Best Viewed in Mozilla Firefox, Google Chrome

Kharif POP

Kharif POP
21
Nov

ఉత్తర తెలంగాణా మండలంలో వరి పొలం తయారీ

• నాట్లు వేయడానికి పది రోజుల ముందే దమ్ము చేసి, ఆ తర్వాత మురగ దమ్ము చేసి, బాగా చదును చేయాలి.
• బరువు నేలలలోను, సారవంతమైన నేలలలోను చ. మీ. కు (20 X 15 సెం. మీ.) 33 మూనలు ఉండేలా చూడాలి.
• తేలిక నేలలలోను, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లోనూ నారును 15 X 15 సెం.మీ. దూరంలో (చ.మీ. కు 44 మూనలు ఉండేలా) నాటుకోవాలి.
• ఆలస్యంగా నాటిన సందర్భాల్లో చ.మీ. కు 44 మూనలు ఉండాలి.
• కలుపు ఉధృతిని తగ్గించడానికి, సమర్ధవంతమైన నీటి యాజమాన్యానికి ప్రధాన పొలాన్ని బాగా చదును చేయాలి.

21
Nov

ఉత్తర తెలంగాణా మండలంలో వరి నారుపోసే సమయం, విత్తనమోతాదు

వరి నారుపోసే సమయం : జులై 15 వరకు నారుపోసుకోవచ్చు

సిఫార్సు చేసిన విత్తనమోతాదు :

• నాటడానికి 20-25 కిలోలు,
• గరువు భూముల్లో వెదజల్లడానికి 25-30 కిలోలు ,
• డెల్టా భూముల్లో నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
• గొర్రుతో నేరుగా విత్తడానికి 30-35 కిలోలు ,
• శ్రీ పద్ధతికి 2 కిలోలు  

21
Nov

వివిధ పరిస్థితులలో ఉత్తర తెలంగాణా మండలానికి సిఫార్సు చేయబడిన వరి రకాలుపరిస్థితి 
Related Terms: FISKharif POPPackage of PracticesRecommended POP
21
Nov

ఉత్తర తెలంగాణా మండలంలో వరి పంటకు ఖరీఫ్ సీజన్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తర తెలంగాణా మండలంలోకి వచ్చే జిల్లాలు :
• ఆదిలాబాద్
• నిజామాబాద్ మరియు
• కరీంనగర్  

21
Nov

ఉత్తర కోస్తా మండలంలో పంటకోత, నిలువ

1. వెన్నులో కనీసం 75 % గింజలు పక్వానికి వచ్చినప్పుడు కోత కోయాలి. సరిగా పక్వానికి రాకముందు కోసినట్లయితే గింజలు జీవ శక్తిని కోల్పోతాయి.

2. కోసిన పంటను పొలంలోనే 2-3 రోజులు ఆరబెట్టాలి.

3. ధాన్యం నూర్చి, తూర్పారబట్టాక ధాన్యంలో ఇతర పదార్ధాలేమీ లేకుండా చూసుకోవాలి.

4. గింజలోని తేమ 13 శాతానికి తగ్గేవరకూ తూర్పారబట్టిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలి.

5. ధాన్యాన్ని తక్కువ ఆరబెట్టినా, ఎక్కువ ఆరబెట్టినా ప్రాసెస్సింగ్ సమయంలో గింజ విరిగిపోతుంది.

21
Nov

ఉత్తర కోస్తా మండలంలో ఎలుకల నివారణ

1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :

• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి.
• గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం.
• ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి.
• దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి.

21
Nov

ఉత్తర కోస్తా మండలంలో పూత తర్వాత దశలో రసాయనాలతో చీడపురుగుల నివారణ

సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్.) :

• ఈనిక దశలో సిఫార్సు చేసిన మందులను వాడాలి.

కట్వర్మ్స్ (మొక్కలను కోరికివేసే గొంగళి పురుగులు) :

• పొలానికి నీరుపెట్టి సాయంకాలం వేళల్లో ఈ మందులు లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి - డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + ఎండోసల్ఫాన్ 2.0 మీ.లీ. (లేదా) డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ.  

21
Nov

ఉత్తర కోస్తా మండలంలో అంకురందశనుండి ఈనిక దశవరకు రసాయనాలతో చీడపురుగుల నివారణ

అంకురందశనుండి ఈనిక దశవరకు:

సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్). :

• ఎసిప్జేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మీ.లీ. లేదా ఎతోఫెన్ ప్రాక్స్ 2.0 మీ.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి .లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
• మొక్కల అడుగు భాగం బాగా తడిచేలా మందును (ఎకరానికి 200 లీ. ద్రవం) పిచికారీ చెయ్యాలి. • పురుగు మందులను, సింథటిక్ పైరెత్రాయిడ్స్ ను కలిపి పిచికారీ చేయకూడదు.

