Best Viewed in Mozilla Firefox, Google Chrome

‘శ్రీ’ వరిసాగు

PrintPrintSend to friendSend to friend

 

 నీటిని ఆదా చేయుటకై శ్రీవరిసాగు


శ్రీ వరిసాగు ఆవశ్యకత మరియు శ్రీ వరిసాగు పద్ధతి పై అవగాహన

ఆర్.మహేందర్ కుమార్, వి.వినోద్ గౌడ్, కె. సురేఖ, సి.ఎస్.పద్మావతి మరియు యల్.వి సుబ్బారావు

వరి ప్రాధాన్యత మరియు శ్రీవరిసాగు ఆవశ్యకత

        వరి ముఖ్యంగా మన ఆహార, ఆర్ధిక, సాంఘీక నైతికంగా, సంస్కృతీపరంగా మరియు చరిత్రతో ముడిపడి వుంది. 90 శాతము వరకు పండించిన వరి మనదేశంలోనే వినియోగించబడుతోంది. చైన దేశ ప్రపంచంలో అత్యధిక ఉత్పత్తి (168 వాట) కలిగి తక్కువ విస్తీర్ణము (29 మీ.హె) వరిసాగు చేయుచున్నది. అదే మనదేశంలో సుమారుగా 4.2 మీ.హె వరిసాగు చేస్తూ కేవల 121 మీ. టన్నులు మాత్రమే పండించగలుగుచున్నాము. వరి పండించు ముఖ్యమైన దేశాలు, వాటి విస్తీర్ణ, ఉత్పత్తి మరియు దిగుబడి పట్టిక-1 లో పొందుపరచడ జరిగినది.

పట్టిక-1 వివిధ దేశాలలో గల సగటు విస్తీర్ణ, ఉత్పత్తి మరియు దిగుబడి (2004-05)



క్రమ సంఖ్య


దేశము


విస్తీర్ణ (మి. హె.)


ఉత్పత్తి (మి.ట)


దిగుబడి (ట. హె)


1.


చైనా


28.7


167.8


5.85


2.


ఇండియా


42.8


121.1


2.83


3.


ఇండోనేషియా


11.7


49.14


4.20


4.


బంగ్లాదేశ్


10.9


36.12


3.31


5.


వియత్నామ్


7.5


32.06


4.27


6.


దాయిలాండ్


9.9


24.5


2.47


7.


మయన్మార్


6.2


21.28


3.43


8.


ఫిలిప్నిన్స్


4.1


12.74


3.11


9.


జపాన్


1.7


10.36


6.09

 

        మన దేశంలో వరి చాలా విస్తీర్ణంలో సుమారుగా 42-45 మి.హె సాగు చేస్తూ 34% పంట దాన్యం విస్తీర్ణ మరియు 42% విస్తీర్ణ సుమారుగా 140 మిట వరి పండించబడుతోంది వరి దాదాపు 15% స్ధూల ఆదాయం, 43% వరకు కెలరీ ఆవశ్యకతను సమకూర్బమే కా సుమారుగా 70% మన దేశ జనాబా ఆధారపడి ఉన్నది. వరి అంటేనే మన జీవనము అనే నానుడితో గత సంవత్సరము అంతర్జాతీయ   ………?

