Best Viewed in Mozilla Firefox, Google Chrome

Karimnagar

29
Oct

వరికి మద్దతు ధర రూ.1310

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ :
 ఖరీఫ్ సీజన్‌లో వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1310, గ్రేడ్-ఏకు రూ.1345గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ సంస్థలతో 592 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ప్రాథమిక గిరిజన పరపతి సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చే స్తున్నారు. నిర్ధారించిన కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్ల అనంతరం ఆ ధాన్యాన్ని సంబంధిత రైస్‌మిల్లులకు కస్టమ్‌మిల్లింగ్ చే సి అప్పగించేందుకు జిల్లాలో మిల్లులను గుర్తించారు. జిల్లాలో 257 బాయిల్డ్ రైస్‌మిల్లులు, 51 రా రైస్‌మిల్లులను కస్టమ్ మిల్లింగ్ కోసం గుర్తించినట్లు ఇన్‌చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు.
 
  ప్రతి రైస్‌మిల్లరు తనకు జారీ చేయబడిన ఆకుపచ్చ రంగు కలిగిన రిలీజ్ ఆర్డర్, అందులో కేటాయించిన కొనుగోలు కేంద్రం నుంచి మాత్రమే సూచించిన పరిణామంలో వరిధాన్యం తీసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రైస్‌మిల్లుల వారీగా కేటాయించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు, అనుమతించిబడిన ధాన్యం పరిణామం తదతర వివరాలు కరీంనగర్ జిల్లా వెబ్‌సైట్ ఠీఠీఠీ.జ్చుటజీఝ్చజ్చట.జీఛి.జీలో చూసుకోవాలన్నారు. రెండు సంవత్సరాల్లోని సీజన్లలో వరి ధాన్యం తీసుకొని కస్టమ్ మిల్లింగ్ చేయని రైస్‌మిల్లర్లకు, ప్రజా పంపిణీ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారనే అభియోగాలపై కేసు నమోదయిన మిల్లర్లకు ఈ సీజన్‌కు కస్టమ్ మిల్లింగ్ ధాన్యం నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు.

Courtesy : http://www.sakshi.com/news/andhra-pradesh/government-offered-price-rs-13...

29
Jul

జోరుగా వరి సాగు...

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్ సిటీ):ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం పెరగనుంది. ఐదు సంవత్సరాల త ర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండడం తో రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో వరి సాగు వైపు రైతు లు దృష్టిని సారిస్తున్నారు. జిల్లాలో సా ధారణ వరి సాగు ఒక లక్షా 70 వేల హె క్టార్లు కాగా, ప్రాజెక్టు నిండిన కారణం గా 2 లక్షల 50 వేల హెక్టార్లకు పెరగ నుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఐదేళ్లుగా ఖరీఫ్ సీజన్‌లో లక్షా 83 వేల హెక్టార్ల వరి సాగయ్యేది. ఈసారి రికార్డు స్థాయిలో వరి సాగయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాల కు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు వ చ్చాయి. గురువారం రాత్రి వరకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో కొద్దిసేపు గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలి పెట్టారు. లోయర్ మానేరు డ్యామ్‌లోకి వరద కాలువ, కాకతీయ ప్రధాన కాలువ ద్వారా సుమారు 17,629 క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో మానేరు నీటి మట్టం దాదాపు 13.530 టీఎంసీలకు చేరుకుంది.

