Best Viewed in Mozilla Firefox, Google Chrome

వరిలో చీడ పురుగుల యాజమాన్యానికి కొత్త జీవకీటకనాశిని

PrintPrintSend to friendSend to friend

రైతు గురించి: 

• రైతు పేరు: బచ్చు వీరా రెడ్డి

• ప్రదేశం: కరీం నగర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

• పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు: 15-3-1946, 64 సంవత్సరాల 9 నెలలు

• విద్యార్హతలు: పప్పు ధాన్యాలు బి.ఎస్సీ (ఎజి)

• సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 41 సం.

• వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 16 హె.

• రైతు అనుసరించిన పంటల సరళి : వరి - పప్పు ధాన్యాలు

నవకల్పన యొక్క వివరాలు:

కొత్తగా ఏమి కనిపెట్టారు: వరిలో చీడ పురుగుల యాజమాన్యానికి కొత్త జీవకీటకనాశిని

నవకల్పన వర్ణన: ఇక్కడి ప్రజల ప్రధాన ఆహారం కనుక ఇక్కడ ఎక్కువ విస్తీర్ణం వరి సాగు కింద ఉంది. వరిలో కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, ఉల్లికోడు, సుడిదోమ మొదలైన చీడ పురుగుల నివారణకు ఉపయోగించే రసాయనిక పురుగుమందుల అవశేషాలవలన మనుషులకు, పశువులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. అదేకాకుండా సేంద్రీయంగా పండించిన వరికి చాలా గిరాకీ ఉంది. ఈ రైతు సహజంగా లభించే వాటితో ఒక కొత్త జీవకీటకనాశనిని రూపొందించారు. జీవకీటకనాశనిలో ఉపయోగించే వస్తువులు:

1. వేప : 3 కె.జి.

2. జిల్లేడు ఆకు : 2 కె.జి.

3. సీతాఫలం ఆకు : 2 కె.జి.

4. సీమ తులసి ఆకు : 2 కె.జి.

5. ఉమ్మెత్త ఆకు : 2 కె.జి.

6. ఆవు మూత్రం : 15 లీ

తయారు చేసే విధానం : అన్ని వస్తువులను ఒక కుండలో కలిపి, మూత పెట్టి 5 -7 రోజులు కుళ్ళనివ్వాలి. తరువాత అవి బాగా కలగలిపి వడగట్టి వచ్చిన ద్రవాన్నిఎకరానికి 200 లీటర్ల నీటికి 5 లీటర్ల చొప్పున ఉపయోగించాలి.

నివారించవలసిన పురుగులు: కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, ఉల్లికోడు, సుడిదోమ మొదలైన చీడ పురుగుల నివారణకు ఈ ద్రావణం ఉపయోగపడుతుంది. ప్రోబ్లెం స్టేట్మేంట్ (ఈ రైతు కనిపెట్టినదాని వలన ఏ సమస్య, ఎలా దూరమైంది): వరిలో కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, ఉల్లికోడు, సుడిదోమ మొదలైన చీడ పురుగులు అపారమైన నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ కొత్త జీవకీటకనాశక ద్రావణం కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, ఉల్లికోడును సమర్ధవంతంగా నివారిస్తుంది. సుడిదోమను కొంతమేరకు నివారిస్తుంది.

టెక్నాలజీ అభివృద్ధి చేసిన విధానం: చాలామందికి వరి ప్రధాన ఆహారం కాబట్టి, పురుగు మందులు లేని సురక్షితమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో ఈ జీవ కీటకనాశిని ఎంతో ఉపయోగపడుతుంది. రసాయనిక పురుగుమందులవలె ఇది పశువులకు, మనుషులకు హాని చేయదు. ఈ కొత్త జీవకీటకనాశక ద్రావణం పర్యావరణానికి కూడా హాని చేయదు. ఈ జీవకీటకనాశక ద్రావణం పురుగులను పారద్రోలి పురుగుల సంఖ్యను ఆర్థికంగా నష్ట పరిచేస్థాయిలోపల ఉంచుతుంది.

నవకల్పనకు లభించిన గుర్తింపు: -NA

Related Terms: Farmers InnovationFIS
Copy rights | Disclaimer | RKMP Policies