వివిద రాష్ట్రాలలో వరి ఉత్పాదకత విధానము ఒక విశ్లేషణ

        వరి ఉత్పాదకత మన దేశంలో సుమారుగా 4.5 వంతులు గత 56 సంవత్సరాలలో పెరిగినది 30.9 ట - 139.4 మి.ట (1950 నుండి 2006) వివిద రాష్ట్రాల వరి ఉత్పత్తిని విశ్లేసిస్తే ప్రధమ స్థానంలో పశ్చిమ బెంగాల్ తదుపరి ఉత్తరప్రదేశ్, ఆంద్రప్రదేశ్, పంజాబ్ మరియు తమిళనాడు. వరి విస్తీర్ణంలో కూడా పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ లు మొదటి రెండుస్థానాలలో ఉండగా తదుపరి ఒరిస్సా, ఆంద్రప్రదేశ్ మరియు చత్తీస్ గడ్ మొదటి అయిదు స్థానాలలో న్నాయి. ఇక దిగుబడిలో చూస్తే పంజాబ్ ప్రధమ స్థానం (4.98 ట.హె), తదుపరి స్థానాలు తమిళనాడు (4.49 ట.హె), ఆంద్రప్రదేశ్ (4.14 ట.హె), హర్యానా (3.72 ట.హె) మరియు పశ్చిమ బెంగాల్ (3.54 ట.హె). దేశంలో జనాభా వృధ్దిరేటు కంటే వరి ఉత్పత్తి పెరుగుదల రేటు అధికంగా వుండి వ్యవసాయపరంగా పురోగతి సాధించడంలో ముఖ్యంగా వరి ఉత్పత్తిలో ప్రగతి సాధించిన ఐదు రాష్ట్రాలలో ఆంద్రప్రదేశ్ ఒకటి.

         వరి ఉత్పదకత గణాంకాల పెరుగుదలను గత 10 సంవత్సరాల ప్రగతిని పరిశీలిస్తే ఉత్పదకత సమంగా ఉండి (3 ట.హె) పెరుగుదల కనిపిం లేదు. వరి పండించే ముఖ్యమైన రాష్ట్రాలు తమిళ నాడు, పంజాబ్, ఆంద్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లుావడం ఉత్పదకత స్థిరంగా ఉండి చాలా కలవరాన్ని కలుగజేస్తోంది. నేటికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, అధిక దిగుబడినిచ్చే వంగడాలను వినియోగించడంలో రైతులు పూర్తిగా చైతన్యవంతులు కానందున ఉత్పాదకత శక్తిలో 60 శాతాన్ని కూడ పొందకలేక పోతున్నాము.

 

వరిని ముఖ్యంగా నీటి వనరులతో మరియు వర్షాధారంగా పండిస్తారు. పలంలో వుండే నీటి నిర్వహణ ననుసరించి వర్షాధారపు వరిని మెట్ట సాగు (121) (నీరు నిలువ ఉండని మరియు నీరు నిలువడానికి కట్టలు కూడా ఉండని) నీటి సాగు మరియు (50సం.మీ – 3 మీ) ఎత్తు వరకు నీటితో సాగు చేస్తారు. నీటి వరి సాగు సుమారు 50% వరి విస్తీర్ణము (22 మి.హె) కలిగి వున్నది. వరి మరియు నీరు ముడిపడి వున్నయి. సుమారగా 90% వరి విస్తీర్ణము నీటితో ముఖ్యంగా వర్షపాతము లేదా భూగర్బ జలాలకు ముడిపడి వున్నది.

పట్టిక – 2 వరిసాగు పద్దతులు, వాటి విస్తీర్ణ



మొత్త విస్తీర్ణ

 


విస్తీర్ణ %


మి.హె


నీటి సాగు


వర్షపాత ఆధారము


 


 


మెట్టసాగు


( )


నీటి ముంపు సాగు


44.9


50


12


12


3

 

పెరుగుతున్న జనాభా అవసరాలనుగుణంగా మరియు తరుగుతున్న వనరులు (నీరు, నేల) దృష్ట్యా వరి ఉత్పదకతను పెంచడము ఎంతైన అవసరము వరి ఉత్పాదకతను సరైన క్రమంలో వృద్దిపరచుటకు ఆచరించవలసిన అంశాలు:

1)     

సమగ్ర నిర్వహణా విధానాలు.

2)     

అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను వినియోగించడం.

3)     

మనకు అందుబాటులో ఉన్న వరి వంగడాలను బయోటిక్నాలజి ద్వారా అధిక దిగుబడి సాదించే చీడ పీడల ఉదృతిని తట్టుకుని తక్కువ నీటి వనరులతో అధిక పంటలనిచ్చే మరియు భూసారం తక్కువ, తేలిక నేలలు భస్వరము ఇనుము తక్కువ నేలలో అధిక దిగుబడి కొరకు రూపొందించడం..

