగులు 4 ఆకుముడుత పురుగు అన్ని దశలు  దుబ్బుకి ఒకటి రెండు పురుగు సోకిన ఆకులు 5 హిస్పా పిలక దశ దుబ్బుకి 2  పెంకు పురుగులు లేదా 2 పురుగు ఆశించిన ఆకులు 6 పచ్చదీపపు పురుగులు నారుమడి చదరపు మీటరుకు  ఒకటి  రెండు పురుగులు పిలక దశ దుబ్బుకి 10  పురుగులు పూత దశ దుబ్బుకి 20  పురుగులు 7 కంపు నల్లి పూత దశ దుబ్బుకి  ఒకటి రెండు పెద్ద  పు
పూత తర్వాత దశలో
సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్.) :

• ఈనిక దశలో సిఫార్సు చేసిన మందులను వాడాలి.
కట్వర్మ్స్ (మొక్కలను కోరికివేసే గొంగళి పురుగులు) :

• పొలానికి నీరుపెట్టి సాయంకాలం వేళల్లో ఈ మందులు లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి - డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + ఎండోసల్ఫాన్ 2.0 మీ.లీ. (లేదా) డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ.  
అంకురందశనుండి ఈనిక దశవరకు
సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్). :

• ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మీ.లీ. లేదా ఎతోఫెన్ ప్రాక్స్ 2.0 మీ.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి .లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
• మొక్కల అడుగు భాగం బాగా తడిచేలా మందును (ఎకరానికి 200 లీ. ద్రవం) పిచికారీ చెయ్యాలి.
• పురుగు మందులను, సింథటిక్ పైరెత్రాయిడ్స్ ను కలిపి పిచికారీ చేయకూడదు.
• రెండవసారి పిచికారీచేయవలసి వస్తే వేరు వేరు వర్గాలకు చెందిన మందులను మార్చి మార్చి ఉపయోగించాలి.

కాండం తొలుచు పురుగు :

• కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 డబ్ల్యు.పి. 2.0 గ్రా. లేదా ఎసిప్జేట్ 1.5 గ్రా. లేదా ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా కార్టాప్ హైడ్రో
Copy rights | Disclaimer | RKMP Policies