Best Viewed in Mozilla Firefox, Google Chrome

పచ్చిరొట్ట ఎరువులతో చౌడునేలలను పునరుద్ధరించడం

PrintPrintSend to friendSend to friend

పచ్చిరొట్ట ఎరువులతో చౌడునేలలను పునరుద్ధరించడం

రైతు గురించి :

  • రైతు పేరు: కె. నాగేశ్వర రెడ్డి
  • ప్రదేశం: కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
  • పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు: 1-7-1959, 52 సంవత్సరాలు
  • విద్యార్హతలు: ఇంటర్మీడియట్
  • సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 20 హె
  • వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 30 సంవత్సరాలు
  • రైతు అనుసరించిన పంటల సరళి :వరి - పొద్దుతిరుగుడు, జొన్న, కందులు

నవకల్పన యొక్క వివరాలు:

కొత్తగా ఏమి కనిపెట్టారు:

1. శ్రీవరి సాగును ప్రవేశపెట్టడం

2. పచ్చిరొట్ట ఎరువులతో చౌడునేలలను పునరుద్ధరించడం

నవకల్పన వర్ణన:

1. కర్నూలు జిల్లాలో 2003 లో శ్రీ వరి సాగును ప్రవేశపెట్టడం. శ్రీ వరి సాగులోని ఆచరణ పద్ధతులు: 

  • ఎకరానికి 2 కిలోల విత్తనం వాడడం.
  • 8 నుండి 12 రోజుల వయసున్న నారును నాటడం.
  • 25 x 25 సెం.మీ. దూరంలో వరినారును నాటుకోవడం.
  • నాటడానికి 12 రోజులముందునుండి 10 రోజులకొకసారి కోనోవీడర్ తో కలుపుతీయడం
  • కంకి ఏర్పడడం మొదలుపెట్టే దశవరకూ పొలాన్ని ఒకసారి ఎండబెట్టడం, ఒకసారి తడి ఇవ్వడం మార్చి మార్చి చేస్తూ ఉండాలి.
  • సేంద్రీయ ఎరువులను అధిక మోతాదులో వాడడం

2. కర్నూలు జిల్లాలో వరికి ముందు జీలుగను పచ్చిరొట్ట పైరుగాప్రవేశపెట్టడం. 12 కిలోల జీలుగ విత్తనాన్ని వరి మాగాణుల్లో వెదజల్లి మొక్కలు పూతకోచ్చే దశలో వాటిని భూమిలోకలియదున్నడం.

ప్రోబ్లెం స్టేట్మేంట్ (ఈ రైతు కనిపెట్టినదాని వలన ఏ సమస్య, ఎలా దూరమైంది):

1. శ్రీ వరి సాగును ప్రవేశపెట్టకముందు రైతులు ఎకరానికి 30 -35 బస్తాల దిగుబడిని పొందేవారు. వరిపంట సాగుకు నీరు ఎక్కువగా వినియోగించేవారు.

2. పచ్చిరొట్ట పైరు ప్రవేశపెట్టక ముందు భూమి యొక్క ఉదజనసూచి 9 .2 ఉండేది. పచ్చి రొట్ట పైరు వేయడం మొదలుపెట్టిన తరువాత ఉదజనసూచి 8 కి తగ్గింది.

టెక్నాలజీ అభివృద్ధి చేసిన విధానం:

1. శ్రీ వరి సాగును ప్రవేశపెట్టడం.

           అ ) శ్రీ వరి సాగును ప్రవేశపెట్టాక దిగుబడి ఎకరానికి 54 బస్తాల వరకు పెరిగింది

           ఆ) మామూలు పద్ధతిలో ఎకరానికి సరిపోయే నీరుతో శ్రీ వరిసాగు పద్ధతిలో 1.5 నుండి 1.75 ఎకరాలు సాగు చేయవచ్చు.

2. పచ్చిరొట్ట ఎరువులతో చౌడునేలలను పునరుద్ధరించడం

           అ ) పచ్చిరొట్ట ఎరువు వెయ్యక ముందు చౌడు భూముల్లో ఎకరానికి 20 -25 బస్తాల దిగుబడి వచ్చేది. పచ్చిరొట్ట పైరు ప్రవేశపెట్టాక ఎకరానికి 40 బస్తాల వరకూ దిగుబడి పెరిగింది.

           ఆ) బియ్యం నాణ్యత పెరిగి మంచి ధర లభిస్తోంది.

నవకల్పనకు లభించిన గుర్తింపు: 2008 సంవత్సరం సంక్రాంతి పురస్కారాలలో ఉత్తమ రైతు అవార్డు వచ్చింది.

Related Terms: Farmers InnovationFIS
Copy rights | Disclaimer | RKMP Policies