Best Viewed in Mozilla Firefox, Google Chrome

జగిత్యాల అగ్రికల్చర్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బోర్లు, బావులు, ఇతర నీటి వనరుల కింద రైతులు వరి నారుమడులు పోసుకున్నారు. నారుమడి దశలోనే తగిన యాజ మాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మొ క్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ప్రధాన పొలంలో పైరు ఎటువంటి చీడపీడలకు లోనవకుండా ఎదిగి, నాణ్యమైన దిగుబడులు అంది స్తుంది. ఈ నేపథ్యంలో వరి నారుమడిలో చేపట్టాల్సిన చర్యలపై కరీంనగర్ జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్ (వరి) అందిస్తున్న సూచనలు...

నారు పోసిన 10-15 రోజుల తర్వాత 5 సెంట్ల నారుమడిలో (ఇది ఎకరం విస్తీర్ణంలో నాటేందుకు సరిపోతుంది) 2.2 కిలోల యూరి యాను పైపాటుగా చల్లుకోవాలి. మొక్కలకు రెండు మూడు ఆకులు వచ్చే వరకూ ఆరుతడులు ఇవ్వాలి. ఆ తర్వాత మడిలో పలచగా నీర

09
Aug

పొడ తెగులు నివారణ

పొడ తెగులు నివారణ

a. వేసవి దుక్కులు

b. విత్తన శుద్ధి

c. సరైన దూరంలో నాటడం

d. పొలాన్ని శుభ్రంగా ఉంచి, సకాలంలో కలుపును నిర్మూలించడం

e. నత్రజనిని మోతాదుకు మించి వాడకపోవడం

f. హెక్సాకొనజోల్ (2.0 మి.లీ.) లేక వాలిడామైసిన్ (2.0 మి.లీ.) లేక ప్రోపికొనాజోల్ (1.0 మి.లీ.) లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యడం.

g. పైరు బాగా తడిచేలా పిచికారీ చెయ్యడం

09
Aug

పొడ తెగులు

ఆంగ్ల నామం : షీట్ బ్లైట్

తెగులును కలుగచేసే జీవి: రైజోక్టోనియా సొలానీ

లక్షణాలు :

1. పొడ తెగులు సాధారణంగా పైరు తర్వాతి దశలలో కనిపిస్తుంది.

2. దుబ్బు చేసే దశలో లేదా కణుపులు సాగే తొలి దశలలో (దాదాపు నీరు కట్టిన 10-15 రోజుల తరువాత) నీటి మట్టానికి దగ్గరగా, అడుగున ఉన్న ఆకులు, మట్టలపై మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు తొలి దశలో కనిపించే లక్షణాలు ప్రాంతం బట్టి మారుతూ ఉంటాయి.

3. ఈ మచ్చలు సాధారణంగా ఆకు మొదళ్ళలో ఆకుపచ్చ కలిసిన ఊదా రంగులో, 1/4 అంగుళం వెడల్పున, 1/2 నుండి 1 1/4 అంగుళాల పొడవున కోలగా, నీటి డాగు మచ్చలలాగ మొదలౌతాయి.

4. వెన్ను పైకి వచ్చు దశ నుండి, పాలుపోసుకునే దశ మధ్యలో, తరచూ వర్షాలు పడుతున్నప్పుడు, ఆకాశం మేఘావృతమైనప్పుడు ఈ తెగులు వేగంగా వ్యాపిస్తుంది.

5. ఆకులు పండిపోయాక ఈ మచ్చలు ఎండి ముదురు గోధుమ రంగు అంచులు కల బూడిద రంగు మచ్చలుగా మారతాయి.

