Best Viewed in Mozilla Firefox, Google Chrome

కలుపు యాజమాన్యం:

• ముఖ్యంగా నాటిన 45 రోజులవరకూ పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.
• కూలీలు వీలుగా దొరికే ప్రాంతాల్లో నాటిన 20 రోజులకొకసారి, 40 రోజులకొకసారి చేత్తో కలుపు తీయించాలి.
• కలుపు నిర్మూలనకు ఈ మందులలో ఏదైనా ఒకటి పొలంలో పలుచగా నీరు కట్టి చల్లాలి. బ్యుటాక్లోర్ ఎకరానికి 1.25 లీటర్ల చొప్పున (లేదా) అనిలోఫాస్ ఎకరానికి 500 మీ.లీ. చొప్పున (లేదా) ప్రేతిలాక్లోర్ ఎకరానికి 600 మీ.లీ. చొప్పున (లేదా) ఆక్సాడయార్జిల్ 40 గ్రా. చొప్పున (లీటరు నీటిలో కలిపి) నారు నాటిన 3 నుండి 5 రోజులలో చల్లాలి. లేదా నాటిన 8 -12 రోజులకు ఎకరానికి 80 -100 గ్రాముల పైరజోసల్ఫ్యురాన్ ఇథైల్ ను పిచికారీ చేయాలి. లేదా బెన్ సల్ఫ్యురాన్ మిథైల్ ఎకరానికి 35 గ్రా. చొప్పున నాటిన 3 - 25 రోజుల మధ్యన (ప్రీ టు పోస్ట్ ఎమర్జేన్స్) పిచికారీ చెయ్యాలి.
• వెడల్పాటి ఆకుల కలుపు నిర్మూలనకు 2,4 - డి. ఎస్.ఎస్. ఎకరాని
నీటి యాజమాన్యం:

• సక్రమమైన నీటి యాజమాన్యంతో పైరు పిలకలు బాగా తొడిగి, పోషకాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటుంది. కలుపు ఉధృతి కూడా తగ్గుతుంది.
• నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా (1 -2 సెం.మీ. మందం) ఉండాలి.
• నాటిన తరువాత, మొక్కలు నిలదొక్కుకునే వరకూ 5 సెం.మీ. లోతు నీరు నిలగట్టాలి.
• పైరు దుబ్బుచేసే సమయంలో పొలంలో నీరు పలుచగా, అంటే 2-3 సెం. మీ. లోతు ఉండాలి.
• అంకురం దశ నుండి గింజ గట్టిపడే వరకూ (కోతకు 10 రోజుల ముందు వరకూ) నీరు 5 సెం.మీ. లోతుండాలి.
• అంకురం దశలోనూ, పూత దశలోనూ, పాలు పోసుకునే సమయంలోను పైరుకు నీటి ఎద్దడి కలుగకూడదు.  
ప్రధాన పొలం :

• ప్రధాన పొలం తయారీకి ముందు వేసవి మధ్యలో భూమిని ఒకటిరెండుసార్లు దున్నాలి. దీనివలన కలుపు మొక్కల వేళ్ళు వెలికి వచ్చి కలుపు మొక్కలు అదుపులో ఉంటాయి. పలు చీడ పీడల గుడ్ల సముదాయాలు, నిద్రావస్థలో ఉన్న దశలూ ఎండబారిన పడతాయి. వేసవి దుక్కుల వలన వేసవిలో లభించిన తేమను కూడా నేల పట్టి ఉంచుకుంటుంది.
• కాలువల ద్వారా నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పచ్చిరొట్ట ఎరువులు వేయడం చాలా మంచిది.
• నారు నాటడానికి 15 రోజుల ముందు నుండీ మురగ దమ్ము చేయడం మొదలు పెట్టాలి.
• ట్రాక్టరుతో కానీ పవర్ టిల్లర్ తో కానీ 15 సెం.మీ. లోతు మురగదమ్ము చేస్తే సరిపోతుంది. • ఆఖరుసారి మురగ దమ్ము చేసిన తరువాత పొలాన్ని బాగా చదును చేసి, నట్లు వేయడానికి ముందు 2 -3 రోజులు అలాగే వదిలెయ్యాలి. బరువు నేలలలో నీటి యాజమాన్యానికి, కలుపు నివారణకు ఇది తోడ్పడుతుంది.
• నాలుగు నుండి ఆరు ఆ
నారుమడి యాజమాన్యం (మాగాణి భూముల్లో):

• నీరు పెట్టడానికి, తియ్యడానికి వీలుగా ఉండే భూమిని ఎంచుకోవాలి.
• విత్తడానికి ఒక నెల ముందుగానే నారుమడిని సిద్ధం చేసుకోవాలి.
• నారుమడిని వేసవిలో రెండుసార్లు దున్ని, ఆ తర్వాత 5-6 రోజుల వ్యవధితో 3 -4 దఫాలు దమ్ము చేయాలి.
• ఆఖరి దమ్ము తర్వాత భూమిని చదును చేసి, నీరుపెత్తదానికి, తియ్యడానికి వీలుగా కాలువలు ఏర్పరుస్తూ మీటరు వెడల్పున, అనుకూలమైన పొడవున ఎత్తుగా మళ్ళు చేసుకోవాలి.
• నేల స్వభావాన్ని మెరుగుపరిచేందుకు బాగా చివికిన పశువుల ఎరువు/ కంపోస్టు 5 సెంట్లకు 200 కిలోల చొప్పున వేయాలి.
• వరి విత్తనాన్ని 16 -24 గంటలు నానబెట్టి, మరో 24 - 36 గంటలు ఉంచి, నాటే ముందు మొలక కట్టించాలి.
• 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని (4.4 కిలోల యూరియా), ఒక కిలో `P2O5’ (6.25 కిలోల ఎస్.ఎస్.పి.) మరియు 1 కిలో `K2O’ (1.7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్) వ
విత్తనమోతాదు ఎకరానికి :

