Best Viewed in Mozilla Firefox, Google Chrome

వ్యవసాయ యాంత్రీకరణ, వరి డ్రం సీడర్ వినియోగం

PrintPrintSend to friendSend to friend

వ్యవసాయ యాంత్రీకరణ, వరి డ్రం సీడర్ వినియోగం

రైతు గురించి :

  • రైతు పేరు: శ్రీ బలిజేపల్లి వెంకట రమణ మూర్తి 
  • ప్రదేశం: శ్రీకాకుళం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
  • పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు: 07-05-1958 మరియు 52 సంవత్సరాలు
  • విద్యార్హతలు: బి.ఎస్సీ.
  • సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 4 హె.
  • వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 30 సంవత్సరాలు
  • రైతు అనుసరించిన పంటల సరళి : వరి - పెసలు - కూరగాయలు, వరి - మినుములు - కూరగాయలు, పచ్చిరొట్ట - వరి – పప్పుధాన్యాలు, వరి - కూరగాయలు – కూరగాయలు

నవకల్పన యొక్క వివరాలు:

కొత్తగా ఏమి కనిపెట్టారు: వ్యవసాయ యాంత్రీకరణ, వరి డ్రం సీడర్ వినియోగం

నవకల్పన వర్ణన: వరి డ్రం సీడర్ టెక్నాలజీని ఈ రైతు 2008 -09 ఖరీఫ్ లో మొదలుపెట్టి తరువాత 2 హె. కు విస్తరించారు. క్రమంగా ఆ చుట్టుపక్కల గ్రామాలలో మరో 10 హె. లో కూడా ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.

  • 8 వరుసల డ్రం సీడర్ ను వాడడం ద్వారా ఈ రైతు హెక్టారుకు రూ. 6,500 నికర ఆదాయం పొందగలిగారు  
  • 8 వరుసల డ్రం సీడర్ తో నేరుగా విత్తే విజయగాధ `ఈ - టి.వి.’ అన్నదాతలో 2010 నవంబర్ లో ప్రసారం అయ్యింది.
  • వరిలో విత్తన గ్రామం భావనను ప్రోత్సహించడం

ప్రోబ్లెం స్టేట్మేంట్ (ఈ రైతు కనిపెట్టినదాని వలన ఏ సమస్య, ఎలా దూరమైంది): -

టెక్నాలజీ అభివృద్ధి చేసిన విధానం: -

నవకల్పనకు లభించిన గుర్తింపు: శ్రీ బి.వి.రమణగారిని చూసి చుట్టుపక్కల రైతులు పచ్చిరొట్టపైరులను పెంచడం, డ్రం సీదర్ ను ఉపయోగించడం, వరిలో విత్తనోత్పత్తిని చేపట్టడం మొదలుపెట్టారు. శ్రీ రమణగారు గుర్తింపు పొందిన వరి ఫౌండేషన్ విత్తన సరఫరాదారు. వీరు ఎ.పి.ఎస్.డి.సి. కి విత్తనాలు సరఫరా చెయ్యడం ద్వారా హెక్టారు కు మామూలుకన్నా రూ. 9,000 - 10,000 /- అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.

Related Terms: Farmers InnovationFIS
Copy rights | Disclaimer | RKMP Policies