4)     

సంకర వరి వంగడాల సాగు

5)     

జన్యు మార్పడి వరి వంగడాలు ముఖ్యంగా అధిక ఐరన్, జింక్, Golden rice బీటా కరోటిన్ గల వరి వంగడాలు

6)     

వివి వరి మరియు వరి ఆదారిత పంటలు పండించడ

7)     

యాంత్రికంగా వరిసాగు చేయడ

8)     

నీటిని సమగ్రంగా వాడి నీటిని ఆదా మరియు అధికోత్పత్తి సాధించుటకు అత్యధికము.

నీటి సమస్య మరియు వరిసాగు

మన దేశంలో ముఖ్యంగా నీటి వరిసాగు సుమారుగా 50% విస్తీర్ణంలో పండించబడి 70% వరకు వరి ఉత్పత్తిని సాదించగలుగుచున్నాము. మన ఆహర సంమృద్ది ముఖ్యంగా నీటి వరిసాగుపై ఆధారపడి వున్నది. కాని నీటి వరి సాగు సుమారు 50-60% వరకు మనకు కల నీటి వనరులపై ఆదారపడి అధిక నీటిని వినియోగించడ జరుగుతోంది. ఉదాహరణకు నీటి వరిసాగు ప్రతిపంచి (?) కాలానికి 900 – 2250 మి.మీ హె నీటిని వినియోగిస్తుంది.

పట్టిక -3 వరి నీటి ఆవశ్యకత



క్రమ సంఖ్య


విషయము


నీటి ఆవశ్యకత (మి.మి)


1


దమ్ము చేయడానికి


150-200


2


బాష్పోదేనికము మరియు బాష్పీభవనము


500-1200


3


పక్కలకు మరియు కింద పొరలకు


200-700


4


పంట కోలతలో నేల ఆరగట్టడము


20-100


 


 


900-2250

 

       సుమారుగా వరి సాగు చేయడానికి 1500 మి.మి నీరు కావలసి వుంటుంది. అనగా ఒక హెక్టారు పొలంలో దిగుబడి 3 టన్నుల బియ్యము పండించగలిగినా సుమారు 15000 క్యుబిక మీటర్ల (15,000,000 లీ) నీటిని వినియోగిస్తుంది. అంటే 1 కిలో బియ్యానికి సుమారుగా 5000 లీ నీటిని ఇది మిగతా పంటలతో పోల్చిన (గోధుమ, మొక్కజొన్న) 5-6 వంతులు అధికంగా ఉన్నది. వరిపొలంలో పంటకాలయందు 30 సెం.మీ లోతు నీరు ఉండే విధంగా  పెట్టుట చాలా చోట్ల జరుగుతోంది. ఇంత ఎక్కువగా నీరు పెట్టడము అసలు అవసరము లేదని రైతు సోదరులు గుర్తు చేసుకొవాలి. అధిక నీరు వాడడం మూలన లాభాలకన్నా నష్టాలే ఎక్కువగా వుంటాయి.

ప్రస్థుత మరియు రానున్న పరిస్థితులలో వరికి కాలసినంత  నీరు లభించడ చాలా కష్టం. అందుకే వరికి కావలసిన నీటి ఆవశ్కకతను తగ్గించడం చాలా అవసరం, ప్పటి నీటి యొక్క అవసరము మిగతా

ప్రక్రియలకు/ అంశాలకు అవసరము అధికమై వ్యవసాయనికి ముఖ్యంగా వరికి రాను రాను నీటి కొరత ఎర్పడే అవకాశము చాలా వుంది. రానున్న కాలములో ఎర్పడి వాతావరణ మార్పుల కారణంగా కూడా నీటి వనరులు తగ్గిపొతాయి. అందుకొరకు తక్కువ నీటితో ఎక్కువ వరి దిగుబడి సాదించు నిర్వహణా పద్దతులను పాటించడ ఎంతైనా అవసరము. మనదేశ ప్రధాని శ్రీ. మన్మోహన్ సింగ్ అంతర్జాతీయ వరి కాంగ్రెస్, 2006 ప్రారంభోపన్యాసలో ముఖ్యంగా వరి రానున్న కాలంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశము చాలా వున్నది. అందుకే యిప్పటి నుండే ఎక్కువ పంట తక్కువ నీటితో సాదించడ ఎంతైన అవసరము. ఇది వరి శాస్త్రవేత్తలకు, రైతులకు సంబందించిన ఆవశ్యకత మరియు ఒక సవాలుగా నిలిచింది. వరిలో నీటి సమస్యలను ఎదుర్కోనుటకు ముఖ్యమైన అంశాలు గురించి తెలుసుకుందాము.

