Best Viewed in Mozilla Firefox, Google Chrome

Andhra Pradesh

13
Sep

నాట్లు వేయటం

File Courtesy: 
Dr.C.Cheralu, Principal Scientist,Regional Agricultural Research Station,Warangal, ANGRAU
13
Sep

వరి విత్తనాల్లో నిద్రావస్తను తొలగించుట

కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే వరి గింజల్లోని నిద్రావస్తను తొలగించి అధిక మొలకశాతం రాబట్టటానికి , లీటరు నీటికి తక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 6.3 మి.లీ లేదా విజేత లాంటి ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 10 మి.లీ గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మరో 24 గంటల పాటు మండేకట్టాలి

File Courtesy: 
Dr.C.Cheralu, Principal Scientist,Regional Agricultural Research Station,Warangal, ANGRAU
13
Sep

విత్తన శుద్ధి

కిలో విత్తానానికి మూడు గ్రాముల కార్బెండజిం ను కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి . దంపనారు మడులకైతే లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండజిం ను కలిపి,ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండేకట్టి మొలకలను దంప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టటానికి లీటరు మందు నీరు సరిపోతుంది.
                               

File Courtesy: 
Dr.C.Cheralu, Principal Scientist,Regional Agricultural Research Station,Warangal, ANGRAU
13
Sep

విత్తన శుద్ధి

కిలో విత్తానానికి మూడు గ్రాముల కార్బెండజిం ను కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి . దంపనారు మడులకైతే లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండజిం ను కలిపి,ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండేకట్టి మొలకలను దంప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టటానికి లీటరు మందు నీరు సరిపోతుంది.

File Courtesy: 
Dr.C.Cheralu, Principal Scientist,Regional Agricultural Research Station,Warangal, ANGRAU
21
Jan

హైబ్రిడ్ వరి వంగడములు- యాజమాన్యపద్దతులు- Hybrid Rice Cultivation

 

File Courtesy: 
Dr. A.S. Hari Prasad, Dr. P. Senguttuvel, Dr. P. Revathi, Dr. Kemparaju, Dr. G.S.V. Prasad & Dr. B.C. Viraktamath
27
Dec

నవనవలాడే నారుమడి కోసం.../ For a Healthy Nursery....

జగిత్యాల అగ్రికల్చర్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బోర్లు, బావులు, ఇతర నీటి వనరుల కింద రైతులు వరి నారుమడులు పోసుకున్నారు. నారుమడి దశలోనే తగిన యాజ మాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మొ క్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ప్రధాన పొలంలో పైరు ఎటువంటి చీడపీడలకు లోనవకుండా ఎదిగి, నాణ్యమైన దిగుబడులు అంది స్తుంది. ఈ నేపథ్యంలో వరి నారుమడిలో చేపట్టాల్సిన చర్యలపై కరీంనగర్ జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్ (వరి) అందిస్తున్న సూచనలు...

నారు పోసిన 10-15 రోజుల తర్వాత 5 సెంట్ల నారుమడిలో (ఇది ఎకరం విస్తీర్ణంలో నాటేందుకు సరిపోతుంది) 2.2 కిలోల యూరి యాను పైపాటుగా చల్లుకోవాలి. మొక్కలకు రెండు మూడు ఆకులు వచ్చే వరకూ ఆరుతడులు ఇవ్వాలి. ఆ తర్వాత మడిలో పలచగా నీరు పెట్టాలి. చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే రాత్రి వేళల్లో నారుమడిపై పాలిథిన్ షీటు కప్పి, ఉదయాన్నే తీసేయాలి. రబీ వరిలో జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఈ లోపాన్ని నివారించేందుకు లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేసుకోవాలి.

