Best Viewed in Mozilla Firefox, Google Chrome

ఎ)  నారుమడికి సిఫార్సు చేసిన ఎరువులు
  •  ఆరోగ్యకరమైన నారు కొరకు ప్రతి 100  చ. మీ. నారుమడికి దుక్కిలో 0.5 కిలోల నత్రజని, 0.5 కిలోల భాస్వరం మరియు 0.5 కిలోల పోటాష్ ఎరువు వేయాలి. విత్తిన  12  రోజులకు మళ్ళీ ఒక 0.5 కిలోల నత్రజని వేయాలి. 
  • జింకు లోపాన్ని గమనిస్తే, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు  లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి.
  • నారుమడిలో ఇనుము లోపాన్ని సరిదిద్దేందుకు 5-10  గ్రా. అన్నబేధి లేదా ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్  ను 0.5  నుండి 1.0  గ్రా. నిమ్మఉప్పుతో లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
  బి )  ప్రధాన పొలానికి  సిఫార్సు చేసిన ఎరువులు                        వ్యవసాయవాతావరణ  మండలం నత్రజని (ఎకరాకుకిలోల్లో) భాస్వరం (ఎకరాకుకిలోల్లో) పోటాష్ (ఎక
• నారు నాటిన మొదటి నాలుగు వారాలూ కలుపును నియంత్రించుకోవాలి (నాటిన 20 రోజులకొకసారి, 40 రోజులకొకసారి చేతితో కలుపు తీయడం ద్వారా).
• గడ్డిజాతి, తుంగజాతి కలుపు మొక్కలు ప్రబలినప్పుడు వాటిని నియంత్రించడానికి బ్యుటక్లోర్ ఎకరానికి 1.25 లీ. చొప్పున (లేదా) ప్రెతిలాక్లోర్ 600 మీ.లీ. (లేదా) అనిలోఫాస్ 500 మీ.లీ., 25 కిలోల ఇసుకతో కలిపి సన్నని నీటి పొరలో నాటిన 3-5 రోజులకు వేయాలి.
• పొలంలో ఊదగడ్డి సమస్య ఉన్నప్పుడు ఎకరానికి 1.25 లీ. బెన్థయోకార్బ్ మేయాలి • వెడల్పాటి ఆకుల కలుపును నివారించడానికి నారు నాటిన 3-5 రోజులకు ఎకరానికి 8-10 కిలోల చొప్పున 2,4 - డి గుళికలను వేయాలి.
• గడ్డిజాతి కలుపు మొక్కలను, తుంగజాతి కలుపును, వెడల్పాటి ఆకుల కలుపును నివారించుకోవడానికి అనిలోఫాస్ ఎకరానికి 400 మి.లీ. చొప్పున (లేదా) బ్యుటాక్లోర్ 800 మి.లీ. చొప్పున, 4-5 కిలోల 2,4 డి తో కలిపి వెయ్యాలి.
• ఆక్సా
• నాట్లు వేయడానికి పది రోజుల ముందే దమ్ము చేసి, ఆ తర్వాత మురగ దమ్ము చేసి, బాగా చదును చేయాలి.
• బరువు నేలలలోను, సారవంతమైన నేలలలోను చ. మీ. కు (20 X 15 సెం. మీ.) 33 మూనలు ఉండేలా చూడాలి.
• తేలిక నేలలలోను, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లోనూ నారును 15 X 15 సెం.మీ. దూరంలో (చ.మీ. కు 44 మూనలు ఉండేలా) నాటుకోవాలి.
• ఆలస్యంగా నాటిన సందర్భాల్లో చ.మీ. కు 44 మూనలు ఉండాలి.
• కలుపు ఉధృతిని తగ్గించడానికి, సమర్ధవంతమైన నీటి యాజమాన్యానికి ప్రధాన పొలాన్ని బాగా చదును చేయాలి
• 25 - 30 రోజుల వయసున్న నారును ఉపయోగించాలి. జులై మూడవ వారంలోపల నాట్లు పూర్తిచేయాలి. కుదురుకు 2-3 మొక్కల చొప్పున నారును పైపైన నాటాలి.  
1. వరి నారుపోసే సమయం : ఆగస్టు 1 వరకు నారుపోసుకోవచ్చు

2. సిఫార్సు చేసిన విత్తనమోతాదు :