నీటి వనరులధిక చేయడ:

        ఇప్పటికి వున్న నీటి వనరులు అధికము చేయడము మరియు వరిలో అధికోత్పత్తి సాధించడము. దీనికొరకు సరైన ప్రాజెక్టులు కట్టించడము. కాని యిప్పటికే సాధ్యమైనంత ప్రగతిని సాదించాము. జాతీయనదుల అనుసంధానం ద్వారా కూడ నీటి వనరులు అధికము చేయడము. సాధ్యము కాని ది కూడ చాలా  కష్టసాధ్యమైనది ముఖ్యంగా మనకున్న ఆర్ధిక వనరులు (కావలసిన ఆర్దిక వనరులు డాలర్లు 120 బిలియన్) దృష్టిలో వుంచుకొని నీటి వనరులు అధికము చేయడము ప్రస్థత పరిస్థితులలో సులభము మరియు సాధ్యము కాదు.

నీటిని ఆదా చేయడ:

      ముఖ్యంగా వివిధ ప్రాజెక్టులలో నీటి నిర్వహణా పద్దతులను సమగ్రంగా అభివృద్ది పరచి వాటి సమర్థత దక్షతను ని (delete)అధికము చేయడం. మనకు ముఖ్యమై నీటి ప్రాజెక్టులలో కేవల 40%  సమర్థత కలదు. దీనిని సుమారు 10% అధికము చేసిన 14 మి.హె అధిక విస్తీర్ణము సాగు చేయవచ్చును. ఇద కూడా చాలా కష్టమైనది.

నీటి ఉత్పదకతను పెంచడ

మనం ఉపయోగించే నీటిని సరైన పద్దతిలో వినియోగించి అత్యధిక దిగుబడి సాదించడము. ఎక్కువ ఉత్పత్తి, ప్రతి ఒక్క నీటి బిందువుకు సరైన యాజమాన్య పద్దతులు, నీటి వృదాను తగ్గించడము. సరైన సమయంలో నీటిని పంటలకు అందించడం, మరియు వున్న నీటిని సరైన పద్దతిలో నిలువ చేయడ మొదలగు సమగ్రంగా వున్న నీటిని వాడినచో అధిక విస్తీర్ణంలో పంటలను సాగు చేస్తూ అధిక ఉత్పత్తిని మరియు దిగుబడిని సాధించడ ప్రస్తుత పరిస్థితులలో సరైన విధానము.

దీనిలో వరికి సంబందించినంత వరకు గల విధానములు /పద్దతులు:

1)     

ఆరు తడి పద్దతి

2)     

ఎతైన మడులపైన

3)     

ఎరోబిక్ రైస్

4)     

శ్రీ (సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటిన్షిఫికేషన్) పద్దతి

1. ఆరుతడి పద్దతి :

నీటి వనరులు తక్కువున్న ప్రాంతాలలో ఆరు తడి పద్దతులలో వరిని పండించవచ్చును. దీని ద్వారా సుమారుగా 20% వరకు నీటి ఆదా జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా నీటి ఆదా నీటి క్రింది పొరలకు వెళ్ళడము మరియు, ప్రక్క పొలములకు తగ్గించడము ద్వారా జరుగుతుంది. కాని ఈ పద్దతిలో నత్రజని వృధా మరియు కలపు మొక్క ఉధృతి ఉండడం వలన ఆచరణ కష్టమవుతుంది.

2. ఎత్తైన మడులపై వరిసాగు :

ఈ పద్దతిని మనదేశంలో ఉత్తర ఈశాన్య ప్రాంతాలలో దమ్ము చేయకుండా వరి గోధుమ పంట క్రమంలో పాటించి అధిక దిగుబడి మరియు నీటి ఆదాన సాదించ గలుగుచున్నారు.

