Best Viewed in Mozilla Firefox, Google Chrome

పూత తర్వాత దశలో

సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్.) :

• ఈనిక దశలో సిఫార్సు చేసిన మందులను వాడాలి. కట్వర్మ్స్ (మొక్కలను కోరికివేసే గొంగళి పురుగులు) : • పొలానికి నీరుపెట్టి సాయంకాలం వేళల్లో ఈ మందులు లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి - డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + ఎండోసల్ఫాన్ 2.0 మీ.లీ. (లేదా) డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ.  
అంకురందశనుండి ఈనిక దశవరకు

సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్). :

• ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మీ.లీ. లేదా ఎతోఫెన్ ప్రాక్స్ 2.0 మీ.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి .లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
• మొక్కల అడుగు భాగం బాగా తడిచేలా మందును (ఎకరానికి 200 లీ. ద్రవం) పిచికారీ చెయ్యాలి.
• పురుగు మందులను, సింథటిక్ పైరెత్రాయిడ్స్ ను కలిపి పిచికారీ చేయకూడదు.
• రెండవసారి పిచికారీచేయవలసి వస్తే వేరు వేరు వర్గాలకు చెందిన మందులను మార్చి మార్చి ఉపయోగించాలి.

కాండం తొలుచు పురుగు :

• కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 డబ్ల్యు.పి. 2.0 గ్రా. లేదా ఎసిప్జేట్ 1.5 గ్రా. లేదా ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా కార్టాప్ హైడ్
దుబ్బు చేసే సమయంలో:

కాండం తొలుచు పురుగు, తామర పురుగులు మరియు హిస్పా:

• మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 20 ఇ.సి. 2.5 మీ.లీ. లేదా ఫాస్ఫామిడాన్ 40 ఎస్.ఎల్. 2.0 మీ.లీ. లీటరు నీటితో కలిపి పిచికారీ చెయ్యాలి.

ఉల్లికోడు పురుగు:

• ఫోరేట్ 10 జి హెక్టారుకు 12.5 కిలోల చొప్పున లేదా కార్బోఫ్యురాన్ 3 జి హెక్టారుకు 25 కిలోల చొప్పున నాటిన 15 రోజులకు 1-2 అంగుళాల లోతు నీటిని నిలువగట్టి వేయాలి.

ఆకు ముడత పురుగు:

• ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ., లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

హిస్పా :

• ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

ఆకు నల్లి :

డైకోఫాల్ 5.0 మి.లీ. లేదా వెట్టబుల్ సల్ఫర్ 3
23
Nov

దక్షిణ మండలంలో సస్యరక్షణ

1. సస్య రక్షణ చర్యలు రెండు రకాలు

• యాజమాన్య పద్ధతులు
• రసాయనిక మందులతో నియంత్రణ

2. రసాయనిక పద్ధతిలో నివారణ, పంట యొక్క వివిధ దశలలో, అంటే దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశ నుండి ఈనిక దశవరకు, మరియు పూత దశ తర్వాత చేపట్టవచ్చు.  
పోషకాల యాజమాన్యం:

• రసాయన ఎరువులతో బాటు సేంద్రీయ ఎరువులను, జీవన ఎరువులను సమతుల్యమైన పద్ధతిలో వాడి భూసారం మరియు వరి పంట ఉత్పాదకత పెంచి, పోషించవచ్చు.
• సిఫార్సు చేసిన నత్రజనిలో 25 -50 % నత్రజనిని పచ్చిరొట్ట పైర్ల ద్వారా, కంపోస్టు, దిబ్బెరువు, కోళ్ళ పెంట వంటివాటి ద్వారా అందచేస్తే స్థిరమైన దిగుబడులు వస్తాయి.
• పొలంలో జీలుగ, జనుము, పిల్లిపెసర లేక మినుములు, పెసలు వంటి అపరాల పంటల అవశేషాలను పచ్చి రొట్టగా వేస్తే భూసారం, ఉత్పాదకత పెరుగుతాయి.
• నీలి ఆకుపచ్చ శైవలాలు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియా వంటి జీవన ఎరువులు వరి పంట యొక్క నత్రజని, భాస్వరం అవసరంలో 10 -20 % వరకూ తీరుస్తాయి.
• రబీ సీజన్లో నత్రజని, భాస్వరం మరియు పోటాష్ ఎరువులను హెక్టారుకు 180 :90 :60 కిలోల చొప్పున వేయాలి. మొత్తం భాస్వరం మరియు పోటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. నత్రజనిని
  ఎ)  నారుమడికి సిఫార్సు చేసిన ఎరువులు
  • ఆరోగ్యకరమైన నారు కొరకు దుక్కిలో ప్రతి 100  చ. మీ. నారుమడికి 0.5  కిలోల నత్రజని, 0.5  కిలోల భాస్వరం మరియు 0.5  కిలోల పోటాష్ వేయాలి. విత్తిన 12 రోజులకు మరో 0.5  కిలోల నత్రజని వేయాలి.
  • జింకు లోపాన్ని గమనిస్తే, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు  లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి.
  • నారుమడిలో ఇనుము లోపాన్ని సరిదిద్దేందుకు 5-10  గ్రా. అన్నబేధి లేదా ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్  ను 0.5  నుండి 1.0  గ్రా. నిమ్మఉప్పుతో లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
బి )  ప్రధాన పొలానికి  సిఫార్సు చేసిన ఎరువులు             వ్యవసాయవాతావరణ మండలం నత్రజని (ఎకరాకుకిలోల్లో) భాస్వరం (ఎకరాకుకిలోల్లో) పోటాష్ (ఎ
కలుపు యాజమాన్యం:

• ముఖ్యంగా నాటిన 45 రోజులవరకూ పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.

