Best Viewed in Mozilla Firefox, Google Chrome

దక్షిణ మండలంలో కలుపు నియంత్రణ

PrintPrintSend to friendSend to friend

కలుపు యాజమాన్యం:

• ముఖ్యంగా నాటిన 45 రోజులవరకూ పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.

• కూలీలు వీలుగా దొరికే ప్రాంతాల్లో నాటిన 20 రోజులకొకసారి, 40 రోజులకొకసారి చేత్తో కలుపు తీయించాలి.

• కలుపు నిర్మూలనకు ఈ మందులలో ఏదైనా ఒకటి పొలంలో పలుచగా నీరు కట్టి చల్లాలి. బ్యుటాక్లోర్ ఎకరానికి 1.25 లీటర్ల చొప్పున (లేదా) అనిలోఫాస్ ఎకరానికి 500 మీ.లీ. చొప్పున (లేదా) ప్రేతిలాక్లోర్ ఎకరానికి 600 మీ.లీ. చొప్పున (లేదా) ఆక్సాడయార్జిల్ 40 గ్రా. చొప్పున (లీటరు నీటిలో కలిపి) నారు నాటిన 3 నుండి 5 రోజులలో చల్లాలి. లేదా నాటిన 8 -12 రోజులకు ఎకరానికి 80 -100 గ్రాముల పైరజోసల్ఫ్యురాన్ ఇథైల్ ను పిచికారీ చేయాలి. లేదా బెన్ సల్ఫ్యురాన్ మిథైల్ ఎకరానికి 35 గ్రా. చొప్పున నాటిన 3 - 25 రోజుల మధ్యన (ప్రీ టు పోస్ట్ ఎమర్జేన్స్) పిచికారీ చెయ్యాలి.

• వెడల్పాటి ఆకుల కలుపు నిర్మూలనకు 2,4 - డి. ఎస్.ఎస్. ఎకరానికి 400 గ్రా. చొప్పున నాటిన 20 -25 రోజులకు పిచికారీ చెయ్యాలి.  

Copy rights | Disclaimer | RKMP Policies