Best Viewed in Mozilla Firefox, Google Chrome

ఎత్తైన గిరిజన ప్రాంత మండలంలో వరి నారుమడికి నేల తయారీ

PrintPrintSend to friendSend to friend

నారుమడి యాజమాన్యం (మాగాణి భూముల్లో):

• నీరు పెట్టడానికి, తియ్యడానికి వీలుగా ఉండే భూమిని ఎంచుకోవాలి.
• విత్తడానికి ఒక నెల ముందుగానే నారుమడిని సిద్ధం చేసుకోవాలి.
• నారుమడిని వేసవిలో రెండుసార్లు దున్ని, ఆ తర్వాత 5-6 రోజుల వ్యవధితో 3 -4 దఫాలు దమ్ము చేయాలి.
• ఆఖరి దమ్ము తర్వాత భూమిని చదును చేసి, నీరుపెత్తదానికి, తియ్యడానికి వీలుగా కాలువలు ఏర్పరుస్తూ మీటరు వెడల్పున, అనుకూలమైన పొడవున ఎత్తుగా మళ్ళు చేసుకోవాలి.
• నేల స్వభావాన్ని మెరుగుపరిచేందుకు బాగా చివికిన పశువుల ఎరువు/ కంపోస్టు 5 సెంట్లకు 200 కిలోల చొప్పున వేయాలి.
• వరి విత్తనాన్ని 16 -24 గంటలు నానబెట్టి, మరో 24 - 36 గంటలు ఉంచి, నాటే ముందు మొలక కట్టించాలి.
• 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని (4.4 కిలోల యూరియా), ఒక కిలో `P2O5’ (6.25 కిలోల ఎస్.ఎస్.పి.) మరియు 1 కిలో `K2O’ (1.7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్) వేయాలి.
• మొత్తం భాస్వరం మరియు పోటాష్ ఎరువులను, నత్రజని ఎరువుల్లో సగాన్ని చదును చేయడానికి ముందు దుక్కిలో వేసి బాగా కలగలపాలి.
• మిగతా సగం నత్రజనిని, నారు పెరుగుదలబట్టి, విత్తిన 10 -15 రోజులకు వేయాలి.
• మొలక కట్టిన విత్తనాన్ని సెంటు (40 చ.మీ.) నారుమడికి 5 కిలోల చొప్పున విత్తుకోవాలి. ఒక ఎకరం ప్రధాన పొలానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది.
• నారుమడిలో పలుచటి పొరలాగా నీరుకట్టి, మొలకకట్టిన విత్తనాన్ని సరిసమానంగా వెదజల్లుకుని, గాలి బాగా ఆడడానికి మరునాడు ఉదయం నీటిని తీసెయ్యాలి.
• నారుమడిలో మొదటి వారం అంతా మార్చి, మార్చి నీరు పెడుతూ, తీస్తూ ఉండాలి. ఆ తర్వాత మడిలో నారు ఎత్తును బట్టి 2-3 సెం.మీ. లోతు నీరు కట్టి ఉంచాలి.
• కలుపును అధిగమించడానికి 5 సెంట్ల నారుమడికి బెంథయోకార్బ్ 75 మీ.లీ. కానీ, సేఫ్నర్ తో కూడిన ప్రెటిలాక్లోర్ 40 మి.లీ. కానీ, బ్యుటాక్లోర్ 50 మి.లీ. లేదా పైరజోసల్ఫ్యురాన్ 5 గ్రా. 10 లీటర్ల నీటితో కలిపి ప్రీ ఎమర్జేన్స్ మందుగా వేయాలి.
• ఊద గడ్డిని సమర్ధవంతంగా నిర్మూలించడానికి విత్తిన 12 -15 రోజులకు సైహలోఫోప్ బ్యుటైల్ మందును10 లీటర్ల నీటికి 20 మి.లీ. చొప్పున చల్లాలి.
• నారు తీసేటప్పుడు, వేళ్ళకు దెబ్బ తగలకుండా ఉండడానికి రెండురోజుల ముందుగా నారుమడికి బాగా నీరుపెట్టాలి.  

Copy rights | Disclaimer | RKMP Policies