Best Viewed in Mozilla Firefox, Google Chrome

కృష్ణా మండలంలో వరి ప్రధాన పొలం తయారీ

PrintPrintSend to friendSend to friend

 ప్రధాన పొలం :

• ప్రధాన పొలం తయారీకి ముందు వేసవి మధ్యలో భూమిని ఒకటిరెండుసార్లు దున్నాలి. దీనివలన కలుపు మొక్కల వేళ్ళు వెలికి వచ్చి కలుపు మొక్కలు అదుపులో ఉంటాయి. పలు చీడ పీడల గుడ్ల సముదాయాలు, నిద్రావస్థలో ఉన్న దశలూ ఎండబారిన పడతాయి. వేసవి దుక్కుల వలన వేసవిలో లభించిన తేమను కూడా నేల పట్టి ఉంచుకుంటుంది.
• కాలువల ద్వారా నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పచ్చిరొట్ట ఎరువులు వేయడం చాలా మంచిది.
• నారు నాటడానికి 15 రోజుల ముందు నుండీ మురగ దమ్ము చేయడం మొదలు పెట్టాలి.
• ట్రాక్టరుతో కానీ పవర్ టిల్లర్ తో కానీ 15 సెం.మీ. లోతు మురగదమ్ము చేస్తే సరిపోతుంది.
• ఆఖరుసారి మురగ దమ్ము చేసిన తరువాత పొలాన్ని బాగా చదును చేసి, నట్లు వేయడానికి ముందు 2 -3 రోజులు అలాగే వదిలెయ్యాలి. బరువు నేలలలో నీటి యాజమాన్యానికి, కలుపు నివారణకు ఇది తోడ్పడుతుంది.
• నాలుగు నుండి ఆరు ఆకులున్న నారును (25 రోజుల నారు) ఉపయోగించాలి.
• ముదురు నారు నాటకూడదు. మధ్యకాలిక రకాలైతే 40 రోజుల తర్వాత, స్వల్పకాలిక రకాలైతే 30 రోజుల తర్వాత నాటితే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి.
• చదరపు మీటరుకు 44 మూనలు ఉండేలా చూడాలి. కుదురుకు 2-3 మొక్కల చొప్పున 2 -3 సెం.మీ. లోతులో నాట్లు వేయాలి.
• భూసారం తక్కువగా ఉన్నప్పుడు, ముదురు నారు నాటినప్పుడు దిగుబడిని కొంత వరకు పెంచేందుకు చదరపు మీటరుకు 66 మూనలు ఉండేలా నాటాలి.
• నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. బాటలు తీయాలి. ఇందువలన పైరుకు గాలి బాగా సోకుతుంది. అంతేకాక ఎరువులు, కలుపు మందులు వేయటానికి, సస్య రక్షణ చర్యలు చేపట్టడానికి అనువుగా ఉంటుంది.

Copy rights | Disclaimer | RKMP Policies