Best Viewed in Mozilla Firefox, Google Chrome

శ్రీ పద్ధతిలో చెరకు సాగు

PrintPrintSend to friendSend to friend

శ్రీ పద్ధతిలో చెరకు సాగు

రైతు గురించి:

  • రైతు పేరు: పాలచెర్ల విశ్వనాధం
  • ప్రదేశం: పెద్దాపురం మండలం, తూ.గో. జిల్లా, ఆం.ప్ర.
  • పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు : 56 సంవత్సరాలు
  • విద్యార్హతలు: 6 వ తరగతి
  • సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 4.00
  • వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 30
  • రైతు అనుసరించిన పంటల సరళి : వరి మాగాణుల్లో - వరి వరి పప్పుధాన్యాలు, వరి పప్పుధాన్యాలు నువ్వులు

నవకల్పన వర్ణన:

I)శ్రీ పద్ధతిలో వరి సాగు

  • 4 ఎకరాల్లో ఈ టెక్నాలజీని అనుసరించి, 5 -10 సంచుల (75 కే.జీ. సంచులు) దిగుబడి అధికంగా పొందారు.
  • సాగునీరు 30 శాతం వరకు ఆదా అయ్యింది. చెరకులో అంతరపంటగా వరి
  • ఈ టెక్నాలజీని అనుసరించడం ద్వారా కలుపు సమస్య తగ్గింది.  
  • ఎకరానికి రూ. 8,000 /- అదనపు ఆదాయం లభించింది.
  • ప్రధాన పంటలో దిగుబడి ఏమీ తగ్గలేదు.

II)డ్రం సీడర్ తో వరిని నేరుగా విత్తడం

  • ఈ పద్ధతిని పాటించడం వలన సాగు ఖర్చు మామూలుగన్నా రూ. 4,000 /- తగ్గుతుంది.
  • విత్తనాలు నాటే సమయం పది రోజులవరకూ తగ్గుతుంది.
  • సాగునీరు 30 శాతం వరకూ ఆదా అవుతుంది.
  • దిగుబడి మామూలు పద్ధతిలో అంతే వచ్చింది.

III)శ్రీ పద్ధతిలో చెరకు సాగు

  • మామూలు పద్ధతిలో 4 టన్నుల విత్తనం అవసరమైతే ఈ పద్ధతిలో ఒక టన్ను విత్తనం సరిపోతుంది.
  • మామూలు పద్ధతిలో కన్నా ఎకరానికి 10 మంది కూలీల లేబరు ఆదా అవుతుంది.
  • మామూలు పద్ధతిలో కన్నా ఎకరానికి 20 టన్నుల దిగుబడి అధికంగా వచ్చింది.

IV)కర్రపెండలంలో అంతరపంటలుగా పప్పుధాన్యాలు, నువ్వులు

  • మామూలు పద్ధతిలోకన్నా ఎకరానికి రూ. 2, 000 - 3,000 /- అదనపు ఆదాయం లభించింది.

ప్రోబ్లెం స్టేట్మేంట్ (ఈ రైతు కనిపెట్టినదాని వలన ఏ సమస్య, ఎలా దూరమైంది):

1. శ్రీ పద్ధతిలో వరి సాగు

  • సాగునీరు 30 శాతం వరకు ఆదా అవ్వడంవలన సాగునీటి సమస్య తగ్గింది.

2. చెరకులో అంతరపంటగా వరి 

  • కలుపు సమస్య తగ్గింది.

3. డ్రం సీడర్ తో వరిని నేరుగా విత్తడం

  • సాగునీరు 30 శాతం వరకు ఆదా అవ్వడంవలన సాగునీటి సమస్య తగ్గింది.

4. శ్రీ పద్ధతిలో చెరకు సాగు

  • విత్తనం మరియు కూలీ సమస్యలు తగ్గాయి.

టెక్నాలజీ అభివృద్ధి చేసిన విధానం: వ్యవసాయ పరిశోధనా స్థానం, పెద్దాపురం (ఆంగ్రూ) మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు, పెద్దాపురం (వ్యవసాయ శాఖ) వారి తోడ్పాటుతో ఈ టెక్నాలజీలు విజయవంతంగా అమలుచేయబడి మంచి ఫలితాలను వచ్చాయి.

నవకల్పనకు లభించిన గుర్తింపు : ఈ టెక్నాలజీలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయి :

1. శ్రీ పద్ధతిలో వరి సాగు : ఈ పద్ధతిని అవలంభించడం ద్వారా మంచి ఫలితాలను సాధించినందుకుగాను డా. శ్రీ. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారినుండి 2006 , అక్టోబరు 20న ఉత్తమ రైతు పురస్కారాన్ని పొందారు.

2. డ్రం సీడర్ తో వరిని నేరుగా విత్తడం: ఈ పద్ధతిని అవలంభించినందుకు కె.వి.కె., కల్వచెర్ల, సి.టి.ఆర్.ఐ., రాజమండ్రి వారినుండి 2008 జనవరిలో ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్నారు.

3. శ్రీ పద్ధతిలో చెరకు సాగు : ఈ పద్ధతిని అవలంభించినందుకు నవభారత్ వెంచెర్స్ లి., సామర్లకోట వారినుండి 2007 అక్టోబరులో ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్నారు.

4. కర్రపెండలంలో అంతరపంటలుగా పప్పుధాన్యాలు, నువ్వులు: ఈ పద్ధతిని అవలంభించినందుకుగాను జిల్లా కలెక్టరు నుండి 2006 జనవరి 17న ఉత్తమ రైతు సంక్రాంతి పురస్కారాన్ని అందుకున్నారు.

Related Terms: Farmers InnovationFIS
Copy rights | Disclaimer | RKMP Policies