21
Nov

ఉత్తర కోస్తా మండలంలో వరి దుబ్బుచేసే సమయంలో రసాయనాలతో చీడపురుగుల నివారణ

కాండం తొలుచు పురుగు, తామర పురుగులు మరియు హిస్పా:

• మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 20 ఇ.సి. 2.5 మీ.లీ. లేదా ఫాస్ఫామిడాన్ 40 ఎస్.ఎల్. 2.0 మీ.లీ. లీటరు నీటితో కలిపి పిచికారీ చెయ్యాలి.

ఉల్లికోడు పురుగు:

• ఫోరేట్ 10 జి హెక్టారుకు 12.5 కిలోల చొప్పున లేదా కార్బోఫ్యురాన్ 3 జి హెక్టారుకు 25 కిలోల చొప్పున నాటిన 15 రోజులకు 1-2 అంగుళాల లోతు నీటిని నిలువగట్టి వేయాలి.

ఆకు ముడత పురుగు:

21
Nov

ఉత్తర కోస్తా మండలంలో సస్యరక్షణ

1. సస్య రక్షణ చర్యలు రెండు రకాలు:

• యాజమాన్య పద్ధతులు
• రసాయనిక మందులతో నియంత్రణ

2. రసాయనిక పద్ధతిలో నివారణ, పంట యొక్క వివిధ దశలలో, అంటే దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశ నుండి ఈనిక దశవరకు, మరియు పూత దశ తర్వాత చేపట్టవచ్చు.  

21
Nov

ఉత్తర కోస్తా మండలంలో నీటి పారుదల యాజమాన్యం

• దుబ్బుచేసే దశలో, అంకురం దశలో, పూత దశలో, గింజ పాలుపోసుకునే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. • కలుపు నాశక మందులు వేసినప్పుడు పొలంలో 2-3 సెం.మీ. లోతు నీరుండేలా చూసుకోవాలి. ఒక వారం రోజుల వరకు ఈ నీరు అలాగే ఉంచాలి.
• నాటిన (ఊడ్చిన) తరువాత ఒక వారం రోజులపాటు 5 సెం. మీ. వరకు నీరు నిలగట్టాలి. ఆ తరువాత దుబ్బు చేయడం పూర్తయ్యేవరకు 2-3 సెం. మీ. లోతు నీరు ఉండాలి.
• అంకురం దశ నుండి గింజ గట్టిపడే దశవరకూ 5 సెం. మీ. లోతు వరకు నీరుండాలి. • ఎరువులు వేసే ముందు నీరు వదిలెయ్యాలి .
• కోతకు వారం రోజుల ముందుగా నీటిని వదిలెయ్యాలి.

21
Nov

ఉత్తర కోస్తా మండలంలో జింకులోప సవరణ

• జింకు లోపం అధికంగా ఉండే చవిటి నేలలు, లోతట్టు పొలాలు, ఇటీవల చదును చేసిన పొలాలు, సి: ఎన్ నిష్పత్తి ఎక్కువగా ఉన్న వరిగడ్డి వంటి సేంద్రీయ పదార్ధాలు అధిక మొత్తంలో వేసిన పొలాలలో ముందుజాగ్రత్త చర్యగా మూడు పంట సీజన్లకొకసారి హెక్టారుకు 50 కిలోల జింక్ సల్ఫేట్ ను దమ్ములో వేయాలి.

• మిగతా పొలాల్లో జింకు లోపం గమనించినప్పుడు 0.2 % జింకు సల్ఫేటు ద్రావణం 5 రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేయాలి.  

21
Nov

ఉత్తర కోస్తా మండలానికి సిఫార్సు చేసిన ఎరువులు

ఎ) నారుమడికి సిఫార్సు చేసిన ఎరువులు:

• ఆరోగ్యకరమైన నారు కొరకు ప్రతి 100 చ. మీ. నారుమడికి దుక్కిలో 0.5 కిలోల నత్రజని, 0.5 కిలోల భాస్వరం మరియు 0.5 కిలోల పోటాష్ ఎరువు వేయాలి. విత్తిన 12 రోజులకు మళ్ళీ ఒక 0.5 కిలోల నత్రజని వేయాలి.

