Best Viewed in Mozilla Firefox, Google Chrome

వరి నారు పెంచు విధానము

PrintPrintSend to friendSend to friend

వరి నారు పెంచు విధానము:

ఎంపిక చేసిన విత్తనము సార్వాలో పండించిన ధాన్యము నుండి వెంటనే ఉపయోగించినచో విజేత, కాటన్ దొర సన్నాలు రకాలకు నిద్రావస్థ ఉన్నందున మొలకశాతం అధికంగా చేసుకొనుటకు తప్పనిసరిగా 1.0 శాతం నత్రిక ఆమ్లము తయారుచేసుకొని అందులో 24 గంటలు విత్తనాలు నానబెట్టి మంది కట్టుకోవాలి (10 మిల్లీ లీటర్లు ఆమ్లము ఒక లీటరు నీటిలో కలపాలి.)

  • నారుమడికి ఎంపిక చేసిన పొలములో ఇంతకూ మున్డువేసిన పైరు తాలూకు వరి కంకులు లేకుండా ఎరివేయుట మంచిది.
  • ప్రతి 5 కిలోలు విత్తనము విత్తుటకు ఒక సెంటు (40 చ.మీ.) నారుమడి తయారు చేయాలి.
  • ఒక సెంటు నారుమడికి 435 గ్రాముల యూరియ, 1250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 345 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దమ్ములో వెయ్యాలి. మరల 435 గ్రాముల యూరియా విత్తనము చల్లిన 15 రోజులకు వెయ్యాలి.
  • జింకు లోపము ఉన్న భూమిలో ప్రతి సెంటు మడిక ఒక కేజి జింకు సల్ఫేట్ ఆఖరి దమ్ములో వెయ్యాలి.
  • వరినారు పై పురుగులు ఆశించకుండా ఉండేందుకై మొనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ. లేక క్లోరిఫైరిఫాస్ 2.0 మీ.లీ లేదా క్వినాల్ ఫాస్ 2.0 మీ.లీ ఒక లీటరు నీటిలో కలిపి మొదటిసారి విత్తనము మొలకెత్తిన 10 రోజులకు, రెండవ దఫా వారం రోజుల తరువాత పిచికారి చేయవలెను లేదా నారుతీయుటకు 5-6 రోజుల ముందు పలచటి నీతిపోరనారుమడిలో ఉంచి కార్బోఫ్యురాన్ గుళికలు 160 గ్రా. లేక ఫోరేట్ 10 జి. గుళికలు 50 గ్రా. ఒక సెంటు నారుమడికి వేచినచో, నాటిన పొలములో 15-20 రోజుల వరకు రక్షణ కలుగును.
  • నారుమడి లో అగ్గితెగులు నివారించితకు త్రైసిఅక్లోజోల్ 0.6గ్రా.లీ. నీటికి లేదా ఎడిఫెంఫాస్ (1 మీ.లీ./లీ) విత్తనము చల్లిన 15 రోజులకు పిచికారి చేయాలి.
File Courtesy: 
APRRI, Maruteru
Copy rights | Disclaimer | RKMP Policies