Best Viewed in Mozilla Firefox, Google Chrome

దక్షిణ తెలంగాణా మండలంలో కలుపు నియంత్రణ

PrintPrintSend to friendSend to friend

• నారు నాటిన మొదటి నాలుగు వారాలూ కలుపును నియంత్రించుకోవాలి (నాటిన 20 రోజులకొకసారి, 40 రోజులకొకసారి చేతితో కలుపు తీయడం ద్వారా).
• గడ్డిజాతి, తుంగజాతి కలుపు మొక్కలు ప్రబలినప్పుడు వాటిని నియంత్రించడానికి బ్యుటక్లోర్ ఎకరానికి 1.25 లీ. చొప్పున (లేదా) ప్రెతిలాక్లోర్ 600 మీ.లీ. (లేదా) అనిలోఫాస్ 500 మీ.లీ., 25 కిలోల ఇసుకతో కలిపి సన్నని నీటి పొరలో నాటిన 3-5 రోజులకు వేయాలి.
• పొలంలో ఊదగడ్డి సమస్య ఉన్నప్పుడు ఎకరానికి 1.25 లీ. బెన్థయోకార్బ్ మేయాలి
• వెడల్పాటి ఆకుల కలుపును నివారించడానికి నారు నాటిన 3-5 రోజులకు ఎకరానికి 8-10 కిలోల చొప్పున 2,4 - డి గుళికలను వేయాలి.
• గడ్డిజాతి కలుపు మొక్కలను, తుంగజాతి కలుపును, వెడల్పాటి ఆకుల కలుపును నివారించుకోవడానికి అనిలోఫాస్ ఎకరానికి 400 మి.లీ. చొప్పున (లేదా) బ్యుటాక్లోర్ 800 మి.లీ. చొప్పున, 4-5 కిలోల 2,4 డి తో కలిపి వెయ్యాలి.
• ఆక్సాడయార్జిల్ ఎకరానికి 35 గ్రా . చొప్పున అర లీటరు నీటిలో కలిపి, ఆ మిశ్రమాన్ని 25 కిలోల ఇసుకతో కలిపి వెయ్యడం కూడా సిఫార్సు చేయబడింది.
• పొలంలో వెడల్పాటి ఆకుల కలపు ఉన్నట్లయితే 2,4 - డి సోడియం లవణం (ఫేర్నోక్సోన్ 80 % డబ్ల్యూ. పి.) 2.5 గ్రాములు లీటరు నీటితో కలిపి (ఎకరానికి 200 లీటర్ల మిశ్రమం) నారునాటిన 20 రోజులకు పిచికారీ చెయ్యాలి.  

Copy rights | Disclaimer | RKMP Policies