 

కలుపు నివారణ ఇలా...
విత్తనాలు చల్లిన 3-5 రోజులకు 10 లీటర్ల నీటికి 75 మిల్లీలీటర్ల బెంధియోకార్బ్ లేదా 80 మిల్లీలీటర్ల బుటాక్లోర్ కలిపి 5 సెంట్ల నారుమడిలో పిచికారీ చేసినట్లయితే ఊద వంటి కలుపు మొక్కల్ని నిర్మూలించవచ్చు. కలుపు మందు పిచికారీ చేసేటప్పుడు నారుమడిలో నీటిని తీసేయాలి. కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే విత్తనాలు చల్లిన 15వ రోజున 10 లీటర్ల నీటిలో 20 మిల్లీలీటర్ల చొప్పున సైహలోఫాప్ బ్యూటైల్ కలిపి పిచికారీ చేయాలి.

చీడపీడల నివారణ కోసం...
విత్తనాలు చల్లిన 12-14 రోజుల తర్వాత నారుమడిలో కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, హిస్పా, తామర పురుగులు కన్పించినట్లయితే అవసరాన్ని బట్టి లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్‌ఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నారు తీయడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడిలో 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు లేదా 250 గ్రాముల ఫోరేట్ 10జీ గుళికలు వేసుకుంటే ప్రధాన పొలంలో కాండం తొలుచు పురుగు, ఉల్లికోడును సమర్ధవంతంగా అరికట్టవచ్చు. అలాగే నారుమడిని పొడ తెగులు, కాండం కుళ్లు తెగులు సోకకుండా ఉండాలంటే పరిసరాల్లో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. నారుమడిలో తెగుళ్లు కన్పిస్తే అవసరాన్ని బట్టి లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ 5 ఈసీ లేదా వాలిడామైసిన్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

నారు తీసేటప్పుడు...
నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి. దీనివల్ల మూన త్వరగా తిరుగుతుంది. 4-6 ఆకులు వచ్చిన తర్వాతే నారు పీకాలి. విత్తనాలు చల్లిన 25-30 రోజుల మధ్య నారు తీసి ప్రధాన పొలంలో నాట్లు వేయాలి. నారు మొక్కల వయసు ఎట్టి పరిస్థితుల్లోనూ 35 రోజులు దాటకూడదు. నారు తీసేటప్పుడు మొక్కల వేర్లు తెగకుండా చూడాలి.

నాట్లు వేసేటప్పుడు...
నాట్లు వేసేటప్పుడు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది. నారును పైపైన నాటితే ఎక్కువ పిలకలు తొడిగే అవకాశం ఉంది. నాట్లు వేసేట ప్పుడు భూసారాన్ని అనుసరించి అవసరమైన పోషకాలు అందించాలి. నాట్లు వేసేటప్పుడు పొలంలో నీరు పలచగా ఉండాలి. మొక్కలు నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకూ 20 సెంటీమీటర్ల కాలిబాట తీయాలి. దీనివల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా అందుతాయి. చీడపీడల తాకి డి కొంత వరకూ తగ్గుతుంది. ఎరువులు వేయ డం, పురుగు-కలుపు మందులు పిచికారీ చేయ డం సులభమవుతుంది. పైరు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి తగిన చర్యలు తీసుకోవడానికి కూడా కాలిబాటలు ఉపయోగపడతాయి.

ఇవి గుర్తుంచుకోండి
వరుసలు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల చొప్పున దూరాన్ని పాటిస్తూ చదరపు మీటరుకు 44 మొక్కలు ఉండేలా వరి నాట్లు వేసుకోవాలి. చివరి దుక్కిలో విధిగా ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేయాలి. సిఫార్సు చేసిన నత్రజనిని 3 సమాన భాగాలుగా చేసి నాట్లకు ముందు దమ్ములోనూ, పైరు దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశలోనూ వేసుకోవాలి. నత్రజని ఎరువును బురద పదునులో మాత్రమే వెదజల్లి, 36-48 గంటల తర్వాత నీరు పెట్టాలి. 50 కిలోల యూరియాకు 10 కిలోల చొప్పున వేపపిండిని కలిపి వేస్తే నత్రజని వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది.

