Best Viewed in Mozilla Firefox, Google Chrome

తక్కువ వర్షపాత మండలంలో ఎలుకల నివారణ

PrintPrintSend to friendSend to friend

1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :

• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి.
• గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం
• ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి
• దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి
• వరి నాట్లు వేసిన దగ్గరనుండి, పూత దశవరకూ హెక్టారుకు 5 చొప్పున ఎర స్థావరాలను గట్టు నుండి ఒక మీటరు లోపలికి పొలానికి నాలుగు మూలలా నాలుగు, పొలం మధ్యలో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో ఎర స్థావరంలో 30 గ్రా. బ్రోమడయలోన్ ఎర ఉంచాలి. వారానికి రెండుసార్లు ఎరను మార్చాలి.
• పంటకాలంలో చిరుపొట్ట దశకు ముందు 0.005% బ్రోమోడయోలోన్ ఎరలు ఉపయోగించాలి
• చిరుపొట్ట దశనుండి పంట కోత సమయం వరకు ఎ.పి.ఆర్.ఆర్.ఐ. & ఆర్.ఎ.ఆర్.ఎస్., మారుటేరు వారు రూపొందించిన "బర్రో ఫ్యుమిగేటర్" తో ఎలుక కన్నాలలో పొగ పెట్టవచ్చు.

2. 0.005% బ్రోమోడయోలోన్ ఉపయోగించే విధానం

మొదటి రోజు :ఎలకలున్న కన్నాలను గుర్తించి, 15 గ్రా. తాజాగా కలిపిన బ్రోమోడయోలిన్ ఎరను పొట్లాలుగా కట్టి ఈ కన్నాలలో ఉంచాలి.
రెండవ రోజు : ఎలుకలున్న కన్నాలలో తిరిగి బ్రోమొడయోలోన్ ఎరను ఉంచాలి.

గమనిక: ఎలుకలు ఒక పొలం నుండి ఒక పొలానికి తరలిపోకుండా ఉండేందుకు నివారణ చర్యలను సామూహికంగా చేపట్టాలి.

హెక్టారుకు కావాల్సిన బ్రోమోడయోలిన్ :

• మొదటిసారి ఎరను పెట్టినప్పుడు హెక్టారుకు 50 ఎరలు, ఒక్కో ఎలుక కన్నంలో 15 గ్రా. ఎర చొప్పున 15 గ్రా. బ్రోమాడయోలోన్ అవసరమౌతుంది.

• రెండవసారి ఎరను పెట్టినప్పుడు హెక్టారుకు 10 ఎరలు (50 ఎరలలో 20%), ఒక్కో ఎలుక కన్నంలో 15 గ్రా. ఎర చొప్పున 3 గ్రా. బ్రోమాడయోలోన్ అవసరమౌతుంది.  

Copy rights | Disclaimer | RKMP Policies