Best Viewed in Mozilla Firefox, Google Chrome

దక్షిణ మండలంలో వరి దుబ్బుచేసే సమయంలో రసాయనాలతో చీడపురుగుల నివారణ

PrintPrintSend to friendSend to friend

దుబ్బు చేసే సమయంలో:

కాండం తొలుచు పురుగు, తామర పురుగులు మరియు హిస్పా:

• మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 20 ఇ.సి. 2.5 మీ.లీ. లేదా ఫాస్ఫామిడాన్ 40 ఎస్.ఎల్. 2.0 మీ.లీ. లీటరు నీటితో కలిపి పిచికారీ చెయ్యాలి.

ఉల్లికోడు పురుగు:

• ఫోరేట్ 10 జి హెక్టారుకు 12.5 కిలోల చొప్పున లేదా కార్బోఫ్యురాన్ 3 జి హెక్టారుకు 25 కిలోల చొప్పున నాటిన 15 రోజులకు 1-2 అంగుళాల లోతు నీటిని నిలువగట్టి వేయాలి.

ఆకు ముడత పురుగు:

• ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ., లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

హిస్పా :

• ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

ఆకు నల్లి :

డైకోఫాల్ 5.0 మి.లీ. లేదా వెట్టబుల్ సల్ఫర్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.  

Copy rights | Disclaimer | RKMP Policies