సిఫార్సు చేసిన భాస్వరం ఎరువును పూర్తిగా దమ్ములోనే వేయాలి. రేగడి నేల అయితే పొటాష్ ఎరువును కూడా పూర్తిగా ఆఖరి దమ్ములోనే వేయాలి. ఒకవేళ చల్కా (తేలిక) నేల అయితే ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే సమయంలో మిగిలిన సగం పొటాష్‌ను వేసుకోవాలి. కాంప్లెక్స్ ఎరువుల్ని పైరు దుబ్బు చేసే సమయంలో, అంకురం ఏర్పడే సమయంలో పైపాటుగా వేయకూడదు. దమ్ములోనే వేయడం మంచిది. జింక్ సల్ఫేట్‌ను భాస్వరం ఎరువుతో కలిపి వేయకూడదు. ఈ రెండు ఎరువులు వేయడానికి మధ్య కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. అలాగే పైరుపై జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసేటప్పుడు దానిలో పురుగు/తెగుళ్ల మందు కలపకూడదు.

File Courtesy: 
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=54868&Categoryid=7&subcatid=7
Image Courtesy: 
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=54868&Categoryid=7&subcatid=7
13
Dec

రబీ వరి సాగులో మెలకువలు/ Effective management practices in Rabi Paddy

COURTESY :AGRICLINIC MONTHLY MAGAZINE -December 2012

21
May

అక్షయధాన్

 

File Courtesy: 
వారి పరిశోధనా సంచాలనాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్
21
May

సంపద

 

File Courtesy: 
వారి పరిశోధనా సంచాలనాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్
16
May

అగ్గి తెగులు నివారణ చర్యలు

 

File Courtesy: 
Rice Section, Acharya N G Ranga Agricultural University, Rajendranagar
16
May

అగ్గి తెగులు ఉదృతిని పెంచే కారణాలు, తెగులు వ్యాప్తి

 

File Courtesy: 
Rice Section, Acharya N G Ranga Agricultural University, Rajendranagar
16
May

అగ్గి తెగులు లక్షణాలు
File Courtesy: 
Rice Section, Acharya N G Ranga Agricultural University, Rajendranagar
11
May

వరి అధిక దిగుబడికి మేలైన యజమాన్య పద్దతులు

 
File Courtesy: 
Directorate of Rice Research
4
May

ఆకు ఎండు తెగులు

File Courtesy: 
Directorate of Rice Research, Hyderabad
4
May

అగ్గి తెగులు

File Courtesy: 
Directorate of Rice Research, Hyderabad
25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో పంటకోత, నిలువ

1. వెన్నులో కనీసం 75 % గింజలు పక్వానికి వచ్చినప్పుడు కోత కోయాలి. సరిగా పక్వానికి రాకముందు కోసినట్లయితే గింజలు జీవ శక్తిని కోల్పోతాయి.

2. కోసిన పంటను పొలంలోనే 2-3 రోజులు ఆరబెట్టాలి.

3. ధాన్యం నూర్చి, తూర్పారబట్టాక ధాన్యంలో ఇతర పదార్ధాలేమీ లేకుండా చూసుకోవాలి.

4. గింజలోని తేమ 13 శాతానికి తగ్గేవరకూ తూర్పారబట్టిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలి.

5. ధాన్యాన్ని తక్కువ ఆరబెట్టినా, ఎక్కువ ఆరబెట్టినా ప్రాసెస్సింగ్ సమయంలో గింజ విరిగిపోతుంది.

25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో ఎలుకల నివారణ

1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :

• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి.
• గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం.
• ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి.
• దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి.

25
Nov

దక్షిణ తెలంగాణా మండలంలో పూత తర్వాత దశలో రసాయనాలతో చీడపురుగుల నివారణ

పూత తర్వాత దశలో

సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్.) :

• ఈనిక దశలో సిఫార్సు చేసిన మందులను వాడాలి.

కట్వర్మ్స్ (మొక్కలను కోరికివేసే గొంగళి పురుగులు) :

• పొలానికి నీరుపెట్టి సాయంకాలం వేళల్లో ఈ మందులు లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి - డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + ఎండోసల్ఫాన్ 2.0 మీ.లీ. (లేదా) డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ.  

Syndicate content
Copy rights | Disclaimer | RKMP Policies