Best Viewed in Mozilla Firefox, Google Chrome

ఎ.ఎల్.పి. టాబ్లెట్లు (అల్యూమినియం ఫాస్ఫైడ్ టాబ్లెట్లు)

  • అన్ని ఎలుక కన్నాలను కప్పి ఉంచి ఒక్కో కన్నంలో 0.6 గ్రా అల్యూమినియం ఫాస్పైడ్ టాబ్లెట్లు రెండేసి వేయాలి. ఈ పని అనుభవం ఉన్న వ్యక్తి చెయ్యాలి.
  • మెటల్ రాడ్ సహాయంతో ఈ టాబ్లెట్లను కన్నంలో లోతుగా పెట్టాలి. .
  • నిప్పు, మంట ఉన్న ప్రదేశాలలో మరియు వర్షాలు పడుతున్న సమయంలో ఈ టాబ్లెట్లు ఉపయోగించరాదు.
22
Aug

విషపు ఎరను ఉంచే విధానం

విషపు ఎరను ఉంచే విధానం

  • ఎరను ఎలక కన్నాలలో కానీ, ఎర స్థావరాలలో కానీ మాత్రమే ఉంచాలి.
  • ఎలక కన్నాలలో: 10 -15 గ్రా ఎరను కాగితంలో పొట్లం కట్టి ఎలక కన్నం లోపలగా ఉంచి అన్ని కన్నాలను మూసి వేయాలి.  
  • ఎర స్థావరాలలో: సాంప్రదాయ సిద్ధమైన కొబ్బరి చిప్పలు, కుండలు, వెదురు వంటి ఎర స్థావరాలలో 50 -60 గ్రా ఎరను ఉంచి ప్రతిరోజూ గమనిస్తూ ఉండాలి. ఎలకలు పూర్తిగా ఎరను తిన్న తరువాత, ఈ స్థావరాలను శుభ్రం చేసి మళ్ళీ ఎరతో నింపి పెట్టాలి.
  • పాడైపోయిన, మిగిలిపోయిన ఎరను ఎర స్థావరం నుండి తీసేసి మట్టిలో కప్పెట్టాలి.
  • ఎకరానికి 6-8 చొప్పున పి.వి.సి.పైపులు, సిమెంటు తో కట్టిన ఎర స్థావరాలలో ఎరను ఉంచడం వలన ఎరలు సమర్ధవంతంగా పనిచేస్తాయి.

విషపు ఎర తయారీకి కావలసిన పదార్ధాలు

ఒక కిలో విషపు ఎర తయారీకి కావలసిన పదార్ధాలు :

  • నూక -960 గ్రా
  • నూనె -20 మీ.లీ.
  • మందు -20 గ్రా

జింక్ ఫాస్పైడ్ మరియు బ్రోమోడయోలోన్

జింక్ ఫాస్పైడ్

  • జింక్ ఫాస్పైడ్ ఎర తిన్న ఎలకలు కడుపు మంటతో ఒకరోజులోనే మరణిస్తాయి. అందువలన మిగతా ఎలకలు, జాతిని బట్టి, ఎర మోతాదుని బట్టి ఒక 2 - 3 నెలలపాటు ఈ ఎరను తినడానికి భయపడతాయి. కాబట్టి ఈ విషపు ఎరను పంటకాలంలో ఒకేఒక్కసారి ఎలుకలు ఉధృతంగా ఉన్నప్పుడు ఉపయోగించాలి.
  • విషం కలుపని ఎరతో మూడు రోజులు ఎలుకలను మచ్చిక చేసుకోవాలి

బ్రోమోడయోలోన్

  • బ్రోమోడయోలోన్ ఎర తిన్న ఎలుక క్రమంగా 4 -6 రోజులలో రక్తం గడ్డ కట్టక చచ్చిపోతుంది
  • ఈ మరణం సహజంగా కనిపిస్తుంది కాబట్టి ఎలుకలు ఈ ఎర తినడానికి భయపడవు
  • విషంలేని ఎరతో ఎలకలను మచ్చిక చేసుకునే అవసరం ఉండదు.
  • పంట కాలంలో 3-4 సార్లు ఈ ఎరను ఉపయోగించవచ్చు

రసాయనిక పద్ధతిలో ఎలుకల నిర్మూలన

రసాయనిక పద్ధతులు

  • ఎలుకలను చంపడానికి రసాయనాలను విషపు ఎరలుగా ఉపయోగిస్తారు
  • ఎలుకలను చంపడానికి మూడు రసాయనాలు అందుబాటులో ఉన్నాయి:

                        1. జింక్ ఫాస్పైడ్

                        2. బ్రోమోడయోలోన్

                        3. ఎ.ఎల్.పి. టాబ్లెట్లు

Copy rights | Disclaimer | RKMP Policies