Best Viewed in Mozilla Firefox, Google Chrome

వర్షాలు లేక ఎండుతున్న వరినారు

PrintPrintSend to friendSend to friend

మెరకముడిదాం,విజయనగరం: మండలంలో గత 20 రోజులగా వరుణుడు కనె్నర్ర చేయడంతో వర్షాలు కురవలేదు. దీంతో వరి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కురిసిన ఒక మోస్తారు వర్షాలకు రైతులు వరి నారు మళ్ళు తయారు చేసుకున్నారు. చెరువుల్లో ఉన్న కాస్త నీటిని వినియోగించుకని దమ్ములు చేసి వరినాట్లు నాటుకున్నారు. ఈ తరుణంలో వరుణుడు కనె్నర్ర చేయడతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ మండలంలో సుమారు 1763 హెక్టార్ల పల్లం భూమి వరిసాగుకు ఉండగా ఈ ప్రాంతం పూర్తిగా మెరకప్రాంతం కావడంతో 50 శాతం రైతులు వాణిజ్య పంటలను సాగు చేసుకుంటున్నారు. విత్తనాలు దొరకని సమయంలో అధిక రేట్లు పెట్టి విత్తనాలను కొనుగోలు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Courtesy: http://www.andhrabhoomi.net/node/105212

Copy rights | Disclaimer | RKMP Policies