Best Viewed in Mozilla Firefox, Google Chrome

తక్కువ వర్షపాత మండలానికి సిఫార్సు చేసిన ఎరువులు

PrintPrintSend to friendSend to friend
 నారుమడికి సిఫార్సు చేసిన ఎరువులు
  •  ఆరోగ్యకరమైన నారు కొరకు ప్రతి 100  చ. మీ. నారుమడికి దుక్కిలో 0.5 కిలోల నత్రజని, 0.5 కిలోల భాస్వరం మరియు 0.5 కిలోల పోటాష్ ఎరువు వేయాలి. విత్తిన  12  రోజులకు మళ్ళీ ఒక 0.5 కిలోల నత్రజని వేయాలి. 
  • జింకు లోపాన్ని గమనిస్తే, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు  లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి.
  • నారుమడిలో ఇనుము లోపాన్ని సరిదిద్దేందుకు 5-10  గ్రా. అన్నబేధి లేదా ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్  ను 0.5  నుండి 1.0  గ్రా. నిమ్మఉప్పుతో లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
 
బి ప్రధాన పొలానికి  సిఫార్సు చేసిన ఎరువులు            
          
వ్యవసాయవాతావరణ
 మండలం
నత్రజని
(ఎకరాకుకిలోల్లో)
భాస్వరం
(ఎకరాకుకిలోల్లో)
పోటాష్
(ఎకరాకుకిలోల్లో)
తక్కువ వర్షపాత
 మండలం
64
32
32
  • నత్రజనిని మూడు దాఫాలుగా ( దమ్ములోను, దుబ్బుచేసే దశలోనూ, అంకురం దశలోనూ) వేయాలి. బరువు నేలల్లో భాస్వరం మరియు పోటాష్ దమ్ములోనే వేయవచ్చు.
  • తేలిక భూముల్లో పోటాష్ ను దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో సగం వేయాలి.
  • ఆలస్యంగా నాటిన సందర్భాల్లో నత్రజనిని రెండు దాఫాలుగా వేయాలి (65 % దమ్ములోను మిగతా 35% నాటిన 20  రోజులకి).
  • తేలిక నేలల్లో హెక్టారుకు 60-80  కిలోల నత్రజని,   40 కిలోల భాస్వరం మరియు 30 కిలోల పోటాష్ వెయ్యాలి. భాస్వరాన్ని, పోటాష్ ను దమ్ములో వెయ్యాలి. నత్రజనిని మూడు దాఫాలుగా (దమ్ములో+దుబ్బుచేసే దశలో+అంకురం దశలో) వేయాలి.       
Copy rights | Disclaimer | RKMP Policies