Best Viewed in Mozilla Firefox, Google Chrome

19
Jul

ఎరువుల వాడకం

ఎరువుల వాడకం

1. నత్రజని

చేయదగిన పనులు:

  • భూసార పరిక్షననుసరించి ఎరువుల వాడకం నిర్ధారించాలి. సార్వలో హెక్టారుకు 60 కిలోల నత్రజని, దాల్వాలో 120 కిలోల నత్రజని వేయుట వలన గణనీయంగా పెంచవచ్చునని పరిశోధనలలో తేలినది.
  • నత్రజని ఎరువులను పైరు కీలక దశలోనే వేయాలి. వేయవలసిన నత్రజనిలో 3వ వంతు ఆఖిరి దమ్ములో లేక నాటే సమయంలోను 3వ వంతు పిలక తొడిగి దుబ్బుచేసే సమయంలోనూ (నాటిన 15-35 రోజులలోపు) మిగతా 3వ వంతు అంకురమేర్పాడు దశలోనూ (నాటిన 30-60 రోజులలోపు) వేయాలి.
  • అమ్మోనియా రూపం లో లేక అమ్మోనియంగా మార్పు చెంది నత్రజనిని ఇవ్వగల ఎరువులను (అమ్మోనియా సల్ఫేటు గాని, యూరియ గాని, కాంప్లెక్స్ ఎరువుల రూపంలోగాని) మాత్రమే వరి పైరుకు వేయుట మిక్కిలి శ్రేయస్కరము.
  • యూరియ ఎరువును పొలములో నీటిని తీసివేసి బురదలో వేయాలి. 48 గంటల తరువాత మరల నీరు పెట్టాలి.

చేయకూడని పనులు:

  • నైట్రే
07
Jul

కలుపు నివారణ

కలుపు నివారణ

చేయదగిన పనులు

  • పైరు నాటిన నుండి 40 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూడాలి.
  • బ్యుటాక్లోర్ (1.25 లీ. 1ఎకరానికి), ప్రిటిలాక్లోర్ (500 మీ.లీ. 1ఎకరానికి), అనిలోఫాస్ (500 మీ.లీ. 1ఎకరానికి) చొప్పున నాటిన 3-5 రోజుల వ్యవధి లో ఎకరానికి 20 కిలోల ఇసుకతో కలిపి చల్లుకోవాలి.
  • వెడల్పు ఆకులు గల కలుపు నివారణకు 2,4-డి – ఇథైల్ ఈస్తేర్ మందుగుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున నాటిన 4 రోజుల తరవాత చల్లుకోవాలి.
  • నాటిన 25 రోజుల పైరులో వెడల్పాకు కలుపు నివారణకు 2,4-డి – సోడియం లవణం (ఫెర్నాక్సోన్) లీటరు నీటికి 2.5గ్రా. చొప్పున కలిపిన మందు ద్రావణం 200 లీ. పైరు తో పిచికారి చేసుకోవాలి.
  • కలుపు మందులు వేసేటప్పుడు పొలంలో పలుచగా నీరుండాలి.
  • కలుపు మందులు పిచికారి చేయుటకు స్ప్రేయర్కు ప్లడ్ జెట్ లేక ప్లేట్ ఫేస్ నాజిల్ ను ఉపయోగించాలి.

చేయకూడని పనులు:

  • కలుపు మందులు వేసిన త
07
Jul

నీటి యాజమాన్యం

నీటి యాజమాన్యం

చేయదగిన పనులు:

  • ఉడ్చిన వెంటనే సుమారు ౩ రోజుల పాటు 5 సెం.మీ.లోతున నీరు నిలగాట్టాలి.
  • ఉడ్చిన 4వ రోజు నుండి పైరు పిలకలు తొడగడం పూర్తీ అయ్యేవరకు మదిలో పలుచగా (2సెం.మీ. లోతున) నీరు కట్టాలి.
  • పైరు అంకురార్పణ దశ నుండి కోతకు సుమారు 10 రోజుల ముందు వరకు మడిలో 5 సెం.మీ.కు. మించి నీరు పెట్టనవసరం లేదు.

చేయకూడని పనులు:

  • వరిలో ఏ దశ లో కూడా 5 సెం. కు మించి నీరు పెట్టనవసరం లేదు.
  • పైరు పిలకలు తొడిగే దశ లో నీరు ఎక్కువ లోతున (2 సెం. మించి) నిలగట్టరాదు.

