Best Viewed in Mozilla Firefox, Google Chrome

అధికోత్పత్తికి సుస్థిర, సేంద్రీయ పద్ధతిలో వరి సాగు

PrintPrintSend to friendSend to friend

రైతు గురించి :

 • రైతు పేరు: శ్రీ జి. నాగరత్నం నాయుడు
 • ప్రదేశం: దిల్ సుఖ్ నగర్ , హైదరాబాద్
 • పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు: 57 సంవత్సరాలు
 • విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా
 • సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 4 హె.
 • వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 22 సంవత్సరాలు
 • రైతు అనుసరించిన పంటల సరళి : వరి - వరి, వరి, కూరగాయలు/ వేరుశనగ / పప్పుధాన్యాలు, పూలు, పశుగ్రాసం

నవకల్పన యొక్క వివరాలు:

కొత్తగా ఏమి కనిపెట్టారు: అధికోత్పత్తికి సుస్థిర, సేంద్రీయ పద్ధతిలో వరి సాగు

నవకల్పన వర్ణన: సేంద్రీయ వ్యవసాయం

 • పొలంలో ఎకరానికి 5 టన్నుల చొప్పున దిబ్బెరువు (పేడ, మేక, గొర్రెల పెంట) వేయడం
 • పొలంలో పచ్చిరొట్ట ఎరువును ఆకెరువును (వేప) కలియదున్నడం
 • జీవామృతాన్ని నేరుగా కానీ, దిబ్బెరువుతో కలిపి కానీ రెండుసార్లు పైపా టుగా వేయడం

జీవామృతం:

10 కే.జి.ల ఆవు పేడ, 10 లీ. ఆవు మూత్రం, 0.5 కే.జి.ల ఆవు నెయ్యి, 1 కే.జి.ల బెల్లం, 200 గ్రా. మంచి ఎర్రమట్టి, 200 లీ. నీటిలో కలిపి

దిబ్బెరువుతో పాటు జీవన ఎరువులను (అజోస్పైరిల్లం, అజటోబాక్టర్, భాస్వరాన్ని కరిగించే బాక్టీరియా) పైపాటుగా వేయడం. సిస్టం ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ (శ్రీ సాగు)

 • రెండు కిలోల విత్తనంతో ఒక ఎకరంలో నాట్లు వేయడం
 • 12 రోజుల నారును నాటడం
 • 25x25 సెం.మీ. దూరంలో నాటడం
 • కోనో వీడర్ ను నాలుగు సార్లు తిప్పడం
 •  పొలాన్ని మార్చి మార్చి తడపడం, ఎండగట్టడం
 • చీడ పీడలను జీవకీటకనాశనులతో, బయోడైనమిక్ ఫార్మ్యులే షన్స్ తో, వేప చెక్కతో నివారించడం
 • ప్రతి రెండు మీటర్లకు పొలం చుట్టూ నీటిపారుదల కాలవలు తీసి వాటిని ఒకదానితో ఒకటి కలిపి నీటిని ఆదా చేయడం

ప్రోబ్లెం స్టేట్మేంట్ (ఈ రైతు కనిపెట్టినదాని వలన ఏ సమస్య, ఎలా దూరమైంది): కూలీ ఖర్చులు, ఎరువులు, పురుగుమందుల ఖర్చు అధికంగా ఉండడంవలన వరి సాగు రైతులకు గిట్టుబాటు కాకుండా ఉంది. దిగుబడులు కూడా ఏమా త్రం పెరగడం లేదు. ఈ కొత్త పద్ధతి సాగు ఖర్చు తగ్గి, తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావడానికి దోహదపడుతుంది.

 • అధిక మోతాదులో, అంటే ఎకరానికి దాదాపు 28 కే.జీ.ల విత్తనాన్ని ఆదా చెయ్యడం.
 • మామూలు పద్ధతితో పోలిస్తే 40 % నీరు ఆదా చేయడం. విద్యుత్తును కూడా ఆదా చెయ్యడం.
 • అధిక దిగుబడుల ద్వారా జాతీయ ఆహార భద్రతను సాధించడం.
 • ఈ పద్ధతి పాటించడం ద్వారా ఈ రైతు రికార్డు స్థాయిలో, హెక్టారుకు 15.5 టన్నుల దిగుబడి సాధించాడు.
 • సాంప్రదాయ పద్ధతిలో కన్నా సాగు ఖర్చు 25 శాతం తగ్గింది.

టెక్నాలజీ అభివృద్ధి చేసిన విధానం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించాలన్నది శ్రీవరి సాగు యొక్క ఉద్దేశ్యం. ఈ పద్ధతిని సుస్థిరంగాను, పర్యావరణానికి మేలు చేసేదిగాను చెయ్యడానికి ఈ పద్ధతిని సేంద్రీయ వ్యవసాయంతో కలపడం జరిగింది.

శ్రీవరి సాగు ప్రయోజనాలు:

 • విత్తనాలమీద, ఎరువులమీద, పురుగుమందుల మీద పెట్టుబడిని తగ్గించడం ద్వారా సాగు ఖర్చును తగ్గిస్తుంది.
 • సాంప్రదాయ పద్ధతిలోకన్నా దిగుబడులను 30 శాతం పెంచడానికై ఈ పద్ధతి ఉద్దేశింపబడింది.
 • ఈ పద్ధతిలో భూసారం పెరుగుతుంది కాబట్టి ఇది సుస్థిరమైనది కూడా

నవకల్పనకు లభించిన గుర్తింపు: దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ పద్ధతి అనుసరింపబడుతోంది. ఈ కృషికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు, అభినందనలు లభించాయి.

Related Terms: Farmers InnovationFIS
Copy rights | Disclaimer | RKMP Policies