Best Viewed in Mozilla Firefox, Google Chrome

దక్షిణ మండలంలో పోషకాల యాజమాన్యం

PrintPrintSend to friendSend to friend

పోషకాల యాజమాన్యం:

• రసాయన ఎరువులతో బాటు సేంద్రీయ ఎరువులను, జీవన ఎరువులను సమతుల్యమైన పద్ధతిలో వాడి భూసారం మరియు వరి పంట ఉత్పాదకత పెంచి, పోషించవచ్చు.
• సిఫార్సు చేసిన నత్రజనిలో 25 -50 % నత్రజనిని పచ్చిరొట్ట పైర్ల ద్వారా, కంపోస్టు, దిబ్బెరువు, కోళ్ళ పెంట వంటివాటి ద్వారా అందచేస్తే స్థిరమైన దిగుబడులు వస్తాయి.
• పొలంలో జీలుగ, జనుము, పిల్లిపెసర లేక మినుములు, పెసలు వంటి అపరాల పంటల అవశేషాలను పచ్చి రొట్టగా వేస్తే భూసారం, ఉత్పాదకత పెరుగుతాయి.
• నీలి ఆకుపచ్చ శైవలాలు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియా వంటి జీవన ఎరువులు వరి పంట యొక్క నత్రజని, భాస్వరం అవసరంలో 10 -20 % వరకూ తీరుస్తాయి.
• రబీ సీజన్లో నత్రజని, భాస్వరం మరియు పోటాష్ ఎరువులను హెక్టారుకు 180 :90 :60 కిలోల చొప్పున వేయాలి. మొత్తం భాస్వరం మరియు పోటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. నత్రజనిని మాత్రం మూడు దఫాలుగా, దుక్కిలోను, దుబ్బు చేసే సమయంలోను, అంకురం దశలోనూ వేయాలి. తేలిక భూముల్లో పొ టాష్ ఎరువును రెండు దఫాలుగా, సగం దుక్కిలో, మిగతా సగం అంకురం దశలో, మూడవ దఫా నత్రజనితో బాటు వేయాలి.
• పైపాటుగా నత్రజని వేసే ముందు పొలంలో నీరు తీసెయ్యాలి. నత్రజని వేసిన 2 రోజుల తరువాతే నీరు పెట్టాలి.
• జింకు లోపాన్ని నివారించుకోవడానికి హెక్టారుకు 50 కిలోల జింకు సల్ఫేట్ ను వేయాలి. పంటలో జింకు లోపాన్ని గమనిస్తే, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. అవసరాన్నిబట్టి 5 రోజుల వ్యవధిలో మళ్ళీ ఈ ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి.
• ఇనుము లోపాన్ని గమనిస్తే, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు 20-30 గ్రా. అన్నబేధిని 2-3 గ్రా. నిమ్మఉప్పుతో లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీచేయవలసి ఉంటుంది.  

Copy rights | Disclaimer | RKMP Policies