• కూలీలు వీలుగా దొరికే ప్రాంతాల్లో నాటిన 20 రోజులకొకసారి, 40 రోజులకొకసారి చేత్తో కలుపు తీయించాలి.

• కలుపు నిర్మూలనకు ఈ మందులలో ఏదైనా ఒకటి పొలంలో పలుచగా నీరు కట్టి చల్లాలి. బ్యుటాక్లోర్ ఎకరానికి 1.25 లీటర్ల చొప్పున (లేదా) అనిలోఫాస్ ఎకరానికి 500 మీ.లీ. చొప్పున (లేదా) ప్రేతిలాక్లోర్ ఎకరానికి 600 మీ.లీ. చొప్పున (లేదా) ఆక్సాడయార్జిల్ 40 గ్రా. చొప్పున (లీటరు నీటిలో కలిపి) నారు నాటిన 3 నుండి 5 రోజులలో చల్లాలి. లేదా నాటిన 8 -12 రోజులకు ఎకరానికి 80 -100 గ్రాముల పైరజోసల్ఫ్యురాన్ ఇథైల్ ను పిచికారీ చేయాలి. లేదా బెన్ సల్ఫ్యురాన్ మిథైల్ ఎకరానికి 35 గ్రా. చొప్పున నాటిన 3 - 25 రోజుల మధ్యన (ప్రీ టు పోస్ట్ ఎమర్జేన్స్) పిచికారీ చెయ్యాలి.

• వెడల్పాటి ఆకుల కలుపు నిర్మూలనకు 2,4 - డి. ఎస్.ఎస్.
నీటి యాజమాన్యం:

• సక్రమమైన నీటి యాజమాన్యంతో పైరు పిలకలు బాగా తొడిగి, పోషకాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటుంది. కలుపు ఉధృతి కూడా తగ్గుతుంది.
• నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా (1 -2 సెం.మీ. మందం) ఉండాలి.
• నాటిన తరువాత, మొక్కలు నిలదొక్కుకునే వరకూ 5 సెం.మీ. లోతు నీరు నిలగట్టాలి.
• పైరు దుబ్బుచేసే సమయంలో పొలంలో నీరు పలుచగా, అంటే 2-3 సెం. మీ. లోతు ఉండాలి.
• అంకురం దశ నుండి గింజ గట్టిపడే వరకూ (కోతకు 10 రోజుల ముందు వరకూ) నీరు 5 సెం.మీ. లోతుండాలి.
• అంకురం దశలోనూ, పూత దశలోనూ, పాలు పోసుకునే సమయంలోను పైరుకు నీటి ఎద్దడి కలుగకూడదు.  
ప్రధాన పొలం:

• ప్రధాన పొలం తయారీకి ముందు వేసవి మధ్యలో భూమిని ఒకటిరెండుసార్లు దున్నాలి. దీనివలన కలుపు మొక్కల వేళ్ళు వెలికి వచ్చి కలుపు మొక్కలు అదుపులో ఉంటాయి. పలు చీడ పీడల గుడ్ల సముదాయాలు, నిద్రావస్థలో ఉన్న దశలూ ఎండబారిన పడతాయి. వేసవి దుక్కుల వలన వేసవిలో లభించిన తేమను కూడా నేల పట్టి ఉంచుకుంటుంది.
• కాలువల ద్వారా నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పచ్చిరొట్ట ఎరువులు వేయడం చాలా మంచిది.
• నారు నాటడానికి 15 రోజుల ముందు నుండీ మురగ దమ్ము చేయడం మొదలు పెట్టాలి.
• ట్రాక్టరుతో కానీ పవర్ టిల్లర్ తో కానీ 15 సెం.మీ. లోతు మురగదమ్ము చేస్తే సరిపోతుంది.
• ఆఖరుసారి మురగ దమ్ము చేసిన తరువాత పొలాన్ని బాగా చదును చేసి, నట్లు వేయడానికి ముందు 2 -3 రోజులు అలాగే వదిలెయ్యాలి. బరువు నేలలలో నీటి యాజమాన్యానికి, కలుపు నివారణకు ఇది తోడ్పడుతుంది.
• నాలుగు నుండి ఆరు
నారుమడి యాజమాన్యం (మాగాణి భూముల్లో):

• నీరు పెట్టడానికి, తియ్యడానికి వీలుగా ఉండే భూమిని ఎంచుకోవాలి. • విత్తడానికి ఒక నెల ముందుగానే నారుమడిని సిద్ధం చేసుకోవాలి.
• నారుమడిని వేసవిలో రెండుసార్లు దున్ని, ఆ తర్వాత 5-6 రోజుల వ్యవధితో 3 -4 దఫాలు దమ్ము చేయాలి.
• ఆఖరి దమ్ము తర్వాత భూమిని చదును చేసి, నీరుపెత్తదానికి, తియ్యడానికి వీలుగా కాలువలు ఏర్పరుస్తూ మీటరు వెడల్పున, అనుకూలమైన పొడవున ఎత్తుగా మళ్ళు చేసుకోవాలి.
• నేల స్వభావాన్ని మెరుగుపరిచేందుకు బాగా చివికిన పశువుల ఎరువు/ కంపోస్టు 5 సెంట్లకు 200 కిలోల చొప్పున వేయాలి.
• వరి విత్తనాన్ని 16 -24 గంటలు నానబెట్టి, మరో 24 - 36 గంటలు ఉంచి, నాటే ముందు మొలక కట్టించాలి.
• 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని (4.4 కిలోల యూరియా), ఒక కిలో `P2O5’ (6.25 కిలోల ఎస్.ఎస్.పి.) మరియు 1 కిలో `K2O’ (1.7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్) వేయ
Copy rights | Disclaimer | RKMP Policies