Best Viewed in Mozilla Firefox, Google Chrome

ఎ)  నారుమడికి సిఫార్సు చేసిన ఎరువులు
  • ఆరోగ్యకరమైననారుకొరకుదుక్కిలోప్రతి 100  చ. మీ. నారుమడికి 0.5  కిలోల నత్రజని, 0.5  కిలోల భాస్వరం మరియు 0.5  కిలోల పోటాష్ వేయాలి. విత్తిన 12 రోజులకు మరో 0.5  కిలోలనత్రజనివేయాలి.
  • జింకులోపాన్నిగమనిస్తే, ఆలోపాన్ని సరిదిద్దేందుకు  లీటరునీటికి 2 గ్రా. జింకుసల్ఫేటుద్రావణాన్నిపిచికారీచెయ్యాలి.
  • నారుమడిలోఇనుములోపాన్నిసరిదిద్దేందుకు 5-10  గ్రా. అన్నబేధిలేదా ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్  ను 0.5  నుండి 1.0  గ్రా. నిమ్మఉప్పుతోలీటరునీటిలోకలిపిపిచికారీచెయ్యాలి.
బి )  ప్రధాన పొలానికి  సిఫార్సు చేసిన ఎరువులు   వ్యవసాయ వాతావరణ మండలం నత్రజని (ఎకరాకుకిలోల్లో) భాస్వరం (ఎకరాకుకిలోల్లో) పోటాష్ (ఎకరాకుకిలోల్లో) ఎత్తైన గిరి
కలుపు యాజమాన్యం:

• ముఖ్యంగా నాటిన 45 రోజులవరకూ పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.
• కూలీలు వీలుగా దొరికే ప్రాంతాల్లో నాటిన 20 రోజులకొకసారి, 40 రోజులకొకసారి చేత్తో కలుపు తీయించాలి.
• కలుపు నిర్మూలనకు ఈ మందులలో ఏదైనా ఒకటి పొలంలో పలుచగా నీరు కట్టి చల్లాలి. బ్యుటాక్లోర్ ఎకరానికి 1.25 లీటర్ల చొప్పున (లేదా) అనిలోఫాస్ ఎకరానికి 500 మీ.లీ. చొప్పున (లేదా) ప్రేతిలాక్లోర్ ఎకరానికి 600 మీ.లీ. చొప్పున (లేదా) ఆక్సాడయార్జిల్ 40 గ్రా. చొప్పున (లీటరు నీటిలో కలిపి) నారు నాటిన 3 నుండి 5 రోజులలో చల్లాలి. లేదా నాటిన 8 -12 రోజులకు ఎకరానికి 80 -100 గ్రాముల పైరజోసల్ఫ్యురాన్ ఇథైల్ ను పిచికారీ చేయాలి. లేదా బెన్ సల్ఫ్యురాన్ మిథైల్ ఎకరానికి 35 గ్రా. చొప్పున నాటిన 3 - 25 రోజుల మధ్యన (ప్రీ టు పోస్ట్ ఎమర్జేన్స్) పిచికారీ చెయ్యాలి.
• వెడల్పాటి ఆకుల కలుపు నిర్మూలనకు 2,4 - డి. ఎస్.ఎస్. ఎకరాని
నీటి యాజమాన్యం:

• సక్రమమైన నీటి యాజమాన్యంతో పైరు పిలకలు బాగా తొడిగి, పోషకాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటుంది. కలుపు ఉధృతి కూడా తగ్గుతుంది.
• నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా (1 -2 సెం.మీ. మందం) ఉండాలి.
• నాటిన తరువాత, మొక్కలు నిలదొక్కుకునే వరకూ 5 సెం.మీ. లోతు నీరు నిలగట్టాలి.
• పైరు దుబ్బుచేసే సమయంలో పొలంలో నీరు పలుచగా, అంటే 2-3 సెం. మీ. లోతు ఉండాలి.
• అంకురం దశ నుండి గింజ గట్టిపడే వరకూ (కోతకు 10 రోజుల ముందు వరకూ) నీరు 5 సెం.మీ. లోతుండాలి.
• అంకురం దశలోనూ, పూత దశలోనూ, పాలు పోసుకునే సమయంలోను పైరుకు నీటి ఎద్దడి కలుగకూడదు.  
ప్రధాన పొలం :

• ప్రధాన పొలం తయారీకి ముందు వేసవి మధ్యలో భూమిని ఒకటిరెండుసార్లు దున్నాలి. దీనివలన కలుపు మొక్కల వేళ్ళు వెలికి వచ్చి కలుపు మొక్కలు అదుపులో ఉంటాయి. పలు చీడ పీడల గుడ్ల సముదాయాలు, నిద్రావస్థలో ఉన్న దశలూ ఎండబారిన పడతాయి. వేసవి దుక్కుల వలన వేసవిలో లభించిన తేమను కూడా నేల పట్టి ఉంచుకుంటుంది.
• కాలువల ద్వారా నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పచ్చిరొట్ట ఎరువులు వేయడం చాలా మంచిది.
• నారు నాటడానికి 15 రోజుల ముందు నుండీ మురగ దమ్ము చేయడం మొదలు పెట్టాలి.
• ట్రాక్టరుతో కానీ పవర్ టిల్లర్ తో కానీ 15 సెం.మీ. లోతు మురగదమ్ము చేస్తే సరిపోతుంది. • ఆఖరుసారి మురగ దమ్ము చేసిన తరువాత పొలాన్ని బాగా చదును చేసి, నట్లు వేయడానికి ముందు 2 -3 రోజులు అలాగే వదిలెయ్యాలి. బరువు నేలలలో నీటి యాజమాన్యానికి, కలుపు నివారణకు ఇది తోడ్పడుతుంది.
• నాలుగు నుండి ఆరు ఆ
నారుమడి యాజమాన్యం (మాగాణి భూముల్లో):