• నాటడానికి 20-25 కిలోలు,
• నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
• శ్రీ పద్ధతికి 2 కిలోలు 
  రకం కాలం(రోజులలో) దిగుబడి (ఎకరానికి టన్నులలో) చీడపీడలు తట్టుకోగలశక్తి   ప్రత్యేక లక్షణాలు దివ్య 125 2.5 ఉల్లికోడు గింజ  సన్నం ఎం.టి.యు. 1010 125 3.0 బి.పి.హెచ్. (దోమ), అగ్గితెగులు (టి) మిక్కిలి సన్న బియ్యం ఎర్రమల్లెలు 120 2.5 ఉల్లికోడు గింజ  సన్నం ఇండుర్  సాంబ 120-125 2.5 ఉల్లికోడు మిక్కిలి సన్న బియ్యం వరంగల్ సన్నాలు 135 2.5 - గింజ  సన్నం రాశి 115 2.0 - వర్షాధార  పరిస్థితులకి అనుకూలం కేశవ 120-125 2.5 ఉల్లికోడు గింజ  సన్నం పోతన 125 2.5 ఉల్లికోడు,  కాండం తొలుచు పురుగు  (టి) గింజ  సన్నం సత్య 120 2.5 అగ్గితెగులు గింజ  సన్నం తెల్లహంస 125 2.5 అగ్గితెగులు , ఆకు ఎండు తెగులు గింజ పొడవు వికాస్ 120-125 2.5 - మిక్కిలి సన్న బియ్యం రామప్ప 125 2.5 ఉల్లికోడు గింజ మధ్యస్థ సన్నం ,  చేనులో పడిపోదు సోమశిల 110 3.0 అగ్గితెగ
  పరిస్థితి ఉత్తరతెలంగాణామండలానికి సిఫార్సుచేయబడినవరిరకాలు రబీ సీజన్లో మామూలుగా నాటుకుందుకు దివ్య, ఎర్రమల్లెలు, ఇండుర్  సాంబ, వరంగల్ సన్నాలు, కాటన్ దొర సన్నాలు (ఎం.టి.యు. 1010), రామప్ప (డబ్ల్యు.జి.ఎల్. 23985), మనైర్ సోన (జే.జి.ఎల్. 3844 ), ఆర్.ఎన్.ఆర్. 2465  (సుగంద్ సాంబ), జే.జి.ఎల్. 11470 (జగిత్యాల్ మషురి), జే.జి.ఎల్. 3855 (కరీంనగర్ సాంబ) ఉప్పు నేలలు వికాస్, సోమశిల (ఎన్.ఎల్.ఆర్. 33358) రబీ సీజన్లో  ఆలస్యంగా నాటుకుందుకు సత్య, తెల్లహంస, రాశి, కేశవ, పోతన దోమ పోటు అధికంగా గల ప్రాంతాలు కాటన్ దొర సన్నాలు (ఎం.టి.యు. 1010) మినికిట్ పధకంలోని రకాలు జే.జి.ఎల్. 11727, జే.జి.ఎల్. 13595, డబ్ల్యు.జి.ఎల్  44
ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తర తెలంగాణా మండలంలోకి వచ్చే జిల్లాలు :

• ఆదిలాబాద్
• నిజామాబాద్ మరియు
• కరీంనగర్  
1. వెన్నులో కనీసం 75 % గింజలు పక్వానికి వచ్చినప్పుడు కోత కోయాలి. సరిగా పక్వానికి రాకముందు కోసినట్లయితే గింజలు జీవ శక్తిని కోల్పోతాయి.
2. కోసిన పంటను పొలంలోనే 2-3 రోజులు ఆరబెట్టాలి.
3. ధాన్యం నూర్చి, తూర్పారబట్టాక ధాన్యంలో ఇతర పదార్ధాలేమీ లేకుండా చూసుకోవాలి.
4. గింజలోని తేమ 13 శాతానికి తగ్గేవరకూ తూర్పారబట్టిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలి.
5. ధాన్యాన్ని తక్కువ ఆరబెట్టినా, ఎక్కువ ఆరబెట్టినా ప్రాసెస్సింగ్ సమయంలో గింజ విరిగిపోతుంది.
6. ధాన్యం నిలువ ఉంచినప్పుడు తేమ అధికంగా ఉంటే శ్వాసక్రియ అధికంగా జరగడం వలన, పురుగులు, శిలీంద్రాలు ఆశించడం వలన గింజలు జీవశక్తిని కోల్పోతాయి.  
1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :

• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి.
• గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం.
• ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి.
• దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి.
• వరి నాట్లు వేసిన దగ్గరనుండి, పూత దశవరకూ హెక్టారుకు 5 చొప్పున ఎర స్థావరాలను గట్టు నుండి ఒక మీటరు లోపలికి పొలానికి నాలుగు మూలలా నాలుగు, పొలం మధ్యలో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో ఎర స్థావరంలో 30 గ్రా. బ్రోమడయలోన్ ఎర ఉంచాలి. వారానికి రెండుసార్లు ఎరను మార్చాలి.
• పంటకాలంలో చిరుపొట్ట దశకు ముందు 0.005% బ్రోమోడయోలోన్ ఎరలు ఉపయోగించాలి • చిరుపొట్ట దశనుండి పంట కోత సమయం వరకు ఎ.పి.ఆర్.ఆర్.ఐ. & ఆర్.ఎ.ఆర్.ఎస్., మారుటేరు వారు రూపొందించిన "బర్రో ఫ్యుమ
Copy rights | Disclaimer | RKMP Policies