Best Viewed in Mozilla Firefox, Google Chrome

ఈదురు గాలులతో వరి పంటకు నష్టం

PrintPrintSend to friendSend to friend

పార్వతీపురం, అక్టోబర్ 15: ఫైలిన్ తుపాను కారణంగా వీచిన ఈదురు గాలులు పుణ్యమా అని పార్వతీపురం డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో వరి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడినట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం ఏజెన్సీలోని పార్వతీపురం, కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల్లో చేతికి అంది వచ్చిన వరి పంట నేలకొరడమే కాకుండా వెనుకగా వేసిన వరి నాట్లు నేలకొరిగాయి. దీంతో రైతాంగం తీవ్ర నష్టాలు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గోగుపంటలు కూడా పలుచోట్ల నేలకొరిగాయని, పత్తి పంటలు కూడా పాడయ్యాయని పలువురు తెలిపారు. విద్యుత్ స్తంభాలు పలు ప్రాంతాల్లో నేలకొరడమే కాకుండా వాటి వల్ల ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందోనని అందువల్ల తక్షణమే వాటిని పునరుద్దరించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈదురు గాలులు వల్ల పంట పొలాల్లోని కిందకు వాలిన విద్యుత్ వైర్లను తక్షణమే సరిచేయాలని రైతాంగం కోరుతున్నారు. అయితే పంట నష్టాల వివరాలు అంచనా వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారులు అంటున్నారు. అలాగే విద్యుత్‌ను సరిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ అధికారులు తెలిపారు.

Courtesy : http://www.andhrabhoomi.net/node/112234

Copy rights | Disclaimer | RKMP Policies