Best Viewed in Mozilla Firefox, Google Chrome

మంచి విత్తనానికి నిర్దేశించిన గుణాలు

PrintPrintSend to friendSend to friend

మంచి విత్తనానికి నిర్దేశించిన గుణాలు:

విత్తనం ఇతర విత్తనాలతో కల్తీ లేకుండా పరిశుభ్రంగా ఉంది గింజలన్నీ ఒకే పరిమాణం లో యుండి బాగా బగ్గ మొలకెత్తే స్వభావం కల్గియుండాలి. ధృవీకరించిన మంచి విత్తనానికి నిర్దేశించిన ప్రామాణికాలను వివరింపబడినవి. అవి

జన్యు సంబంధిత నాణ్యత లేదా స్వచ్ఛత : 98%

గరిష్ట జడపదార్థం : 2%

పొట్టులేని గింజలు (గరిష్ట) : 2%

ఇతర పైర్ల విత్తనం (గరిష్ట) : 20 గింజలు/కేజి విత్తనానికి

ఇతర రకాల పరిమితి (గరిష్ట) : 20 గింజలు/కేజి విత్తనానికి

మొత్తం కలుపు మొక్కల గింజల పరిమితి (గరిష్ట) : 5 గింజలు/కేజి విత్తనానికి

అభ్యంతరకర కలుపు మొక్కల గింజలు (గరిష్ట) : 5 గింజలు/కేజి విత్తనానికి

తెగులుసోకిన విత్తనాల గింజల పరిమితి (గరిష్ట) : 5 గింజలు/కేజి విత్తనానికి

గరిష్ట తేమ పరిమితి : 13% (తక్కువైతే మంచిది)

మొలకెత్తే శక్తి (కనీసం) : 80%

కల్తీలు లేకుండా నాణ్యత గల్గిన విత్తనాన్ని నిపుణుల ఆధ్వర్యంలో విత్తనోత్పట్టిచేసి ధృవీకరించిన విత్తనాన్ని రైతులకు ప్రఖ్యాత సంస్థలు మరియు ఇతర సంస్థలు కలిసి 20% విస్తీర్ణానికి సరిపడు విత్తనాన్ని మాత్రమే సరఫరా చేస్తునారు. మిగతా విత్తనాన్ని రైతులే తమకు కావలసిన విత్తనాన్ని వరి పొలాల నుండి అనుకూలతను బట్టి విత్తనాభివృధిని చేసుకోవాలి. వరి స్వపరాగ సంపర్కంతో వృధి చేందే పంట గనుక సులభంగా నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. విత్తనాభివృధికి రైతులు తగిన శ్రద్ద చూపకపోతే, కల్తీలు ఎక్కువై దిగుబడి తగ్గుతుంది. విత్తనం లో నిర్దిష్ట గుణాలు మారనంత వరకు, కల్తీ లేక శుభ్రతగా యున్నంతవరకూ దిగుబడి శక్తిలో మార్పురాదు. దిగుబడి శక్తి తగ్గదు. కాని వరి వంగడాలు కొంతకాలం సాగుచేసిన తర్వాత దిగుబడి శక్తి తగ్గినట్లు మన రైతులు చెపుతుంటారు. ముఖ్యంగా ఇతర రకములతో కల్తీ జరుగుట వలన, పైరు పై తెగుళ్ళు ప్రభావము వలననూ మరియు పరపరాగ సంపర్కము వలన విత్తనము యొక్క పరిశుభ్రత నాణ్యత దెబ్బతిని దిగుబడి శక్తిలో మార్పు వచ్చి, ఆశించిన మేరకు దిగుబడి రాదు. ఈ మార్పులకు వాతావరణ ప్రభావము, స్వల్ప జన్యు మార్పులు, ఉత్తరివర్తనములు కూడా దోహదము చేయును. పైరు కోసిన తరువాత నూర్పిడి జరిగేటప్పుడుగాని, నాట్లు వేయునప్పుడుగానీ, ఇతర రకాలతో కల్తీలు జరగవచ్చును.

File Courtesy: 
APRRI, Maruteru
Copy rights | Disclaimer | RKMP Policies