ప్రస్తు తం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 83.772 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 16,246 క్యూసెక్కులు వస్తున్నది. మానేరులోకి 17,629 క్యూసెక్కులు వస్తుండగా నల్లగొండ జిల్లాలోని కొన్ని చెరువులు, కుం టలను నింపేందుకు మానేరు నుంచి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలి పెట్టా రు. ఎగువ ఆయకట్టుకు ఆగస్టు 1 నుం చి, లోయక్ మానేరు డ్యామ్ నుంచి దిగువ ఆయకట్టుకు ఆగస్టు 15 నుంచి నీటిని వదిలి పెట్టాలని ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. ప్రస్తుతానికి వ్యవసాయ బావులు, చెరువులు, కుంటల కింద వరి నాట్లు వేసేందుకు నార్లు పోసుకున్నారు. కొందరు రైతులు దూరదృష్టితో కాలువ ద్వారా సాగయ్యే భూముల కోసం వరి నార్లు పోశారు. ఒక్కసారిగా ఎస్సారెస్పీ నిండడంతో అప్రమత్తమైన రైతులు వ్యవసాయ బావుల కింద వారం రోజుల నుంచి వరి నార్లు పోస్తున్నారు. ప్రతి ఏటా ముందస్తుగానే వరి నార్లు పోసుకుంటున్న రైతులు ప్రతి ఏటా నష్టపోవాల్సి వస్తుండడంతో గత ఏడాది నుంచి ఎక్కువ మొత్తంలో వరి నార్లు పోయడం లేదు.
ప్రాజెక్టులు నిండడం, మూడు రోజు ల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బావులు, చెరువులు, కుంటల కింద ము మ్మరంగా వరి నాట్లు వేస్తున్నారు. జిల్లాలోని అన్ని నీటి వనరులు జలకళతో ఉండడంతో సాగు పెరుగుతోంది. ఇప్పటికే 46,995 హెక్టార్లలో వరి, 53,151 హెక్టార్లలో మొక్కజొన్న, 4,417 హెక్టార్లలో పెసర, 3,419 హెక్టార్లలో కం దులు, 279 హెక్టార్లలో నువ్వులు, 465 హెక్టార్లలో అలసంద, 19,597 హెక్టార్ల లో సోయా చిక్కుడు, 2,38,427 హెక్టార్లలో పత్తి, 286 హెక్టార్లలో మిర్చి, 1364 హెక్టార్లలో చెరుకు, 10,054 హెక్టార్లలో పసుపు, 5,030 హెక్టార్లలో ఇతర పంటలు, మొత్తం 3,83,484 హెక్టార్లలో సాగు చేశారు.

ఈ సీజన్‌లో 6,34,335 హెక్టార్లలో అన్ని రకాల పం టలు సాగు కానున్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి 2 లక్షల 50 వేల హెక్టార్లకు పెరగవచ్చని అంచనా వేశారు. వారం, పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వరి సాగు లక్షా 50 వేల హెక్టార్లకు చేరనుంది. ఆగస్టు నెలాఖరు వరకు వరి నాట్లు వేసుకునే అవకాశాలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 2009 రబీలో రికార్డు స్థాయిలో వరి సాగు అయ్యింది. ప్రస్తుత సీజన్‌లో అంతకు మించి వరి సాగు కానున్నదని అంచనా.

Courtesy : http://www.andhrajyothy.com/ContentPage.jsp?category=headlines&story_id=...

5
Jul

Paddy Farming in Karimnagar picks up

Andhra Pradesh :  Thanks to the arrival of the early monsoons and bountiful rainfall during the month of June, agricultural operations have been intensified considerably for this kharif season.

Usually, kharif operations begin in the month of July in Karimnagar. However, agricultural operations were intensified in the month of June itself following the good rainfall. Against the normal rainfall of 153 mm in the month of June, the district received 208 mm rainfall boosting the morale of the farming community. In the month of July, the district receives normal rainfall of 283 mm. On Tuesday night alone, the district received heavy rainfall and recovered an average of 15 mm rainfall.

Buoyed over the rainfall, the agricultural department authorities said that the area of cultivation would increase considerably from 4.54 lakh hectares to 6.34 lakh hectares. The authorities said that paddy cultivation would be increased from 1.79 lakh hectares during the last kharif season to 1.97 lakh hectares in this season. Farmers have already planted paddy nurseries in 25,000 hectares in the district.

Courtesy : http://www.thehindu.com/news/national/andhra-pradesh/farming-in-karimnag...

Syndicate content
Copy rights | Disclaimer | RKMP Policies