Best Viewed in Mozilla Firefox, Google Chrome

09
Aug

కాండం తొలుచు పురుగు

కాండం తొలుచు పురుగు

స్థానిక నామం : కాండం తొలుచు పురుగు

శాస్త్రీయ నామం : సిర్పోఫాగాస్ ఇన్సె ర్ట్యులస్

లక్షణాలు :

1. కాండం తొలుచు పురుగులు వరి దుబ్బును తొలిచి తిని, పెరిగి, పంట దశ బట్టి `డెడ్ హార్ట్', `తెల్ల కంకి' వంటి లక్షణాలు కలుగచేస్తాయి

2. పిలకలు వేసే సమయంలో మొవ్వు భాగాన్ని ఈ పురుగు అడుగునుండి తినివేస్తుంది.

3. అడుగున ఉన్న ఆకులు ఆకుపచ్చగా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ సుడి ఆకు విచ్చుకోకుండా, మట్టి రంగులోకి మారి ఎండిపోతుంది.

4. కంకులు బయటకు వచ్చే సమయంలో మొవ్వు తెగిపోవడం వలన కంకులు ఎండి పోతాయి. అసలు కంకులు బయటకు రాకపోవచ్చు. బయటకు వచ్చిన కంకులలో గింజలు ఏర్పడవు.

5. ఈ గింజలు ఏర్పడని కంకులు నిటారుగా, తెల్లగా ఉండి పొలంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో వరిని ఆశించే ప్రధానమైన పురుగులు

1. కాండం తొలుచు పురుగు

2. గొట్టాల పురుగు

3. ఆకుముడత పురుగు

4. తాటాకు తెగులు (హిస్పా)

5. ఆకు నల్లి

6. బి.పి.హెచ్./ డబ్ల్యూ.బి.పి.హెచ్.

7. కంకి నల్లి

09
Aug

కంకర తెగులు

కంకర తెగులు

ఆంగ్ల నామం : రెడ్ స్ట్రయిప్

తెగులును కలుగచేసే జీవి : మైక్రోబాక్టీరియం స్పీసీస్  

కంకర తెగులు లక్షణా

1.కంకర తెగులు లక్షణాలు పోటాకుపై, ఆకుల పై భాగాలపై కనిపిస్తాయి.

2. నారింజ నుండి ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. మచ్చల చుట్టూ తెల్లగా ఉండి, ఆ తెలుపు రంగు పొడవుగా ఆకుల అగ్ర భాగానికి వ్యాపిస్తుంది.

3. తెగులు ఆశించిన తొలిదశలో సూదిమొన పరిమాణంలో, పారదర్శకం నుండి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే మచ్చలు చెదురు ముదురుగా ఆకు అంతటా కనిపిస్తాయి.

4. ఆకును వెలుగు వైపు ఎత్తి పట్టుకుని చూచినట్లయితే ఈ మచ్చలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఉదయం పూట మరియు తేమగా ఉన్నప్పుడు ఈ మచ్చల అంచులు నీటి డాగుల్లాగ కనిపిస్తాయి.

5. ఈ మచ్చలు పెద్దవై పసుపు రంగులోకి మారి క్రమేసి పసుపూ, నారింజ చారలుగా ఏర్పడతాయి. చాలాసార్లు ఈ చారల చుట్టూ ఆకు ఈనె పొడవునా తెల్లటి మచ

09
Aug

కాండం కుళ్ళు తెగులు నివారణ

కాండం కుళ్ళు తెగులు నివారణ

  • వేసవి దుక్కులు
  • విత్తన శుద్ధి
  • మొక్కకీ మొక్కకీ మధ్య తగినంత దూరం ఉంచడం
  • పైరులో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి
  • కాండం తొలుచు పురుగును, సుడిదోమను సకాలంలో నివారించుకోవాలి
  • వాలిడామైసిన్ 2 మి.లీ. లేక ప్రోపికొనజోల్ 1 మి.లీ. లేక బినామిల్ 1 గ్రా. లేక కార్బెండాజిం 1 గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి
  • పైరులో ఆకులు మొత్తం తడిచేలా పిచికారీ చేసుకోవాలి
09
Aug

కాండం కుళ్ళు తెగులు

కాండం కుళ్ళు తెగులు

ఆంగ్ల నామం : స్టెం రాట్

తెగులును కలుగచేసే జీవి : స్క్లిరోషియం ఒరైజే

కాండం కుళ్ళు తెగులు లక్షణాలు:

1. ఈ తెగులు మొదట నీటి మట్టానికి దగ్గరగా, వరి మట్టలపై చిన్న నల్లటి మచ్చలుగా కనిపిస్తుంది.

