Best Viewed in Mozilla Firefox, Google Chrome

కాండం కుళ్ళు తెగులు

PrintPrintSend to friendSend to friend

కాండం కుళ్ళు తెగులు

ఆంగ్ల నామం : స్టెం రాట్

తెగులును కలుగచేసే జీవి : స్క్లిరోషియం ఒరైజే

కాండం కుళ్ళు తెగులు లక్షణాలు:

1. ఈ తెగులు మొదట నీటి మట్టానికి దగ్గరగా, వరి మట్టలపై చిన్న నల్లటి మచ్చలుగా కనిపిస్తుంది.

2. ఈ శిలీంద్రం లోపలి మట్ట వరకూ చొచ్చుకునిపోయి కాండం మొదలుదగ్గర కుళ్ళిపోయేలా చేస్తుంది.

3. తెగులు ఆశించిన మొక్క మట్టలపైన, కాండం పైన, కణుపుల లోపల అనేక నల్లటి, గుండ్రటి మెరిసే శిలీంద్ర బీజాలు ఏర్పడతాయి.

4. ఈ తెగులు ఆశించిన ప్రాంతంలో పంట పక్వానికి వచ్చేసరికి ఆకులు పసుపు పచ్చగా మారిపోయి చచ్చిపోతాయి.

File Courtesy: 
రైస్ బ్లాస్ట్ డిసీస్ అండ్ ఇట్స్ మానేజ్మెంట్ (వరి అగ్గి తెగులు, యాజమాన్యం) - డా. కృష్ణవేణి
Image Courtesy: 
ఎ.పి.ఆర్.ఆర్.ఐ., మారుటేరు
Copy rights | Disclaimer | RKMP Policies