Best Viewed in Mozilla Firefox, Google Chrome

09
Aug

ఎత్తైన గిరిజన ప్రాంత మండలం

ఎత్తైన గిరిజన ప్రాంత మండలం

1. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి మరియు ఖమ్మం జిల్లాల వెంబడే ఉన్న ప్రాంతాలు ఈ మండలం కిందకు వస్తాయి. ఈ మండలానికి ప్రాంతీయ కేంద్రం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.

2. ఈ మండలంలో వర్షపాతం అధికం, 1400 మి. మీ. కన్నా ఎక్కువ.

09
Aug

తక్కువ వర్షపాత మండలం

తక్కువ వర్షపాత మండలం

1. కర్నూలు, అనంతపూర్, ప్రకాశం జిల్లాలు, కడప, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్ని భాగాలు ఈ మండలం కిందకు వస్తాయి. ఈ మండలానికి ప్రాంతీయ కేంద్రం తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.

2. ఈ మండలంలో 500-700 మి.మీ. వర్షపాతం నమోదౌతుంది. రాష్ట్రంలో వరి పండే ప్రాంతంలో 3.8% ఈ మండలంలో ఉంది.

09
Aug

దక్షిణ మండలం

దక్షిణ మండలం

1. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు ఈ మండలం కిందకు వస్తాయి. ఈ మండలానికి ప్రాంతీయ కేంద్రం తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.

2. ఈ మండలంలో 700-1000 మి.మీ. వర్షపాతం నమోదౌతుంది. రాష్ట్రంలో వరి పండే ప్రాంతంలో 12.6% ఈ మండలంలో ఉంది.

09
Aug

దక్షిణ తెలంగాణా మండలం

దక్షిణ తెలంగాణా మండలం

1. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ , నల్గొండ జిల్లాలు ఈ మండలం కిందకు వస్తాయి. ఈ మండలానికి ప్రాంతీయ కేంద్రం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.

2. ఈ మండలంలో 700-900 మి.మీ. వర్షపాతం నమోదౌతుంది. రాష్ట్రంలో వరి పండే ప్రాంతంలో 9.3% ఈ మండలంలో ఉంది.

09
Aug

మధ్య తెలంగాణా మండలం

మధ్య తెలంగాణా మండలం

  • వరంగల్, మెదక్ మరియు ఖమ్మం ఈ మండలం కిందకు వస్తాయి. ఈ మండలానికి ప్రాంతీయ కేంద్రం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.
09
Aug

ఉత్తర తెలంగాణా మండలం

ఉత్తర తెలంగాణా మండలం

1. ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు కరీంనగర్ ఈ మండలం కిందకు వస్తాయి. ఈ మండలానికి ప్రాంతీయ కేంద్రం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.

2. ఈ మండలంలో వర్షపాతం 900 నుండి 1150 మి.మీ. వరకూ ఉంటుంది. రాష్ట్రంలో వరి పండే ప్రాంతంలో 16% ఈ మండలంలో ఉంది.

09
Aug

కృష్ణా మండలం

కృష్ణా మండలం

1. కృష్ణ, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాలు, ప్రకాశం జిల్లాలో కొన్ని భాగాలు ఈ మండలం కిందకు వస్తాయి. ఈ మండలానికి ప్రాంతీయ కేంద్రం లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.

2. ప్రధానమైన నేలలు - డెల్టా భూములు, అడుగున ఒండ్రు గల ఎర్ర నేలలు, నల్ల రేగడి భూములు, ఎర్ర గలస కలిసిన తీరప్రాంతపు తేలికపాటి నేలలు మరియు చౌడు భూములు.

09
Aug

గోదావరి మండలం

గోదావరి మండలం

1. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ మండలం కిందకు వస్తాయి. ఈ మండలానికి ప్రాంతీయ కేంద్రం మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.

2. ఈ మండలంలో 800-1100 మి.మీ. వర్షపాతం నమోదౌతుంది. రాష్ట్రంలో వరి పండే ప్రాంతంలో 46.5% ఈ మండలంలో ఉంది.

09
Aug

ఉత్తర కోస్తా మండలం

ఉత్తర కోస్తా మండలం

1. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో చాలా భాగం ఈ మండలం కిందకు వస్తుంది. ఈ మండలానికి ప్రాంతీయ కేంద్రం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం.

2. ఈ మండలంలో 1000-1100 మి.మీ. వర్షపాతం నమోదౌతుంది. రాష్ట్రంలో వరి పండే ప్రాంతంలో 12.6% ఈ మండలంలో ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ వాతావరణ మండలాలు

వర్షపాతాన్ని బట్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని 9 వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించడమైనది.

1. ఉత్తర కోస్తా మండలం

2. గోదావరి మండలం

3. కృష్ణా మండలం

4. ఉత్తర తెలంగాణా మండలం

5. మధ్య తెలంగాణా మండలం

6. దక్షిణ తెలంగాణా మండలం

7. దక్షిణ మండలం

8. తక్కువ వర్షపాత మండలం

9. ఎత్తైన గిరిజన ప్రాంత మండలం

Copy rights | Disclaimer | RKMP Policies