3. రోబిక్ వరి

ఈ పద్దతిలో సరైన అధికత్పత్తిని చ్చే మేలైన వరి వంగడాలను దమ్ము చేయని పొలంలో నీటి ముంపు సరికానీయ కుండా సాగు చేస్తారు. పంటకు అవసరమైనపుడు మాత్రమే నీటి సమకూర్చుతారు. ఎంత తడిగా ఉంచాలనే విషయ రోజు మొక్కలను గమనిస్తూ అనుభవం సంపాదించాలి. చైనా దేశంలో ఈ పద్దతి ద్వారా 55-60% వరకు నీటిని ఆదా చేయగలిగరు. దీని కొరకు సరైన వరి వంగడాలను రూపొందిచాలి. దీనిలో కొంచము వరి ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఇది పాటించడము ద్వారా నియటోడ్ ఉతృత్తి పెరిగే అవకాశాలున్నాయి. ఇలా పండించిన వరి తొందరగా పడిపొవడానికి అవకాశము ఉంది.

శ్రీ వరిసాగు పద్దతి :

మున్ముందు వరి ఉత్పత్తి ముఖ్యంగా నీటి వనరులు తక్కువగా వినియోగించి మరియు సమగ్ర నీటి నిర్వహణ చేయుట (delete)ద్వారానే సాదించగలము శ్రీ వరి సాగు విధానము ఈ అంశమును ఆధారము చేసుకొని తక్కువ నీటితో అధిక దిగుబడి సాదించుటకు సహకరిస్తుంది. శ్రీ పద్దతి ద్వారా సుమారు 20-30% వరకు నీటి ఆదా చేయబడుతుంది. దీనికి గల కారణము వరిమొక్క నీటి మొక్క కాదనే అవగాహన అంగీకరించడము. వరిలో చేసిన పరిశోదనా ఫలితాల ద్వారా వరికి నీటి నిల్వ ఉండనవసరము లేదని, నీరు నిలువ వుండటము వలన వరి దిగుబడులు తగ్గిపోవడమేనని గ్రహించడం జరిగిది. చైనా శాస్త్రవేత్తల పరిశోధన ఫలితాల ద్వారా వరి పంట నీటి నిలువ వుంచడ కంటే నేలను తేమ వలె ఉంచడ ద్వారానే అధిక దిగుబడి సాధించగలిగారు.

శ్రీ పద్దతి అనేది వరిలో ఒక రకము విత్తనం కాని హైబ్రిడ్ వరి వంగడము కానేకాదు. ఇదొక మేలైన సాగు పద్దతి మాత్రమే. ఈ పద్దతిలో వరిని మొలకెత్తినప్పటి నుండి అతి జాగ్రత్తగా పెంచి అనుకూల పరిస్థితులను కలిగించి అధిక దిగుబడి సాదించటానికి సాధ్యము అవుతుంది. దీనిలో ముఖ్యంగా వనరులు తక్కువగా ఉపయోగించి దిగుబడిని అధికము చేస్తారు.

శ్రీ వరి సాగు పద్దతిలో ఆరు ముఖ్యమైన అంశాలు:

1)     

లేత నారు నాటడము (8-12 రాగి)/2 ఆకుల దశ

2)     

తి జాగ్రత్తగా, పైపైన ఒక మొక్క నాటడ

3)     

దూర దణరంగా నాటడ(24సెం.మీ x 25 సెం.మీ)

4)     

నీటిని ఎప్పుడు నిలువ వుండకుండా పలుచగా నేలతడిగా వుండేటట్లు నీటి విర్వహణననుసరించడం.

5)     

రోటరీ వీడరుతో కలుపు నివారణ

6)     

అధికంగా సేంద్రీయ మరియు జీవన ఎరువులు వాడటము.

