Best Viewed in Mozilla Firefox, Google Chrome

ఆంధ్ర ప్రదేశ్ లోని సాంప్రదాయ విజ్ఞానం (ఐ.టి.కె.)

  • జిల్లేడు, జనుము, సీమ కానుగ, వేప, కానుగ వంటి ఆకులు, రెమ్మలు సేకరించి వరి నాట్లకు ముందు భూమిలో కలియదున్నడం. దీనివల్ల భూసారం పెరిగి భూమిలో ఉండే సూక్ష్మజీవుల వలన కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి.
  • దోమ పోటును తగ్గించడానికి వేప ఉత్పత్తుల వాడకం.
  • నీరు ఒకచోట నిలిచి ఉండేలాగా చెయ్యడానికి వాలుకు అడ్డంగా ఒక ఒడ్డును కట్టడం
  • భూమిలోని పోషకాలను పెంచడానికి మేకల మందలను, గొర్రెల మందలను పొలంలోనే కట్టి ఉంచడం.
  • భూమిలోని పోషకాల స్థాయిని పెంచడానికి దిబ్బెరువును తోలించడం.
  • బుషేనింగ్ పద్ధతి పచ్చి రొట్ట ఎరువుగా పనిచేస్తుంది. వరి నాటిన 30 -40 రోజులకు పొలంలో నీరు 10 -15 సెం.మీ. లోతున నిలిచి ఉన్నప్పుడు అడ్డంగా, నిలువుగా దున్నడం, తరువాత లాడరింగ్ చేయడం, నారును తిరిగి నాటడం జరుగుతుంది. ఒక్కోసారి కలుపు కూడా తీస్తారు.
Copy rights | Disclaimer | RKMP Policies