6. మొదట తెల

క్రిమిసంహారక మందులను వాడి పురుగులను అరికట్టుట:

 • సిఫారసు చేసిన మందులను ఆయా మోతాదులలో తగిన పద్దతులలో వాడాలి.
 • మనము ఎన్నుకొనే మందులు చీడ పురుగులను బాగా సంహరించి మేలుచేసే సహజ శత్రువులకు తక్కువ హానిచేసేవిగా ఉంటె మంచిది.
 • సింథటిక్ పైరిథ్రాయడ్స్ లాంటి మందులను, సిఫారసు చేయని రెండు మూడు రకాల పురుగు మందులను కలిపి వాడుటవలన మేలుచేసే బడనికలకు, భక్షకులకు నష్టం కలిగి హానిచేసే పచ్చదీపపు పురుగులు గోధుమరంగు దోమలు ఉధృతి పెరుగుతుంది.

చీడ పీడలను తట్టుకొనే వంగడాల సాగు: 

 • చీడ పీడలను తట్టుకొనే వంగడాల సాగు ద్వారా కూడా పురుగు ఉధృతిని నివారించవచ్చు.
 • వరిలో పురుగులను తట్టుకొనే రకాలు విడుదలయాయి. ఉదాహరణకు ఉల్లికోడును తట్టుకొనే రకాలయిన ఫల్గుణ, సురేఖ, పోతన, కావ్య, దివ్య, ఎర్రమల్లెలు, రుద్రమ, అభయ, సురక్ష, వసుంధర, శ్రీకాకుళం సన్నాలు.
 • దోమను తట్టుకొనే రకాలైన వజ్రం, ప్రతిభ, చైతన్య, కృష్ణవేణి, నంది, దీప్తి, కాటన్ దొర సన్నాలు, విజేత, పచ్చదోమను తట్టుకొనే రకాలైన వాణి, విక్రమార్య, అగ్గితెగులును తట్టుకునే స్వర్ణముఖి, స్వాతి, మెదవిరుపును తట్టుకునే సింహపురి, శ్రీ రంగ విడుదలైనవి.
 • ఆయా ప్రాంతాలలో తరుచుగా ఎక్కువ నష్టం కలుగజేసే పురుగు/తెగులును తట్టుకొనే రకాలను పండించుట ద్వార వాటివల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
07
Jul

జీవ నియంత్రణ పద్ధతులు

జీవ నియంత్రణ పద్ధతులు

 • వరి పైరుకు హాని కలిగించే కీటకాలకు ప్రకృతిలో కొన్ని సహజ శత్రువులున్నాయి. వీటిని గుర్తించి వాటి సంరక్షణకు ప్రోత్సాహక చర్యలు పాటించాలి.
 • పరాన్నభుక్కులైన సాలె పురుగులు, అక్షింతల పురుగులు, మిడతలు, తూనీగలు, మిరిడ్ బగ్స్, పరాన్నజీవులైన ట్రైకొగ్రామా, టెలీనొమస్, టెట్రాస్టికస్ మొదలైన వాటిని పంట పొలములో పెంపొందించుటకు అనువైన వాతావరణాన్ని కల్పించవలెను. అలానే ప్రయోగశాలలో వీటిని వృద్ధిచేసి, పొలాల్లో విడుదల చేయటం వలన హానిచేసే పురుగుల ఉధృతిని తగ్గించుకోనువచ్చును.
 • ట్రైకొగ్రామా పరాన్నజీవిని ప్రయోగశాలలో వృద్ధిచేసి నాటిన 35రోజుల నుంచి 15రోజుల వ్యవధిలో 3సార్లు ఒక హెక్టారుకు విస్తీర్ణానికి 50,000 చొ.న వదలి కాండం తోలిచేపురుగు, ఆకుముడత పురుగులను నియంత్రించవచ్చు.
07
Jul