• జింకు లోపాన్ని గమనిస్తే, ఆ లోపాన్ని సరిదిద్దేందుకు లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి.

• నారుమడిలో ఇనుము లోపాన్ని సరిదిద్దేందుకు 5 -10 గ్రా. అన్నబేధి లేదా ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ ను 0.5 నుండి 1.0 గ్రా. నిమ్మఉప్పుతో లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

21
Nov

ఉత్తర కోస్తా మండలంలో కలుపు నియంత్రణ

• నారు నాటిన మొదటి నాలుగు వారాలూ కలుపును నియంత్రించుకోవాలి (నాటిన 20 రోజులకొకసారి, 40 రోజులకొకసారి చేతితో కలుపు తీయడం ద్వారా).
• గడ్డిజాతి, తుంగజాతి కలుపు మొక్కలు ప్రబలినప్పుడు వాటిని నియంత్రించడానికి బ్యుటక్లోర్ ఎకరానికి 1.25 లీ. చొప్పున (లేదా) ప్రెతిలాక్లోర్ 600 మీ.లీ. (లేదా) అనిలోఫాస్ 500 మీ.లీ., 25 కిలోల ఇసుకతో కలిపి సన్నని నీటి పొరలో నాటిన 3-5 రోజులకు వేయాలి.
• పొలంలో ఊదగడ్డి సమస్య ఉన్నప్పుడు ఎకరానికి 1.25 లీ. బెన్థయోకార్బ్ మేయాలి.

21
Nov

ఉత్తర కోస్తా మండలంలో వరి పొలం తయారీ

• నాట్లు వేయడానికి పది రోజుల ముందే దమ్ము చేసి, ఆ తర్వాత మురగ దమ్ము చేసి, బాగా చదును చేయాలి.
• బరువు నేలలలోను, సారవంతమైన నేలలలోను చ. మీ. కు (20 X 15 సెం. మీ.) 33 మూనలు ఉండేలా చూడాలి.
• తేలిక నేలలలోను, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లోనూ నారును 15 X 15 సెం.మీ. దూరంలో (చ.మీ. కు 44 మూనలు ఉండేలా) నాటుకోవాలి.
• ఆలస్యంగా నాటిన సందర్భాల్లో చ.మీ. కు 44 మూనలు ఉండాలి.
• కలుపు ఉధృతిని తగ్గించడానికి, సమర్ధవంతమైన నీటి యాజమాన్యానికి ప్రధాన పొలాన్ని బాగా చదును చేయాలి.

21
Nov

ఉత్తర కోస్తా మండలంలో వరి నారుపోసే సమయం, విత్తనమోతాదు

వరి నారుపోసే సమయం :

జులై 15 వరకు నారుపోసుకోవచ్చు సిఫార్సు చేసిన విత్తనమోతాదు :

• నాటడానికి 20-25 కిలోలు,
• గరువు భూముల్లో వెదజల్లడానికి 25-30 కిలోలు ,
• డెల్టా భూముల్లో నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
• గొర్రుతో నేరుగా విత్తడానికి 30-35 కిలోలు ,
• శ్రీ పద్ధతికి 2 కిలోలు  

21
Nov

ఉత్తర కోస్తా మండలంలో వరి పంటకు ఖరీఫ్ సీజన్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా మండలంలోకి వచ్చే జిల్లాలు
• శ్రీకాకుళం
• విజయనగరం మరియు
• విశాఖపట్నం  

21
Nov

కృష్ణా మండలంలో పంటకోత, నిలువ

1. వెన్నులో కనీసం 75 % గింజలు పక్వానికి వచ్చినప్పుడు కోత కోయాలి. సరిగా పక్వానికి రాకముందు కోసినట్లయితే గింజలు జీవ శక్తిని కోల్పోతాయి.

2. కోసిన పంటను పొలంలోనే 2-3 రోజులు ఆరబెట్టాలి.

3. ధాన్యం నూర్చి, తూర్పారబట్టాక ధాన్యంలో ఇతర పదార్ధాలేమీ లేకుండా చూసుకోవాలి.

4. గింజలోని తేమ 13 శాతానికి తగ్గేవరకూ తూర్పారబట్టిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలి.

5. ధాన్యాన్ని తక్కువ ఆరబెట్టినా, ఎక్కువ ఆరబెట్టినా ప్రాసెస్సింగ్ సమయంలో గింజ విరిగిపోతుంది.

Syndicate content
Copy rights | Disclaimer | RKMP Policies