Best Viewed in Mozilla Firefox, Google Chrome

రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తికి సూచనలు

PrintPrintSend to friendSend to friend

రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తికి సూచనలు

ప్రపంచంలోనే సగం జనాభాకు ముఖ్యమైన ఆహార పంట వరి. మన రాష్ట్రం లో ప్రధానమైనదీ వరి పంటే. రాష్ట్రంలో వరి దిగుబడులు ఇంకా పెంచాలంటే ధృవీకరింపబడిన నాణ్యత కలిగిన మంచి విత్తనాన్ని వాడాలి. అందుకే మన పెద్దలంటారు “విట్టుకోద్దిపంట” అని. మంచి విత్తనం అనగానే శుభ్రత, నాణ్యతతో బాగా మొలకెత్తే స్వభావం కల్గి ఆరోగ్యవంతంగా పెరిగి మంచి దిగుబడిని ఇవ్వాలి. ఏ వరి వంగడానికైన దాని దిగుబడి శక్తి ఆయా విత్తనముల యందు నిగూడమైన జన్యువుల సముదాయము నిర్ధారించును. జన్యు సంబందితమైన స్వచ్చతతోపాటు బాహ్యక్రుతికి సంబందించిన గుణాలోను నిర్దిష్టత ఉండాలి. విత్తనోత్పత్తిలో యున్న విత్తనాలను ప్రధానంగా ముఉడు తరగతులుగా వర్గీకరించారు, అవి

బ్రీడరు విత్తనం: జన్యుస్వచ్చత హెచ్చుగా యుండె ఈ విత్తనాన్ని రకాల రూపకల్పన సంబందించిన శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేయబడును.

పౌండేషను విత్తనం: బ్రీడరు విత్తనం నుండి ఉత్పత్తి చేసే ఈ విత్తనాన్ని సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనా స్థానాలు, గుర్తింపు పొందిన సంస్థలలో ఉత్పత్తి చేయబడును.

ధృవీకరింపబడ్డ విత్తనం: పౌన్దేశాను విత్తనం నుండి గుర్తింపు పొందిన సంస్థల సాంకేతిక నిపుణులచే, ధృవీకరణ సంస్థ పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేసే విత్తనం.

File Courtesy: 
APRRI, Maruteru
Copy rights | Disclaimer | RKMP Policies