యాంత్రిక పద్ధతులు

యాంత్రిక పద్ధతులు 

 • కీటకాల ఉనికి పైరు మీద కనిపించిన వెంటనే వాటిని ఏరి తొలగించే పద్దతులను యాంత్రిక పద్ధతులంటారు.
 • నాటునప్పుడు నారు చివరలను (కొనలను) తుంచి నాటడం ద్వార కాండం తొలుచు పురుగు మరియు తాటాకు తెగులు (హిస్పా) ఉధృతిని తగ్గించుకోవచ్చు.
 • వరి పిలకలు ఆకుముడత మరియు గొట్టాల పురుగు పైరునాశిస్తే మొక్కల మీద తాడు అణిచి లాగితే ఆ పురుగులు నీటిలోపడి చేపట్టిన నివారణ చర్యలు సమర్థవంతంగా ఉంటాయి.
07
Jul

యాజమాన్య పద్ధతులు

యాజమాన్య పద్ధతులు

 • ఆయా ప్రాతాలలో తరచుగా నష్టాన్ని కలుగ జేసే ముఖ్యమైన పురుగు / తెగులును తట్టుకొనే వంగడాలని సాగుచేయాలి.
 • విత్తనశుద్ధి చేయాలి.
 • నాట్లును సకాలములో (నిర్ణీత సమయములో) వేసుకోవాలి. నాట్లు సకాలములో వేసుకోనుట వలన కొన్ని చీడ పీడలను బారినుండి పంటను రక్షించుకొనవచును.
 • ఆరోగ్యవంతమైన నారును పెంచుట.
 • పోలంలోను, పొలం గట్లమీద కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలి.
 • పురుగుల ఉధృతిని బట్టి అవసరమైనచో నారుమడిలో తగిన సస్యరక్షణ చేపట్టాలి.
 • నాతెతప్పుడు మొక్కకు మొక్కకు మధ్య దూరము సిఫారసు మేరకు ఉండేటట్లు చూడాలి.
 • ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. బాటలు ఏర్పాటుచేయాలి.
 • పోషక పదార్థములను సమతుల్యముగా వేయుట.
 • నత్రజని, భాస్వరము, పొటాష్ సిఫారసు మేరకు సమతుల్యంగా వేసుకోవాలి.
 • నత్రజని ఎరువులు ఎక్కువ వేస్తే చీడ పీడల ఉధృతి పెరుగుతాక్ ద

సమగ్ర సస్యరక్షణలో చీడపీడలను నియంత్రించే పద్ధతులు

కీటకాల ఉదృతి తగ్గించే విధంగా వరి సాగు పద్దతులను మలచుకోవాలి. అందుకోసం దిగువ సూచనలు అనుసరించాలి.

 • యాజమాన్య పద్ధతులు
 • యాంత్రిక పద్ధతులు
 • పురుగుల ఉనికిపై నిఘా
 • జీవ నియంత్రణ పద్ధతులు
07
Jul

వరిలో సమగ్ర సస్యరక్షణ

సమగ్ర సస్యరక్షణ ముఖ్య ఉద్దేశ్యం

 • మనకు అందుబాటు లో నున్న సస్యరక్షణ వనరులను సరైన పద్దతిలో మేల్లవించి పురుగులు ఆర్ధిక నష్ట పరిమితులను దాటకుండా అవసరాన్ని బట్టి ఉపయోగించడమే సమగ్ర సస్యరక్షణ.
 • ఇది పంటల నష్టాలను తగ్గించడమే కాకా పర్యావరణ దుష్పరిణామాలను కూడా తగ్గించును.
 • ఈ సమగ్ర సస్య రక్షణలో చీడపీడలను తట్టుకొనే వంగడాల సాగు, మేలైన సేధ్యపద్ధతులు, యాంత్రిక పద్ధతులు, పురుగుల ఉనికిపై నిఘా, జీవ నియంత్రణ పద్దతులను ఆచరిస్తూ పురుగుల యొక్క ఉదృతి ఆర్ధిక నష్ట పరిమితులను మించి వున్నప్పుడు మాత్రమే ఆఖరి అస్త్రంగా క్రిమి సంహారక మందుల వాడకం ప్రధాన అంశాలు.
Copy rights | Disclaimer | RKMP Policies