Best Viewed in Mozilla Firefox, Google Chrome

భారీ వర్షానికి నేలకొరిగిన వరి చేలు

PrintPrintSend to friendSend to friend

ఆత్రేయపురం, అక్టోబర్ 21: భారీ వర్షం కారణంగా ఆత్రేయపురం మండలంలో వరిచేలు నేలనంటాయి. సోమవారం కురిసిన వర్గానికి వరిచేలు నేలమట్టం కావడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధిక పెట్టుబడులు పెట్టి పంట చేతికందేసరికి గాలులతో కూడిన వర్షం పడటంతో మండలంలోని వరిచేలు తీవ్ర నష్టానికి గురయ్యాయి. మండలంలోని సుమారు 5,500 ఎకరాల్లో వరినాట్లు వేశారు. దీనిలో స్వర్ణరకం వరి 90శాతం వేశారు. చేతికంది వచ్చిన పంట నేల మట్టం కావడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నీలం తుపాను కారణంగా నష్టపోయిన పంటకు పరిహారం అందకపోవడంతో కష్టాన్ని నమ్ముకుని మరో పంటకు సిద్ధమైన రైతు నష్టాల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆదుకుని తగిన సహకారం అందించాలని రైతులు కోరుతున్నారు. మండల వ్యవసాయాధికారి కెవిఎన్ రమేష్ కుమార్ మాట్లాడుతూ వరిచేలలో నీరు లేకుండా తొలగించి పడిపోయిన వరిని కట్టలుగా కట్టి నిలబెట్టుకుంటే కొంతవరకు నష్టాన్ని నివారించుకోవచ్చన్నారు.

Courtesy : http://www.andhrabhoomi.net/node/113147

Copy rights | Disclaimer | RKMP Policies