Best Viewed in Mozilla Firefox, Google Chrome

గోదావరి మండలంలో అంకురందశనుండి ఈనిక దశవరకు రసాయనాలతో చీడపురుగుల నివారణ

PrintPrintSend to friendSend to friend

అంకురందశనుండి ఈనిక దశవరకు
సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్). :

• ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మీ.లీ. లేదా ఎతోఫెన్ ప్రాక్స్ 2.0 మీ.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి .లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
• మొక్కల అడుగు భాగం బాగా తడిచేలా మందును (ఎకరానికి 200 లీ. ద్రవం) పిచికారీ చెయ్యాలి.
• పురుగు మందులను, సింథటిక్ పైరెత్రాయిడ్స్ ను కలిపి పిచికారీ చేయకూడదు.
• రెండవసారి పిచికారీచేయవలసి వస్తే వేరు వేరు వర్గాలకు చెందిన మందులను మార్చి మార్చి ఉపయోగించాలి.

కాండం తొలుచు పురుగు :

• కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 డబ్ల్యు.పి. 2.0 గ్రా. లేదా ఎసిప్జేట్ 1.5 గ్రా. లేదా ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున చదరపు మీటరుకు ఒక పెద్ద పురుగు కానీ గుడ్ల సముదాయం కానీ గమనించగానే వేయాలి.

ఆకు ముడత పురుగు :

• కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రా. లేదా ఎసిప్జేట్ 1.5 గ్రా. లేదా ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

కంకి నల్లి :

ప్రోఫెనోఫాస్ 2.0 మీ.లీ. లేదా డైకోఫాల్ 5.0 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.  

Copy rights | Disclaimer | RKMP Policies