Best Viewed in Mozilla Firefox, Google Chrome

మధ్య తెలంగాణా మండలంలో పోషకాల యాజమాన్యం

పోషకాల యాజమాన్యం

  • రసాయన ఎరువులతో బాటు సేంద్రీయ ఎరువులను, జీవన ఎరువులను సమతుల్యమైన పద్ధతిలో వాడి భూసారం మరియు వరి పంట ఉత్పాదకత పెంచి, పోషించవచ్చు.
  • సిఫార్సు చేసిన నత్రజనిలో 25 -50 % నత్రజనిని పచ్చిరొట్ట పైర్ల ద్వారా, కంపోస్టు, దిబ్బెరువు, కోళ్ళ పెంట వంటివాటి ద్వారా అందచేస్తే స్థిరమైన దిగుబడులు వస్తాయి.
  • పొలంలో జీలుగ, జనుము, పిల్లిపెసర లేక మినుములు, పెసలు వంటి అపరాల పంటల అవశేషాలను పచ్చి రొట్టగా వేస్తే భూసారం, ఉత్పాదకత పెరుగుతాయి.
  • నీలి ఆకుపచ్చ శైవలాలు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియా వంటి జీవన ఎరువులు వరి పంట యొక్క నత్రజని, భాస్వరం అవసరంలో 10 -20 % వరకూ తీరుస్తాయి.
  • రబీ సీజన్లో నత్రజని, భాస్వరం మరియు పోటాష్ ఎరువులను హెక్టారుకు 180 :90 :60 కిలోల చొప్పున వేయాలి. మొత్తం భాస్వరం మరియు పోటాష్ ఎర

మధ్య తెలంగాణా మండలానికి సిఫార్సు చేసిన ఎరువులు

ఎ) నారుమడికి సిఫార్సు చేసిన ఎరువులు

  • ఆరోగ్యకరమైన నారు కొరకు దుక్కిలో ప్రతి 100 చ. మీ. నారుమడికి 0.5 కిలోల నత్రజని, 0.5 కిలోల భాస్వరం మరియు 0.5 కిలోల పోటాష్ వేయాలి. విత్తిన 12 రోజులకు మరో 0.5 కిలోల నత్రజని వేయాలి.  
  • జింకు లోపాన్ని గమనిస్తే, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి.
  • నారుమడిలో ఇనుము లోపాన్ని సరిదిద్దేందుకు 5-10 గ్రా. అన్నబేధి లేదా ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ ను 0.5 నుండి 1.0 గ్రా. నిమ్మఉప్పుతో లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

బి ) ప్రధాన పొలానికి సిఫార్సు చేసిన ఎరువులు

  • నత్రజనిని మూడు దాఫాలుగా ( దమ్ములోను, దుబ్బుచేసే దశలోనూ, అంకురం దశలోనూ) వేయాలి. బరువు నేలల్లో భాస్వరం మరియు పోటాష్ దమ్ములోనే వేయవచ్చు.
  • తేలిక భూము

మధ్య తెలంగాణా మండలంలో కలుపు నియంత్రణ

కలుపు యాజమాన్యం:

  • ముఖ్యంగా నాటిన 45 రోజులవరకూ పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.  
  • కూలీలు వీలుగా దొరికే ప్రాంతాల్లో నాటిన 20 రోజులకొకసారి, 40 రోజులకొకసారి చేత్తో కలుపు తీయించాలి.
  • కలుపు నిర్మూలనకు ఈ మందులలో ఏదైనా ఒకటి పొలంలో పలుచగా నీరు కట్టి చల్లాలి. బ్యుటాక్లోర్ ఎకరానికి 1.25 లీటర్ల చొప్పున (లేదా) అనిలోఫాస్ ఎకరానికి 500 మీ.లీ. చొప్పున (లేదా) ప్రేతిలాక్లోర్ ఎకరానికి 600 మీ.లీ. చొప్పున (లేదా) ఆక్సాడయార్జిల్ 40 గ్రా. చొప్పున (లీటరు నీటిలో కలిపి) నారు నాటిన 3 నుండి 5 రోజులలో చల్లాలి. లేదా నాటిన 8 -12 రోజులకు ఎకరానికి 80 -100 గ్రాముల పైరజోసల్ఫ్యురాన్ ఇథైల్ ను పిచికారీ చేయాలి. లేదా బెన్ సల్ఫ్యురాన్ మిథైల్ ఎకరానికి 35 గ్రా. చొప్పున నాటిన 3 - 25 రోజుల మధ్యన (ప్రీ టు పోస్ట్ ఎమర్జేన్స్) పిచికారీ చెయ్యాలి.
  • వెడల్పాటి ఆకుల కలు

మధ్య తెలంగాణా మండలంలో నీటి యాజమాన్యం

నీటి యాజమాన్యం: 

