Best Viewed in Mozilla Firefox, Google Chrome

09
Aug

ఆకు ఎండు తెగులు

ఆకు ఎండు తెగులు

ఆంగ్ల నామం : బాక్టీరియల్ లీఫ్ బ్లైట్

తెగులును కలుగచేసే జీవి : క్సాంథోమొనాస్ కాంపెస్ట్రిస్ పి.వి. ఒరైజేv

ఆకు ఎండు తెగులు లక్షణాలు

1. ఆకు ఎండు తెగులు ఒక నాళ సంబంధమైన తెగులు. ఇది మూడు వేరు వేరు దశలలో వేరువేరు లక్షణాలను కలుగచేస్తుంది - లీఫ్ బ్లైట్ ( ఆకు ఎండు) దశ, క్రేసెక్ దశ మరియు పాలిపోయిన పసుపు ఆకు దశ.

2. ఈ తెగులు ఆకుల చివర్ల నుండి, అంచుల నుండి పసుపు రంగు నీటి డాగు మచ్చలుగా మొదలౌతుంది. ఈ మచ్చలు కొద్దిగా అలల వలె ఉండి ఆకుల ఈనెలకు సమాంతరంగా సాగుతాయి. తర్వాత ఈ మచ్చలు గడ్డి రంగులోకి మారిపోతాయి. ఇన్ ఫెక్షన్ మొక్కలోపలికి ప్రవేశించినప్పుడు నారు వాడిపోయి చచ్చిపోతుంది.

3. గింజలు గట్టిపడక తాలుగా మారతాయి. ఈ బాక్టీరియా సూక్ష్మజీవి వాన జల్లుల ద్వారా, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సాగునీటి ద్వారా కూడా ఇది ఇతర చేలకు వ్యాప్తి చెందు

Copy rights | Disclaimer | RKMP Policies