మన ఆంద్ర రాష్ట్రంలో శ్రీ వరిసాగు పద్దతిని ప్రయోగత్మకంగా 2003-04 తొలకరి సీజనులో ప్రవేశ పెట్టబడినది. తొలిప్రయత్నంలోనే రైతు సోదురులు శ్రీ పద్దతిని పాటించి తక్కువ నీటితో అధిక దిగుబడులు సాదించారు. దీనికి ముఖ్య కారణము డబ్బకు ఎక్కువ పిలుకలు, పెద్ద కంకులు, కంకికి ఎక్కువ గింజలు మరియు ఆరోగ్యమైన వరి పెరిగి చీడ పీడల ఉదృతిని తట్టుకొనే శక్తి వలన అధిక దిగుబడి సాదించ గలిగారు. గత మూడు నాలుగు సీజనులలో శ్రీ వరిసాగు విస్తీర్ణము గణనీయంగా పెరిగినది. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ పద్దతి పై రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించి ప్రదర్శనాక్షేత్రాలను ర్పాటు చేయడ కూడా జరిగిది. అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ద్వారా జరిపిన వివిద రాష్ట్రాలలో శాస్త్రీయ ప్రదర్శలు మరియు రైతు ప్రదర్శనా క్షేత్రాలలో 15-20% వరకు అధిక దిగుబడిని శ్రీ పద్దతిలో సాధించ గలిగారు.

గత కొద్ది నెలల క్రితం వరల్డ్ వైడ్ ఫండ్ (wwf) ఆద్వర్యంలో త్రిపుర రాష్ట్రంలో గణనీయంగా జరుగుచున్న శ్రీ వరివిశేషాలు తెలుసుకొనుటకు పర్యటన చేయడం జరిగినది. త్రిపురలో అందరిని ఆకర్షించిన విషయం ఏమిటంటే ఒకే గ్రామంలో 30-50 హె విస్తీర్ణంలో 60-70 మంది రైతులు కలిసి కట్టుగా శ్రీ వరి సేధ్యము చేయడము. దీనికి ప్రభుత్వ సహకారము, వ్యవసాయ సంచాలకుల కృషి స్వచ్చంద సంస్థల అవిర కృషితో మాత్రమే సాధ్యమయినది. త్రిపు రాష్ట్రం విస్తీర్ణంలో చాలా చిన్న రాష్ట్రము కాని శ్రీ వరి సాగులో మాత్రము చాలా ముందంజ వేసినది. ప్రస్తుత సీజనులో (బోరో సీజన్) సుమారుగా 14000 హె వరి సేద్యము చేయు చున్నాను. ఇకపోతే 2007-08 సంవత్సరం నాటికి సుమారుగా 30,000 హె శ్రీ వరి విధానమును అనుసరించి ఆహార ప్రగతిని, సుస్థిరతను సాధించుటకు ప్రయత్న జరుగుతోంది. శ్రీ వరి విధానము వలన వారి దిగుబడిని సుమారుగా ద్విగుణీకృత చేయగలరనే ఆశాభావాన్ని వ్యక్త చేశారు. పై రైతు సోదరునికి శ్రీ వరి విధానముపై గల అవగాహన మమ్మల్ని ఆశ్చర్య చకితులను చేసిది.

మన రాష్ట్రంలో కూడా అనుకూలమైన ప్రాంతాలలో శ్రీ వరి సేద్యమును తప్పక పాటించి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాదించగలరని ఆశిస్తున్నాను. ఇక ముదు కాలంలో శ్రీ వరి సేద్యమే మనకు శ్రీ రామ రక్ష. ప్రతి ఒక్కరు శ్రీ వరి విధాన పురోగతికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.

1)     

ఆర్ మహేందర్ కుమార్, వరి పరిశోధనా సంచాలనాలయము

2)     

వి. వినోద్ గౌడ్, డబ్లు, డబ్లు, యఫ్ ఇక్రిసాట్

3)     

కె. సురేఖ, వరి పరిశోధనా సంచాలనాలయము

4)     

సే. హెచ్. పద్మవతి, వరి పరిశోధనా సంచాలనాలయము

5)     

యల్. వి. సుబ్బారావు, వరి పరిశోధనా సంచాలనాలయము

 


6)      

 

Copy rights | Disclaimer | RKMP Policies