• నాటడానికి 20-25 కిలోలు,
• గరువు భూముల్లో వెదజల్లడానికి 25-30 కిలోలు ,
• డెల్టా భూముల్లో నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
• గొర్రుతో నేరుగా విత్తడానికి 30-35 కిలోలు ,
• శ్రీ పద్ధతికి 2 కిలోలు  
రకం  కాలం(రోజులలో)  దిగుబడి  (ఎకరానికి  టన్నులలో) చీడపీడలు తట్టుకోగలశక్తి   ప్రత్యేకలక్షణాలు బి.పి.టి.  5204 145-150 2.8 - గింజ  సన్నం బి.పి.టి.  3291 145 2.5 అగ్గితెగులు గింజ  సన్నం ఎం.టి.యు.  4870 150 2.5 సుడిదోమ ,   ఆకు ఎండు తెగులు (టి) చేనులో పడిపోదు,  గింజ  సన్నం సోమశిల 105-110 2.5 అగ్గితెగులు మిక్కిలి సన్న బియ్యం స్వాతి 125 3.0 అగ్గితెగులు మిక్కిలి సన్న బియ్యం సత్య 120 2.5 అగ్గితెగులు గింజ  సన్నం శ్రావణి 120 3.0 అగ్గితెగులు - ఎం.టి.యు.  5182 150-155 2.5 సుడిదోమ గింజ  సన్నం ఎన్.డి.ఎల్.ఆర్. -8 135 3.0 సుడిదోమ  (టి) గింజ  సన్నం ఎన్.ఎల్.ఆర్. 34449 120 3.0 అగ్గితెగులు చేనులో పడిపోదు,  పొట్టి రకం, ఎరువులకు బాగా స్పందిస్తుంది,  గింజ  సన్నం ఎం.టి.యు.  9993 110 1.2 - వర్షాధార  పరిస్థితులకి  అనుకూలం వరాలు 90-95 1.6 ఉల్లిక
పరిస్థితి తక్కువ వర్షపాత మండలానికి సిఫార్సుచేయబడినవరిరకాలు ఖరీఫ్ సీజన్లో తొందరగా  నాటుకుందుకు - ఖరీఫ్ సీజన్లో నాటుకుందుకు  సాంబ మషూరి, సోన మాషూరి, దీప్తి, నంద్యాల్ సన్నాలు ఖరీఫ్ సీజన్లో ముదురు నాట్లకు సాంబ మషూరి, సోన మాషూరి, ముంపుకు గురయ్యే పల్లపు ప్రాంతాలకి - ఉప్పు నేలలు - ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా నాటుకుందుకు సాంబ మషూరి, సోన మాషూరి, దీప్తి, నంద్యాల్ సన్నాలు, సత్య, స్వాతి, సోమశిల, శ్రావణి, ఎన్.ఎల్.ఆర్. 34449 వర్షాధార ప్రాంతాలు  శ్రీ సత్య, ఎం.టి.యు. 9993, వరాలు ఆరుతడి పరిస్థితి   స్వాతి ,  నంద్యాల్ సన్నాలు సుడిదోమ ఆశించే ప్రాంతాలు దీప్తి,  నంది 
ఆంధ్ర ప్రదేశ్ లో తక్కువ వర్షపాత మండలంలోకి వచ్చే జిల్లాలు :
• కర్నూలు
• అనంతపూర్  
1. వెన్నులో కనీసం 75 % గింజలు పక్వానికి వచ్చినప్పుడు కోత కోయాలి. సరిగా పక్వానికి రాకముందు కోసినట్లయితే గింజలు జీవ శక్తిని కోల్పోతాయి.

2. కోసిన పంటను పొలంలోనే 2-3 రోజులు ఆరబెట్టాలి

3. ధాన్యం నూర్చి, తూర్పారబట్టాక ధాన్యంలో ఇతర పదార్ధాలేమీ లేకుండా చూసుకోవాలి.

4. గింజలోని తేమ 13 శాతానికి తగ్గేవరకూ తూర్పారబట్టిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలి.

5. ధాన్యాన్ని తక్కువ ఆరబెట్టినా, ఎక్కువ ఆరబెట్టినా ప్రాసెస్సింగ్ సమయంలో గింజ విరిగిపోతుంది.

6. ధాన్యం నిలువ ఉంచినప్పుడు తేమ అధికంగా ఉంటే శ్వాసక్రియ అధికంగా జరగడం వలన, పురుగులు, శిలీంద్రాలు ఆశించడం వలన గింజలు జీవశక్తిని కోల్పోతాయి.
1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :

• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి.
• గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం
• ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి
• దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి
• వరి నాట్లు వేసిన దగ్గరనుండి, పూత దశవరకూ హెక్టారుకు 5 చొప్పున ఎర స్థావరాలను గట్టు నుండి ఒక మీటరు లోపలికి పొలానికి నాలుగు మూలలా నాలుగు, పొలం మధ్యలో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో ఎర స్థావరంలో 30 గ్రా. బ్రోమడయలోన్ ఎర ఉంచాలి. వారానికి రెండుసార్లు ఎరను మార్చాలి.
• పంటకాలంలో చిరుపొట్ట దశకు ముందు 0.005% బ్రోమోడయోలోన్ ఎరలు ఉపయోగించాలి
• చిరుపొట్ట దశనుండి పంట కోత సమయం వరకు ఎ.పి.ఆర్.ఆర్.ఐ. & ఆర్.ఎ.ఆర్.ఎస్., మారుటేరు వారు రూపొందించిన "బర్రో ఫ్య
క్ర. సం. చీడపురుగు పంట దశ ఆర్ధికంగా నష్టాన్ని కలిగించే స్థాయి 1 కాండంతొలుచు పురుగు నారుమడి మరియు పిలక దశ చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు  లేదా ఒక గుడ్ల సముదాయం (లేదా) 5 % చచ్చిన మొవ్వులు 2 ఉల్లికోడు పురుగు నారుమడి  మరియు లక దశ దుబ్బుకి ఒక కోడు సోకిన పిలక లేదా చ.మీ. 5 % ఉల్లి గొట్టాలు 3 సుడి దోమ పిలక దశ దుబ్బుకి 10 -15  పురుగులు పూతదశ తర్వాత దుబ్బుకి 20 -25  పురుగులు 4 ఆకుముడుత పురుగు అన్ని దశలు  దుబ్బుకి ఒకటి రెండు పురుగు  సోకిన ఆకులు 5 హిస్పా పిలక దశ దుబ్బుకి 2  పెంకు పురుగులు లేదా 2 పురుగు ఆశించిన ఆకులు 6 పచ్చదీపపు పురుగులు నారుమడి చదరపు మీటరుకు  ఒకటి  రెండు పురుగులు పిలక దశ దుబ్బుకి 10  పురుగులు పూత దశ దుబ్బుకి 20  పురుగులు 7 కంపు నల్లి పూత దశ దుబ్బుకి  ఒకటి రెండు పెద్ద  పు
Copy rights | Disclaimer | RKMP Policies