Best Viewed in Mozilla Firefox, Google Chrome

తగ్గిన ఎరువుల వాడకం

PrintPrintSend to friendSend to friend

రాష్ట్రంలో ఎరువుల వినియోగం తగ్గిపోతోంది. కేంద్రం ఎరువులకు ఇచ్చే సబ్సిడీలను దిగ్గోయడంతో కంపెనీలు అంతకంతకూ ధరలు పెరచుతున్న దృష్ట్యా రైతులు విధి లేని పరిస్థితుల్లో వాడకం తగ్గిస్తున్నారు. పోషకాధార సబ్సిడీ విధానం (ఎన్‌బిఎస్‌) వచ్చాక యూరియా తప్ప తక్కిన ఎరువుల వినియోగం దారుణంగా పడిపోయింది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయం కోసం రైతులు మళ్లారా అంటే అదేమీ కాదు. పెరుగుతున్న ధరలకనుగుణంగా పెట్టుబడులు సమకూరక కొనుగోలు శక్తి లేకనే రైతులు ఎరువులకు దూరం జరుగుతున్నారని వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఎరువుల కంపెనీలు సైతం ఇదే అంచానాకొచ్చాయి. కాగా రైతుల నుంచి డిమాండ్‌ లేకపోయినా ఉన్న కొద్దిపాటి అమ్మకాల నుంచి లాభాలు పిండుకోవాలని ప్రైవేటు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్‌బిఎస్‌ ముసుగులో తమకిష్టమొచ్చినట్లు ధరలు పెంచుతున్నాయి. ఉత్పత్తిని తగ్గించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. గత రెండేళ్లతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖరీఫ్‌ ఆశాజనకంగా ఉంది. తాజా వర్షాలతో ఇప్పుడిప్పుడే ప్రధాన జలాశయాల్లోకి నీరు చేరుతుండటంతో సాగు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. జులై నెలాఖరుకు 64 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వరి నాట్లతో పాటు కొన్ని పంటలు కాస్త తక్కువ స్థాయిలో, మరికొన్ని సాధారణం కంటే కాస్త ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యాయి.

ఏతావాతా చూస్తే గతేడాది కంటే మూడు లక్షల హెక్టార్లలో అధికంగా సేద్యం జరిగింది. ఎరువుల వాడకం సాగుకు తగ్గట్టు లేదని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో అన్ని ఎరువులూ కలుపుకొని 40.75 లక్షల టన్నులు కేటాయించగా జులై మాసం పూర్తయ్యే సరికి 12.85 లక్షల టన్నులనే రైతులు వినియోగించారు. కేటాయించిన ఎరువుల్లో 31 శాతం మాత్రమే అమ్ముడు పోయాయి. సేద్యం 64 శాతం విస్తీర్ణంలో జరగ్గా, కేటాయించిన ఎరువుల్లో సగం కూడా వినియోగం కాలేదు. ముందు జాగ్రత్త చర్యగా అవసరాలకు మించి పది శాతం ఎక్కువ కేటాయింపు చేశారనుకున్నా ఆ దరిదాపులకు కూడా వినియోగం చేరలేదు. పంటలకు పోషకాలందించే డిఎపి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేటాయింపులో 20 శాతం మాత్రమే అమ్మకాలు సాగాయి. కాంప్లెక్స్‌ ఎరువులు 26 శాతం వినియోగమయ్యాయి. యూరియా పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. కేటాయించిన దాంట్లో 44 శాతం అమ్ముడు పోయింది. సీజన్‌ ప్రారంభం అయ్యేనాటికి కంపెనీల డీలర్ల వద్ద ఉన్న ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌ను కలుపుకుంటే డిమాండ్‌ లేక గోదాముల్లో ఎరువులు మూలుగుతున్నాయి. అయినాసరే కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. ఖరీఫ్‌ మొదట్లోనే దాదాపు అన్ని కంపెనీలూ డిఎపి, కాంప్లెక్స్‌ ధరలు పెంచేశాయి. వ్యవసాయశాఖ వెల్లడించిన దాని ప్రకారం డిఎపి 50 కిలోల బస్తా ఖరీదు రూ.1,200 వరకూ ఉంది.

కాంప్లెక్స్‌ సైతం ఇంచుమించు అంతే ఉంది. కంపెనీలను బట్టి ధరలో స్వల్ప తేడాలున్నాయి. దీంతో రైతులు ఆ ఎరువులు అవసరమైనప్పటికీ కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు సిఫారసు చేసినదానికంటే తక్కువ వాడుతున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాన్ని జోన్లుగా విభజించి నేల స్వభావాన్ని బట్టి ఎరువులను సిఫారసు చేస్తారు. కాగా రైతుల్లో కొనుగోలు శక్తి పడిపోయి పంటలకు ఎరువులు వేయట్లేదు. యూరియా ధర రూ.284 కాస్త అందుబాటులో ఉండటంతో అవసరం ఉన్నా లేకపోయినా వేస్తున్నారు. యూరియా ఎక్కువ వినియోగిస్తే పంటలకు చీడపీడలు సోకుతాయని, దిగుబడి, నాణ్యత తగ్గుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పంటలకు కావాల్సిన పోషకాలను కాలానుగుణం అందించపోతే దిగుబడులపై ప్రభావం పడుతుందంటున్నారు. ఈ ఏడాది పంట రుణాల పంపిణీ నత్తనడకన సాగడం, రాష్ట్ర విభజన ప్రకటనతో వారం రోజుల నుంచి సీమాంధ్రలో బ్యాంకులు పని చేయకపోవడం ఇత్యాది కారణాల వల్ల సంస్థాగత పరపతి ప్రమాదంలో పడింది. సమయానికి చేతికి సొమ్ము అందక కొద్దిపాటి ఎరువులను సైతం వేయలేకపోతున్నారు.

ఎరువు కేటాయింపు జులై వరకూ అమ్మకాలు నిల్వలు

ప్రణాళిక

డిఎపి 7.00 3.48 1.44 1.72

కాంప్లెక్స్‌ 11.00 5.54 5.54 3.25

యూరియా 16.50 9.58 9.58 2.07

ఇతర ఎరువులు

కలిపి మొత్తం 40.75 22.19 12.85 7.80

Courtesy : http://www.prajasakti.com/headlines/article-452181

Copy rights | Disclaimer | RKMP Policies