• నీరు పెట్టడానికి, తియ్యడానికి వీలుగా ఉండే భూమిని ఎంచుకోవాలి.
• విత్తడానికి ఒక నెల ముందుగానే నారుమడిని సిద్ధం చేసుకోవాలి.
• నారుమడిని వేసవిలో రెండుసార్లు దున్ని, ఆ తర్వాత 5-6 రోజుల వ్యవధితో 3 -4 దఫాలు దమ్ము చేయాలి.
• ఆఖరి దమ్ము తర్వాత భూమిని చదును చేసి, నీరుపెత్తదానికి, తియ్యడానికి వీలుగా కాలువలు ఏర్పరుస్తూ మీటరు వెడల్పున, అనుకూలమైన పొడవున ఎత్తుగా మళ్ళు చేసుకోవాలి.
• నేల స్వభావాన్ని మెరుగుపరిచేందుకు బాగా చివికిన పశువుల ఎరువు/ కంపోస్టు 5 సెంట్లకు 200 కిలోల చొప్పున వేయాలి.
• వరి విత్తనాన్ని 16 -24 గంటలు నానబెట్టి, మరో 24 - 36 గంటలు ఉంచి, నాటే ముందు మొలక కట్టించాలి.
• 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని (4.4 కిలోల యూరియా), ఒక కిలో `P2O5’ (6.25 కిలోల ఎస్.ఎస్.పి.) మరియు 1 కిలో `K2O’ (1.7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్) వ
విత్తనమోతాదు ఎకరానికి:

• నాటడానికి 20-25 కిలోలు
• నేరుగా విత్తడానికి 16-20 కిలోలు • శ్రీ పద్ధతికి 2 కిలోలు  
  రకం కాలం(రోజులలో) దిగుబడి (ఎకరానికి టన్నులలో) చీడపీడలు తట్టుకోగలశక్తి   ప్రత్యేక లక్షణాలు ఎం.టి.యు.  1001 120 2.5 బి.పి.హెచ్.  (దోమ),    అగ్గితెగులు గింజ  సన్నం ఎం.టి.యు.  1010 125 3.0 బి.పి.హెచ్.  (దోమ),    అగ్గితెగులు  (టి) మిక్కిలి సన్న బియ్యం పుష్కల 105 2.0 - గింజ  సన్నం,  వర్షాధార పరిస్థితులకు అనువైనది రాశి 115 2.0 - వర్షాధార పరిస్థితులకు అనువైనది శ్రీ సత్య 110-120 2.5 ఉల్లికోడు బయోటైపు 4IV గింజ  సన్నం, నేరుగా విత్తడానికి అనువైనది
  పరిస్థితి ఎత్తైన గిరిజన ప్రాంత మండలానికి సిఫార్సుచేయబడినవరిరకాలు రబీ సీజన్లో మామూలుగా నాటుకుందుకు కాటన్ దొర సన్నాలు (ఎం.టి.యు. 1010),  విజేత (ఎం.టి.యు. 1001), పుష్కల రబీ సీజన్లో  ఆలస్యంగా నాటుకుందుకు పుష్కల,  రాశి ,  శ్రీ సత్య (ఆర్.జి.ఎల్. 1880) దోమ పోటు అధికంగా గల ప్రాంతాలు కాటన్ దొర సన్నాలు (ఎం.టి.యు. 1010),
ఆంధ్ర ప్రదేశ్ లోని ఎత్తైన గిరిజన ప్రాంత మండలంలోకి వచ్చే జిల్లాలు

• శ్రీకాకుళం లో కొంత భాగం
• విజయనగరం
• విశాఖపట్నం
• తూర్పు గోదావరి
• ఖమ్మం  
1. వెన్నులో కనీసం 75 % గింజలు పక్వానికి వచ్చినప్పుడు కోత కోయాలి. సరిగా పక్వానికి రాకముందు కోసినట్లయితే గింజలు జీవ శక్తిని కోల్పోతాయి.

2. కోసిన పంటను పొలంలోనే 2-3 రోజులు ఆరబెట్టాలి .

3. ధాన్యం నూర్చి, తూర్పారబట్టాక ధాన్యంలో ఇతర పదార్ధాలేమీ లేకుండా చూసుకోవాలి.

4. గింజలోని తేమ 13 శాతానికి తగ్గేవరకూ తూర్పారబట్టిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలి.

5. ధాన్యాన్ని తక్కువ ఆరబెట్టినా, ఎక్కువ ఆరబెట్టినా ప్రాసెస్సింగ్ సమయంలో గింజ విరిగిపోతుంది.

6. ధాన్యం నిలువ ఉంచినప్పుడు తేమ అధికంగా ఉంటే శ్వాసక్రియ అధికంగా జరగడం వలన, పురుగులు, శిలీంద్రాలు ఆశించడం వలన గింజలు జీవశక్తిని కోల్పోతాయి.  
Copy rights | Disclaimer | RKMP Policies