ప్రధాన పొలాన్ని తయారు చేయడం (ఊడ్పు)

చేయదగిన పనులు:

  • ప్రధాన పొలాన్ని నాతుటకు 15 రోజుల ముందుగ ప్రారంభించిన 5 రోజుల వ్యవధి లో ౩ సార్లు దమ్ము చేసుకోవాలి.
  • సుమారు 25-30 రోజుల వయసుగల నారును నాతుటకు ఉపయోగించాలి.
  • కుదురుకు రెండు మొక్కలు చొప్పున నాట్లు పైపైన వేయాలి.
  • చ.మీ.కు సార్వలో ౩౩ మునలు, దాల్వాలో 44మునలు ఉండేలాచూసుకోవాలి.
  • ముదురు నారు నాటునప్పుడు చ.మీ. 66 మునలు ఉండేలా చూసుకోవాలి.
  • ప్రతి 2 మీ. ఊడ్పుకు 20 సెం.మీ. దారులు విడిచిపెట్టాలి.
  • వరినాట్లు సార్వలో జూలై 15వ తెదిలోపాలను, దాల్వాలో డిసెంబరు 15వ తేది లోపాలను పూర్తీ చేసుకోవాలి.

చేయకూడని పనులు:

  • ముదురు నాటును నాటరాదు.
  • వరిలో గ్రోత్ హార్మోన్ లు వాడరాదు.
03
Jul

వరి యాజమాన్య పద్ధతులు

వరి యాజమాన్య పద్ధతులు

వరి నారుమడి తయారి

చేయదగిన పనులు:

  • నారుమడిని విత్తనము వేయుటకు 10-12 రోజులు ముందు బాగాదున్ని, కలుపు లేకుండా చేసి, చదును చేయాలి.
  • ప్రతి వంద చదరపు మీటర్లకు (21/2 సెంట్లకు అరకిలో నత్రజని, అరకిలో బాస్వరం, అరకిలో పొటాష్ ఎరువులను దుక్కిలోవేయాలి.
  • విత్తిన 12 రోజుల తరువాత అరకిలో నత్రజనిని పై పాటుగా వేయాలి.
  • ప్రతి సెంటు నారుమడికి ౫ కిలోల విత్తనము వేయాలి.
  • విత్తనంను 16-24 గం. నీటిలో నానబెట్టి, 36 గం. మంది కట్టి మొలక వచ్చిన విత్తనాన్ని వేసుకోవాలి.
  • నారు 2,3 ఆకులు తొడిగే వరకు ఆరుతడి పెట్టాలి.

చేయకూడని పనులు:

  • నారు తీయుముందు నత్రజని ఎరువును వేయరాదు.
24
Jun

‘శ్రీ’ వరిసాగు

 

 నీటిని ఆదా చేయుటకై ‘శ్రీ’ వరిసాగు

శ్రీ వరిసాగు ఆవశ్యకత మరియు శ్రీ వరిసాగు పద్ధతి పై అవగాహన

ఆర్.మహేందర్ కుమార్, వి.వినోద్ గౌడ్, కె. సురేఖ, సి.ఎస్.పద్మావతి మరియు యల్.వి సుబ్బారావు

వరి ప్రాధాన్యత మరియు ‘శ్రీ’ వరిసాగు ఆవశ్యకత

        వరి ముఖ్యంగా మన ఆహార, ఆర్ధిక, సాంఘీక నైతికంగా, సంస్కృతీపరంగా మరియు చరిత్రతో ముడిపడి వుంది. 90 శాతము వరకు పండించిన వరి మనదేశంలోనే వినియోగించబడుతోంది. చైనా దేశం ప్రపంచంలో అత్యధిక ఉత్పత్తి (168 వాటా) కలిగి తక్కువ విస్తీర్ణము (29 మీ.హె) వరిసాగు చేయుచున్నది. అదే మనదేశంలో సుమారుగా 4.2 మీ.హె వరిసాగు చేస్తూ కేవలం 121 మీ. టన్నులు మాత్రమే పండించగలుగుచున్నాము. వరి పండించు ముఖ్యమైన దేశాలు, వాటి విస్తీర్ణం, ఉత్పత్తి మరియు దిగుబడి పట్టిక-1 లో

Copy rights | Disclaimer | RKMP Policies