2. ఈ శిలీంద్రం లోపలి మట్ట వరకూ చొచ్చుకునిపోయి కాండం మొదలుదగ్గర కుళ్ళిపోయేలా చేస్తుంది.

3. తెగులు ఆశించిన మొక్క మట్టలపైన, కాండం పైన, కణుపుల లోపల అనేక నల్లటి, గుండ్రటి మెరిసే శిలీంద్ర బీజాలు ఏర్పడతాయి.

4. ఈ తెగులు ఆశించిన ప్రాంతంలో పంట పక్వానికి వచ్చేసరికి ఆకులు పసుపు పచ్చగా మారిపోయి చచ్చిపోతాయి.

09
Aug

ఆకు ఎండు తెగులు

ఆకు ఎండు తెగులు

ఆంగ్ల నామం : బాక్టీరియల్ లీఫ్ బ్లైట్

తెగులును కలుగచేసే జీవి : క్సాంథోమొనాస్ కాంపెస్ట్రిస్ పి.వి. ఒరైజేv

ఆకు ఎండు తెగులు లక్షణాలు

1. ఆకు ఎండు తెగులు ఒక నాళ సంబంధమైన తెగులు. ఇది మూడు వేరు వేరు దశలలో వేరువేరు లక్షణాలను కలుగచేస్తుంది - లీఫ్ బ్లైట్ ( ఆకు ఎండు) దశ, క్రేసెక్ దశ మరియు పాలిపోయిన పసుపు ఆకు దశ.

2. ఈ తెగులు ఆకుల చివర్ల నుండి, అంచుల నుండి పసుపు రంగు నీటి డాగు మచ్చలుగా మొదలౌతుంది. ఈ మచ్చలు కొద్దిగా అలల వలె ఉండి ఆకుల ఈనెలకు సమాంతరంగా సాగుతాయి. తర్వాత ఈ మచ్చలు గడ్డి రంగులోకి మారిపోతాయి. ఇన్ ఫెక్షన్ మొక్కలోపలికి ప్రవేశించినప్పుడు నారు వాడిపోయి చచ్చిపోతుంది.

3. గింజలు గట్టిపడక తాలుగా మారతాయి. ఈ బాక్టీరియా సూక్ష్మజీవి వాన జల్లుల ద్వారా, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సాగునీటి ద్వారా కూడా ఇది ఇతర చేలకు వ్యాప్తి చెందు

09
Aug

అగ్గి తెగులు నివారణ

అగ్గి తెగులు నివారణ

  • తెగులును తట్టుకునే రకాలను సాగుచేసుకోవడం
  • విత్తన శుద్ధి
  • చేనులోని గట్లపై కలుపు నిర్మూలన
  • నత్రజనిని మోతాదుకు మించి వాడకపోవడం
  • ట్రైసైక్లాజోల్ 75 శాతం 0.6 గ్రా చొప్పున లేదా ఐసోప్రోథయోలేన్ 40 ఇ. సి. 1.5 మి.లీ. చొప్పున లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యడం
09
Aug

అగ్గి తెగులు

అగ్గి తెగులు రెండు రకాలుగా ఉంటుంది.

1. ఆకుమీద మచ్చలుగా వచ్చే అగ్గి తెగులు

2. మెడ విరుపు తెగులు

ఆంగ్ల నామం : రైస్ బ్లాస్ట్

ఆకుమీద మచ్చలుగా వచ్చే అగ్గి తెగులు లక్షణాలు

1. ఈ తెగులు మొదట ఆకుల మీద తెలుపు, బూడిద లేక నీలం రంగు గల చిన్న చిన్న (1-3 మి.మీ. వ్యాసం) మచ్చలుగా కనిపిస్తుంది.

2. తేమ ఎక్కువగా ఉన్న సమయాలలో తెగులును తట్టుకోని రకాలపై ఈ మచ్చలు వేగంగా పెరిగి, కొనలు తేలి `నూలు కండె' (లేదా కన్ను) ఆకారంలోకి మారతాయి.

3. ఈ మచ్చలు మధ్యలో బూడిద లేక తెలుపు రంగును కలిగి ఉండి, అంచులు గోధుమ లేక ఎరుపు కలిసిన గోధుమ రంగులో ఉంటాయి.

4. తెగులును తట్టుకోని రకాలపై పూర్తిగా అభివృద్ధి చెందిన మచ్చలు 1 నుండి 1.5 సెం. మీ. పొడవుండి, 0.3 నుండి 0.5 సెం.మీ. వెడల్పు ఉంటాయి.

మెడ విరుపు తెగులు లక్షణాలు

1. వెన్నుల కణుపుల వద్ద పైరిక్యులేరియా ఒరైజా అన్న శిలీంద్రం ఆశించినప్పుడు ఈ మెడ

Copy rights | Disclaimer | RKMP Policies