Print
Send to friendదుబ్బు చేసే సమయంలో:
కాండం తొలుచు పురుగు, తామర పురుగులు మరియు హిస్పా:
• మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 20 ఇ.సి. 2.5 మీ.లీ. లేదా ఫాస్ఫామిడాన్ 40 ఎస్.ఎల్. 2.0 మీ.లీ. లీటరు నీటితో కలిపి పిచికారీ చెయ్యాలి
ఉల్లికోడు పురుగు:
• ఫోరేట్ 10 జి హెక్టారుకు 12.5 కిలోల చొప్పున లేదా కార్బోఫ్యురాన్ 3 జి హెక్టారుకు 25 కిలోల చొప్పున నాటిన 15 రోజులకు 1-2 అంగుళాల లోతు నీటిని నిలువగట్టి వేయాలి.
ఆకు ముడత పురుగు:
• ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ., లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
హిస్పా :
• ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ. లేదా మొనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
ఆకు నల్లి :
• డైకోఫాల్ 5.0 మి.లీ. లేదా వెట్టబుల్ సల్ఫర్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.