Best Viewed in Mozilla Firefox, Google Chrome

ఆర్.జి.ఎల్. - 2537 రకం వరిని సాగుచేయడం ద్వారా తుఫాను వలన కలిగే నష్టాన్ని తగ్గించుకున్నారు

PrintPrintSend to friendSend to friend

ఆర్.జి.ఎల్. - 2537 రకం వరిని సాగుచేయడం ద్వారా తుఫాను వలన కలిగే నష్టాన్ని తగ్గించుకున్నారు.

రైతు గురించి:

  • రైతు పేరు: శ్రీ ముప్పన పవన్ కుమార్
  • ప్రదేశం: పెద్దాపురం మండలం, తూ.గో. జిల్లా, ఆం.ప్ర.
  • పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు : 12-7-81, 27 సంవత్సరాలు
  • విద్యార్హతలు: ఎం.బి.ఎ.
  • సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 6.00
  • వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 2
  • రైతు అనుసరించిన పంటల సరళి : వరి - వరి

కొత్తగా ఏమి కనిపెట్టారు: ఆర్.జి.ఎల్. - 2537 రకం వరిని సాగుచేయడం ద్వారా తుఫాను వలన కలిగే నష్టాన్ని తగ్గించుకున్నారు.

నవకల్పన వర్ణన: పెద్దాపురంలో 2010 ఖరీఫ్ సీజన్లో ఆర్.జి.ఎల్. - 2537 (శ్రీకాకుళం సన్నాలు) వరి రకాన్ని 5 ఎకరాల్లో సాగుచేశారు. ఆర్.జి.ఎల్. - 2537 రకం దీర్ఘకాలిక సన్నగింజ రకం. చేనుమీద పడిపోదు. బి.పి.టి. 5204 మరియు స్వర్ణ రకాలతో పోలిస్తే చాలా వరకూ చీడపీడలను తట్టుకుంటుంది. బి.పి.టి. 5204 మరియు స్వర్ణ రకాలు సాగుచేసే ప్రదేశాల్లోనే ఈ రకం కూడా సాగులో ఉంది.

ప్రోబ్లెం స్టేట్మేంట్ (ఈ రైతు కనిపెట్టినదాని వలన ఏ సమస్య, ఎలా దూరమైంది): 2010 నవంబర్, డిసెంబర్ లోని తుఫానుకు ఈదురుగాలులు తోడయ్యాయి. ఈ నెలల్లో ఒక్కరోజులోనే 100 మీ.మీ. కన్నా ఎక్కువ వర్షం పడి, ఈదురుగాలులు వరి పంటకు అపారమైన హాని చేసాయి. స్వర్ణ, బి.పి.టి. - 5204 మరియు బొండాలు రకాలు వర్షాలకు పూర్తిగా పడిపోయి తీవ్ర నష్టాన్ని కలుగచేసాయి. ఆర్.జి.ఎల్. - 2537 రకం వరి ఈ పరిస్థితులను తట్టుకుని పూర్తి స్థాయిలో కాకపోయినా దిగుబడి బాగానే ఇచ్చింది. మామూలుగా ఎకరానికి 30-35 బస్తాల దిగుబడి వచ్చేచోట 25 బస్తాల (75 కిలోల బస్తాలు) దిగుబడి వచ్చింది. స్వర్ణ, బి.పి.టి. – 5204 రకాలు పూర్తిగా దెబ్బతిని మామూలుగా ఎకరానికి 30-35 బస్తాల దిగుబడి వచ్చేచోట కేవలం 0 -10 బస్తాల దిగుబడి మాత్రమే ఇచ్చాయి. ఆర్.జి.ఎల్. - 2537 రకం సన్నగింజ రకం కావడంవలన మంచి ధర కూడా లభించింది.

టెక్నాలజీ అభివృద్ధి చేసిన విధానం : పెద్దాపురం, తూ.గో.జిల్లా, వ్యవసాయ పరిశోధనా స్థానంవారి తోడ్పాటుతో మరియు రాగోలు, శ్రీ కాకుళం జిల్లా, వ్యవసాయ పరిశోధనా స్థానంవారి తోడ్పాటుతోఈ రకాన్ని సాగుచేయవచ్చు.

నవకల్పనకు లభించిన గుర్తింపు : ఏమీ లేవు

Related Terms: Farmers InnovationFIS
Copy rights | Disclaimer | RKMP Policies