  • సక్రమమైన నీటి యాజమాన్యంతో పైరు పిలకలు బాగా తొడిగి, పోషకాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటుంది. కలుపు ఉధృతి కూడా తగ్గుతుంది.
  • నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా (1 -2 సెం.మీ. మందం) ఉండాలి.  
  • నాటిన తరువాత, మొక్కలు నిలదొక్కుకునే వరకూ 5 సెం.మీ. లోతు నీరు నిలగట్టాలి.
  • పైరు దుబ్బుచేసే సమయంలో పొలంలో నీరు పలుచగా, అంటే 2-3 సెం. మీ. లోతు ఉండాలి.
  • అంకురం దశ నుండి గింజ గట్టిపడే వరకూ (కోతకు 10 రోజుల ముందు వరకూ) నీరు 5 సెం.మీ. లోతుండాలి.  
  • అంకురం దశలోనూ, పూత దశలోనూ, పాలు పోసుకునే సమయంలోను పైరుకు నీటి ఎద్దడి కలుగకూడదు.
  • మధ్య తెలంగాణా మండలంలో వరి ప్రధాన పొలం తయారీ

    ప్రధాన పొలం :  

    • ప్రధాన పొలం తయారీకి ముందు వేసవి మధ్యలో భూమిని ఒకటిరెండుసార్లు దున్నాలి. దీనివలన కలుపు మొక్కల వేళ్ళు వెలికి వచ్చి కలుపు మొక్కలు అదుపులో ఉంటాయి. పలు చీడ పీడల గుడ్ల సముదాయాలు, నిద్రావస్థలో ఉన్న దశలూ ఎండబారిన పడతాయి. వేసవి దుక్కుల వలన వేసవిలో లభించిన తేమను కూడా నేల పట్టి ఉంచుకుంటుంది.
    • కాలువల ద్వారా నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పచ్చిరొట్ట ఎరువులు వేయడం చాలా మంచిది.
    • నారు నాటడానికి 15 రోజుల ముందు నుండీ మురగ దమ్ము చేయడం మొదలు పెట్టాలి.  
    • ట్రాక్టరుతో కానీ పవర్ టిల్లర్ తో కానీ 15 సెం.మీ. లోతు మురగదమ్ము చేస్తే సరిపోతుంది.  
    • ఆఖరుసారి మురగ దమ్ము చేసిన తరువాత పొలాన్ని బాగా చదును చేసి, నట్లు వేయడానికి ముందు 2 -3 రోజులు అలాగే వదిలెయ్యాలి. బరువు నేలలలో నీటి యాజమాన్యానికి, కలుపు నివ

    మధ్య తెలంగాణా మండలంలో వరి నారుమడికి నేల తయారీ

    నారుమడి యాజమాన్యం (మాగాణి భూముల్లో):

    • నీరు పెట్టడానికి, తియ్యడానికి వీలుగా ఉండే భూమిని ఎంచుకోవాలి.
    • విత్తడానికి ఒక నెల ముందుగానే నారుమడిని సిద్ధం చేసుకోవాలి.
    • నారుమడిని వేసవిలో రెండుసార్లు దున్ని, ఆ తర్వాత 5-6 రోజుల వ్యవధితో 3 -4 దఫాలు దమ్ము చేయాలి.
    • ఆఖరి దమ్ము తర్వాత భూమిని చదును చేసి, నీరుపెత్తదానికి, తియ్యడానికి వీలుగా కాలువలు ఏర్పరుస్తూ మీటరు వెడల్పున, అనుకూలమైన పొడవున ఎత్తుగా మళ్ళు చేసుకోవాలి.
    • నేల స్వభావాన్ని మెరుగుపరిచేందుకు బాగా చివికిన పశువుల ఎరువు/ కంపోస్టు 5 సెంట్లకు 200 కిలోల చొప్పున వేయాలి.
    • వరి విత్తనాన్ని 16 -24 గంటలు నానబెట్టి, మరో 24 - 36 గంటలు ఉంచి, నాటే ముందు మొలక కట్టించాలి.
    • 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని (4.4 కిలోల యూరియా), ఒక కిలో `P2O5’ (6.25 కిలోల ఎస్.ఎస్.పి.) మరియు 1 కిల

    మధ్య తెలంగాణా మండలంలో వరి నారుపోసే సమయం, విత్తనమోతాదు

    విత్తనమోతాదు ఎకరానికి

    • నాటడానికి 20-25 కిలోలు,
    • నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
    • శ్రీ పద్ధతికి 2 కిలోలు

    వివిధ పరిస్థితులలో మధ్య తెలంగాణా మండలానికి సిఫార్సు చేయబడిన వరి రకాలు

    మధ్య తెలంగాణా మండలంలో వరి పంటకు రబీ సీజన్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

    ఆంధ్ర ప్రదేశ్ లో మధ్య తెలంగాణా మండలంలోకి వచ్చే జిల్లాలు :

    • వరంగల్
    • ఖమ్మం మరియు
    • మెదక్
    Copy rights | Disclaimer | RKMP Policies