జగిత్యాల అగ్రికల్చర్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బోర్లు, బావులు, ఇతర నీటి వనరుల కింద రైతులు వరి నారుమడులు పోసుకున్నారు. నారుమడి దశలోనే తగిన యాజ మాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మొ క్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ప్రధాన పొలంలో పైరు ఎటువంటి చీడపీడలకు లోనవకుండా ఎదిగి, నాణ్యమైన దిగుబడులు అంది స్తుంది. ఈ నేపథ్యంలో వరి నారుమడిలో చేపట్టాల్సిన చర్యలపై కరీంనగర్ జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్ (వరి) అందిస్తున్న సూచనలు...
నారు పోసిన 10-15 రోజుల తర్వాత 5 సెంట్ల నారుమడిలో (ఇది ఎకరం విస్తీర్ణంలో నాటేందుకు సరిపోతుంది) 2.2 కిలోల యూరి యాను పైపాటుగా చల్లుకోవాలి. మొక్కలకు రెండు మూడు ఆకులు వచ్చే వరకూ ఆరుతడులు ఇవ్వాలి. ఆ తర్వాత మడిలో పలచగా నీర